లిమిటెడ్ ఎడిషన్ 'ర్యాపిడ్ ప్రెస్టీజ్'ను విడుదల చేసిన స్కొడా

By Ravi

స్కొడా ఆటో ఇండియా దేశీయ విపణిలో అందిస్తున్న తమ ఎంట్రీ లెవల్ సెడాన్ ర్యాపిడ్‌‌లో ఇప్పుడు ఓ లిమిటెడ్ ఎడిషన్‌ను కంపెనీ అందుబాటులోకి తీసుకువచ్చింది. భారత ఆటోమొబైల్ మార్కెట్లో గడచిన కొద్ది నెలలుగా కార్ల అమ్మకాలు తగ్గుముఖం పడుతుండటంతో తయారీదారులు తమ ఉత్పత్తులలో మరిన్ని అదనపు ఫీచర్లను జోడించిన స్పెషల్ ఎడిషన్లను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలో స్కొడా 'ర్యాపిడ్ ప్రెస్టీజ్' లిమిటెడ్ ఎడిషన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది.

స్కొడా ర్యాపిడ్ ప్రెస్టీజ్ లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్ ధర రూ.8.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించినట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇందులో నావిగేషన్ సిస్టమ్, పార్కింగ్ సెన్సార్స్, విండ్ విజర్స్, ఫ్లోర్ మ్యాట్స్ వంటి ఫీచర్లున్నాయి. ర్యాపిడ్ ప్రెస్టీజ్ ఎడిషన్‌ కారుకు ఇరువైపులా ప్రెస్టీజ్ బ్యాడ్జింగ్ ఉంటుంది. ఇది డీజిల్ వేరియంట్‌లో మాత్రమే లభిస్తుంది. ఇందులో యాంత్రికపరంగా ఎలాంటి మార్పులు లేవు.

స్కొడా ర్యాపిడ్ ప్రెస్టీజ్ లిమిటెడ్ ఎడిషన్‌లో ఉపయోగించిన 1.6 లీటర్ టిడిఐ డీజిల్ ఇంజన్ గరిష్టగా 105 పిఎస్‌ల శక్తిని, 250 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఆకర్షనీయమైన డిజైన్, విశాలమైన స్థలం, అత్యుత్తమ భద్రతా ఫీచర్లు మరియు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో స్కొడా ర్యాపిడ్ సెడాన్ రూపుదిద్దుకుంది.

SKoda Rapid Prestige Limited Edition Launched

స్కొడా ర్యాపిడ్ సెడాన్‌లోని కొన్ని కీల ఫీచర్లను పరిశీలిస్తే..
  • వెనుక సీట్లో కూర్చిన ఎర్గో-లివర్ సాయంతో ఫ్రంట్ ప్యాసింజర్ సీట్‌ను సర్దుబాటు చేసుకోవచ్చు.
  • యాంటీ-పించ్ విండోస్
  • ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ విండోస్ కోసం వన్ టచ్ ఆపరేషన్
  • వెనుక సీట్లలో కూర్చునే ప్రయాణికుల కోసం సర్దుబాటు చేసుకునే సౌకర్యం కలిగిన డ్యూయెల్ రియర్ ఎసి వెంట్స్
  • ఆడియో ప్లేయర్ కోసం సెక్యూరిటీ కోడ్
  • స్టీరింగ్ వీల్ యొక్క ఎత్తు, పొడవు లను సర్దుబాటు చేసుకునే సౌకర్యం.
  • ఫోల్డ్అవే కప్ హోల్డర్స్
  • రఫ్ రోడ్ ప్యాకేజ్
  • డ్రైవర్, ఫ్రంట్ ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్స్
  • ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్)
  • ఆక్స్-ఇన్ సాకెట్, ఎస్‌డి/ఎమ్ఎమ్‌సి డేటా కార్డ్ రీడర్ సపోర్టుతో కూడిన స్కొడా 2-డిన్ ఇంటిగ్రేటెడ్ ఆడియో సిస్టమ్
  • ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్
  • రిమోట్ కంట్రోల్డ్ సెంట్రల్ డోర్ లాకింగ్
  • ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ సైడ్ మిర్రర్స్
  • మల్టీ ఫంక్షన్ ఇన్‌ఫర్మేషన్ డిస్‌ప్లే

More from DriveSpark

Article Published On: Monday, April 22, 2013, 13:24 [IST]
English summary
Skoda Auto India launched a limited edition of its popular selling sedan, the ŠKODA Rapid. The new Rapid Prestige will be priced at Rs 8.99 Lakhs (ex-showroom Delhi) and will come with unlimited features like navigation, parking sensors, wind visors, floor mats that increase the functional benefits for the customer.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+