స్కొడా ర్యాపిడ్ డబుల్ ధమాకా; రెండు స్పెషల్ ఎడిషన్స్
స్కొడా యూకె కస్టమర్లు చాలా లక్కీ. ఎందుకంటే, స్కొడా ప్రియుల కోసం కంపెనీ అందిస్తున్న ఫ్లాగ్‌షిప్ మోడల్ 'ర్యాపిడ్'లో రెండు కొత్త స్పెషల్ ఎడిషన్ వేరియంట్లను ఆఫర్ చేస్తున్నారు. ప్రతి కారు కూడా విశిష్టమైన ఫీచర్లను, అదనపు ఎక్విప్‌మెంట్లను కలిగి ఉంటుంది.
ఈ రెండు స్పెషల్ ఎడిషన్ స్కొడా ర్యాపిడ్‌లలో మొదటిది 'ర్యాపిడ్ ఎస్ఈ కనెక్ట్'. ర్యాపిడ్ 1.2 లీటర్ టిఎస్ఐ 86 పిఎస్ ఎస్ వేరియంట్‌ను ఆధారంగా చేసుకొని ఈ స్పెషల్ ఎడిషన్‌ను తయారు చేశారు. ఇది రెండు మెటాలిక్ పెయింట్ ఎక్స్టీరియర్ కలర్స్ (బ్రిలియంట్ సిల్వర్, డెనిమ్ బ్లూ)లో లభిస్తుంది.
ఇందులో 16-ఇంచ్ యాంటీనా అల్లాయ్ వీల్స్, రియర్ పార్కింగ్ సెన్సార్స్, అముండ్సెన్ శాటిలైట్ నావిగేషన్ విత్ డిఏబి డిజిటల్ ఆడియా సిస్టమ్ వంటి ఫీచర్లతో లభిస్తుంది. యూకే మార్కెట్లో దీని ధర 12,990 పౌండ్లు. ఇలాంటివి కేవలం 800 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

ఇకపోతే రెండవ స్పెషల్ ఎడిషన్ మోడల్ 'ర్యాపిడ్ స్పోర్ట్'. దీనిని 1.2 లీటర్ టిఎస్ఐ 105 పిఎస్ ఎస్ఈ వేరియంట్‌ను ఆధారంగా చేసుకొని తయారు చేశారు. ఇందులో 17-ఇంచ్ రే బ్లాక్ అల్లాయ్ వీల్స్, సన్‌సెట్ గ్రాస్, ఫ్రంట్ ఫాగ్ లైట్స్, స్పోర్ట్స్ సీట్స్, స్టీల్ పెడల్స్, బ్లాక్ డోర్ మిర్రర్స్, రియర్ స్పాయిలర్ వంటి ఫీచర్లు లభిస్తాయి.
స్కొడా ర్యాపిడ్ స్పోర్ట్ స్పెషల్ ఎడిషన్ కేవలం ఒక్క పెయింట్ కలర్ (క్యాండీ వైట్)లో మాత్రమే లభిస్తుంది. యూకే మార్కెట్లో దీని ధర 15,630 పౌండ్లుగా ఉంది. కేవలం 200 యూనిట్ల ర్యాపిడ్ స్పోర్ట్ మోడళ్లను మాత్రమే విక్రయానికి ఉంచనున్నారు. భారత్‌లో కూడా ఈ తరహా స్కొడా ర్యాపిడ్ సెడాన్లను ఆఫర్ చేస్తే, ఈ మోడల్ అమ్మకాలు జోరందుకునే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








