స్కొడా ర్యాపిడ్ ప్లాట్‌ఫామ్‌పై రానున్న హ్యాచ్‌బ్యాక్ వెర్షన్

By Ravi

స్కొడా ప్రియులకు ఓ స్వీట్ న్యూస్. స్కొడా నుంచి ఓ చిన్న కారును కోరుకునే వారి కోరికను కంపెనీ త్వరలోనే తీర్చనుంది. చెక్ రిపబ్లిక్‌కు చెందిన కార్ల తయారీ సంస్థ స్కొడా ఆటో తాజాగా అందుబాటులోకి తీసకువచ్చిన 'స్కొడా ర్యాపిడ్' సెడాన్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని, ఇందులో ఓ హ్యాచ్‌బ్యాక్ వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకురాన్నట్లు కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. చైనాలో అట్టహాసంగా ప్రారంభమైన 2013 షాంగై ఆటో షోలో స్కొడా చైనీస్ ఆపరేషన్స్ హెడ్ ఆండ్రియాస్ హఫెమ్యాన్ మాట్లాడుతూ.. ర్యాపిడ్‌లో కొత్త వేరియంట్ పనులు జరుగుతున్నాయని అన్నారు.

ప్రస్తుతం భారత మార్కెట్లో స్కొడా ఆటో ఇండియా తమ హ్యాచ్‌బ్యాక్ ఫ్యాబియాను ఆఫర్ చేస్తుంది. అయితే, ఈ మోడల్ అమ్మకాలు అంతంత మాత్రంగానే సాగుతుండటం మరియు ఇది కాస్త పాత డిజైన్ మోడల్ కావటం వలన ఈ సెగ్మెంట్లో అమ్మకాలను పెంచుకునేందుకు కంపెనీ ఓ అధునాత హ్యాచ్‌బ్యాక్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో యూరోపియన్ మార్కెట్లలో స్కొడా అందిస్తున్న అధునాతన ర్యాపిడ్ సెడాన్‌ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని ఇందులో ఓ హ్యాచ్‌బ్యాక్ వేరియంట్‌ను కంపెనీ అభివృద్ధి చేస్తుంది.

స్కొడా ర్యాపిడ్ హ్యాచ్‌బ్యాక్ తొలుత యూరోపియన్ మార్కెట్లలో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత మార్కెట్లో ఇది ఈ సెగ్మెంట్లోని మారుతి సుజుకి స్విఫ్ట్ వంటి మోడళ్లకు మంచి పోటీగా నిలిచే అవకాశం ఉంది. భారత్‌లో స్కొడా విడుదల చేయనున్న ఈ ర్యాపిడ్ హ్యాచ్‌‌బ్యాక్, ప్రస్తుతం దేశీయ విపణిలో కంపెనీ అందిస్తున్న ఫ్యాబియా స్థానాన్ని భర్తీ చేస్తుందా లేదా ఫ్యాబియాకు దిగువన ప్రవేశపెట్టనుందా అనే విషయం తేలాల్సి ఉంది. తాజా సమాచారం కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

స్కొడా ర్యాపిడ్ ప్లాట్‌ఫామ్‌పై హ్యాచ్‌బ్యాక్

స్కొడా ర్యాపిడ్

స్కొడా ర్యాపిడ్

More from DriveSpark

Article Published On: Tuesday, April 23, 2013, 11:24 [IST]
English summary
Skoda has confirmed a hatchback version of its affordable sedan Rapid. The boss of Skoda's Chinese operation, Andreas Hafemann, speaking on the eve of the Shanghai motor show revealed that a "new derivative of the Rapid" was in the works.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+