ఆగస్ట్ 9న విడుదల కానున్న 2013 స్కొడా ఆక్టావియా

By Ravi

స్కొడా ప్రియులకు గుడ్ న్యూస్. ఆక్టావియా సెడాన్ గురించి స్కొడా ప్రియులకు కొత్తగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. గతంలో భారత మార్కెట్లో మంచి సక్సెస్ సాధించిన ఈ సెడాన్ ప్రస్తుతం దేశీయ విపణి నుంచి తొలగిపోయిన సంగతి తెలిసినదే. అయితే, ఇందులో ఓ రిఫ్రెష్డ్ వెర్షన్‌ను కంపెనీ ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల చేసింది. ఈ కారు విడుదల కోసం భారత్‌లో స్కొడా ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో, సరికొత్త 2013 స్కొడా ఆక్టావియా సెడాన్ అనుకున్న సమయం కంటే ముందుగానే భారత్‌లో విడుదల కానుంది. ఈ సెడాన్‌ను ఆగస్ట్ 9, 2013వ తేదీన భారత మార్కెట్లో విడుదల చేస్తామని స్కొడా ఆటో ప్రకటించింది. గడచిన మార్చ్ నెలలో జరిగిన 2013జెనీవాలో జరిగిన 83వ అంతర్జాతీయ మోటార్ షోలో కంపెనీ తమ ప్రొడక్షన్ వెర్షన్ ఆక్టావియాను ఆవిష్కరించింది. ఈ కొత్త స్కొడా ఆక్టావియాకు సంబంధించిన మరింత సమాచారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

ప్లాట్‌ఫామ్

ప్లాట్‌ఫామ్

ఫోక్స్‌వ్యాగన్ గ్రూపు నుంచి పాపులర్ అయిన కొత్త ఎమ్‌క్యూబి ఫ్లాట్‌ఫామ్‌ను ఉపయోగించి కొత్త ఆక్టావియాను తయారు చేశారు. పాత వెర్షన్ ఆక్టావియాతో పోల్చుకుంటే, 2013 స్కొడా ఆక్టావియా అన్ని విధాలుగా ఎన్నో రెట్లుగా మెరుగ్గా ఉంటుంది.

విశాలమైనది

విశాలమైనది

మునపటి వెర్షన్ ఆక్టావియాతో పోల్చుకుంటే కొత్త ఆక్టావియా మరింత విశాలమైనది. కారు లోపల విశాలమైన ఇంటీరియర్ స్పేస్‌ను కలిగి ఉండి, ప్రయాణికులకు సౌకర్యవంతమైన అనుభూతిని కల్పిస్తుంది. దీని బూట్ స్పేస్ 590 లీటర్లు.

మోడ్రన్ సేఫ్టీ ఫీచర్లు

మోడ్రన్ సేఫ్టీ ఫీచర్లు

ఈ కారులో కామన్ సేఫ్టీ ఫీచర్లతో పాటుగా తొమ్మిది ఎయిర్ బ్యాగ్‌లు, లేన్ అసిస్టెన్స్, ఆటోమేటిక్ బ్రేకింగ్ సిస్టమ్, ఫటిగ్ డిటెక్షన్ సిస్టమ్ వంటి మోడ్రన్ సేఫ్టీ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఇంటెలిజెంట్ ఫీచర్లు

ఇంటెలిజెంట్ ఫీచర్లు

అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ట్రాఫిక్ సైన్ రికగ్నైజేషన్ సిస్టమ్, హై అండ్ లో బీమ్ మద్య ఆటోమేటిక్‌గా స్విచ్ అయ్యే ఇంటెలిజెంట్ లైట్ అసిస్టెంట్ సిస్టమ్ వంటి అధునాతన ఇంటెలిజెంట్ ఎలక్ట్రానిక్ ఫీచర్లు కొత్త ఆక్టావియా సొంతం.

ఇంజన్ ఆప్షన్స్

ఇంజన్ ఆప్షన్స్

పెట్రోల్ వెర్షన్ ఆక్టావియోలో 1.8 లీటర్ టిఎస్ఐ టర్బో ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఇది గరిష్టంగా 180 బిహెచ్‌‍పిల శక్తిని, 250 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ వెర్షన్ ఆక్టావియోలో 2.0 లీటర్ టిడిఐ టర్బో ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఇది గరిష్టంగా 150 బిహెచ్‌‍పిల శక్తిని, 320 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఆక్టావియా విఆర్ఎస్

ఆక్టావియా విఆర్ఎస్

ఆక్టావియాలో పెర్ఫామెన్స్ వెర్షన్ అయిన 'ఆక్టావియా విఆర్ఎస్' మోడల్ కోసం భారత కొనుగోలుదారులు మరికొంత కాలం ఎదురుచూడాల్సిన పరిస్థితి కనబడుతోంది. కొత్త ఆక్టావియా విడుదల సమయంలోనే ఈ వేరియంట్ విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు.

అంచనా ధర

అంచనా ధర

దేశీయ విపణిలో కొత్త స్కొడా ఆక్టావియా ధరలప రూ.14 లక్షల నుంచి రూ.18.50 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.

విడుదల తేది..

విడుదల తేది..

స్కొడా ఆక్టావియా సెడాన్‌ను ఆగస్ట్ 9, 2013వ తేదీన భారత మార్కెట్లో విడుదల చేస్తామని స్కొడా ఆటో ప్రకటించింది.

లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం..

లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం..

కొత్త స్కొడా ఆక్టావియాకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

More from DriveSpark

Article Published On: Thursday, July 25, 2013, 16:52 [IST]
English summary
Here is a welcome news for all Skoda admirers in India. The Czech automaker has confirmed that the all new Octavia premium sedan will be unveiled in India on August 9th.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+