డిఎస్‌జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో స్కొడా ర్యాపిడ్ డీజిల్!
చెక్ రిపబ్లిక్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ స్కొడా ఇండియా అందిస్తున్న మిడ్-సైజ్ సెడాన్ ర్యాపిడ్‌లో కంపెనీ ఓ అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఇదివరకటి కథనంలో తెలుగు డ్రైవ్‌స్పార్క్ ప్రచురించిన సంగతి తెలిసినదే. తాజా అప్‌డేట్ ప్రకారం, సరికొత్త స్కొడా ర్యాపిడ్ 2015 డీజిల్ వెర్షన్ పాపులర్ డిఎస్‌జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభ్యం కానున్నట్లు సమాచారం.
స్కొడా నుంచి లభిస్తున్న అతి తక్కువ ధర కలిగిన స్కొడా ర్యాపిడ్ కంపెనీ ఇప్పటి వరకు బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా ఉంది. అయితే, మిడ్-సైజ్ సెడాన్ సెగ్మెంట్లో మార్కెట్ లీడర్‌గా హోండా సిటీతో లేదా ఫోక్స్‌వ్యాగన్ వెంటోతో పోల్చుకుంటే, దీని అమ్మకాలు తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో, ర్యాపిడ్ అమ్మకాలను పెంచుకునేందుకు గాను కంపెనీ ఇందులో సరికొత్త వెర్షన్లను పరిచయం చేయనుంది.
డ్రైవ్ చేయటానికి మరింత సౌకర్యంగా ఉండి, ఎక్కువ మైలేజీనిస్తూ, సరసమైన ధరకే అందుబాటులో ఉండేలా కంపెనీ అధునాతన డిఎస్‌జి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో కూడిన సరికొత్త ర్యాపిడ్ సెడాన్‌ను కంపెనీ ఈ ఏడాది చివరి నాటికి కానీ లేదా వచ్చే ఏడాది ఆరంభంలో కానీ విడుదల చేసే విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం కంపెనీ ఉపయోగిస్తున్న పెట్రోల్, డీజిల్ ఇంజన్ల పరిమాణాన్ని తగ్గించడం ద్వారా ఈ మార్పులు చేయనుంది.

ప్రస్తుతం స్కొడా ర్యాపిడ్ సెడాన్ 1.6 లీటర్, 4-సిలిండర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఈ రెండు ఇంజన్లు సమానంగా 105 హార్స్ పవర్‌ల శక్తిని మరియు 153 ఎన్ఎమ్ (పెట్రోల్), 250 ఎన్ఎమ్ (డీజిల్) టార్క్‌లను ఉత్పత్తి చేస్తాయి.
స్కొడా పరిచయం చేయనున్న కొత్త ఇంజన్ల విషయానికి వస్తే, ప్రస్తుత 1.6 లీటర్ డీజిల్ స్థానంలో మరింత ఎక్కువ మైలేజీనిచ్చే 1.5 డీజిల్ ఇంజన్‌ను అలాగే ప్రస్తుత 1.6 లీటర్ పెట్రోల్ ఇంజన్ స్థానంలో 1.2 లీటర్ ఫ్యూయెల్ ఇంజెక్టెడ్ ఇంజన్ (వెంటోలో ఉపయోగిస్తున్నది)ను ఉపయోగించే అవకాశం ఉంది.
తక్కువ పరిమాణం కలిగిన ఈ ఇంజన్లను ఉపయోగించడం వలన మరో ప్రయోజనం కూడా ఉంది. అదేంటంటే, ఈ కొత్త ఇంజన్లు 1500సీసీ సామర్థ్యం కన్నా తక్కువ/సమానంగా ఉండి, ప్రభుత్వం విధించే అదనపు పన్నుల భారం నుంచి తప్పించుకోవచ్చు. ఇప్పటికే ఫోక్స్‌వ్యాగన్ వెంటోలో విజయవంతంగా ఉపయోగిస్తున్న అడ్వాన్స్డ్ డిఎస్‌జి డ్యూయెల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్‌ను ఈ కొత్త ఇంజన్లనకు అనుసంధానం చేయటం వలన, కొత్త 2015 ర్యాపిడ్ ప్రస్తుత మోడళ్ల కన్నా ఎక్కవ మైలేజీని ఆఫర్ చేస్తాయి.
ప్రస్తుతం స్కొడా ర్యాపిడ్ 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్ బాక్స్‌తో లభిస్తుంది. డిఎస్‌జి ఆటోమేటిక్ గేర్ బాక్స్ మరింత రీఫైన్డ్ వెర్షనే కాకుండా, ఇంధనం ఆదా చేసుకునేందుకు కూడా ఇది సహకరిస్తుంది. కొత్త 2015 స్కొడా ర్యాపిడ్‌లో మెకానికల్ మార్పులతో పాటుగా ఎక్స్టీరియర్, ఇంటీరియర్లలో కూడా చెప్పుకోదగిన మార్పులు ఉండొచ్చని అంచనా.


Click it and Unblock the Notifications








