స్కొడా ర్యాపిడ్ సెడాన్‌లో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్!
చెక్ రిపబ్లిక్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ స్కొడా ఇండియా ఇటీవలే ఆక్టావియా, సూపర్బ్ మోడళ్లలో రిఫ్రెష్డ్ వెర్షన్లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసినదే. అలాగే, తమ యెతి ఎస్‌యూవీలో కూడా ఓ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను గడచిన ఫిబ్రవరిలో గ్రేటర్ నోయిడాలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనకు ఉంచింది.
ఈ నేపథ్యంలో, ప్రస్తుతం స్కొడా నుంచి లభిస్తున్న మిడ్-సైజ్ సెడాన్ ర్యాపిడ్‌లో కూడా కంపెనీ అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది చివరి నాటికి కొత్త 2014 స్కొడా ర్యాపిడ్ సెడాన్‌ను ఆవిష్కరించే అవకాశం ఉంది. ఇదే గనుక జరిగితే భారత్‌లో అన్ని స్కొడా ఉత్పత్తులు రిఫ్రెష్ అయినట్లే.

కొత్త స్కొడా ర్యాపిడ్‌లో డిజైన్, ఫీచర్ల పరంగా కొద్దిపాటి మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది. కానీ ఇంజన్ పరంగా మాత్రంలో ఇందులో ఎలాంటి యాంత్రికపరమైన మార్పులు ఉండబోవని తెలుస్తోంది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న 1.6 లీటర్ డీజిల్, 1.6 లీటర్ పెట్రోల్ ఇంజన్లనే ఈ కొత్త ర్యాపిడ్‌లోను ఉపయోగించనున్నారు. ఇవి రెండూ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తాయి.
అయితే, ప్రస్తుతం భారత మార్కెట్లో ఆటోమేటిక్ కార్లకు గిరాకీ పుంజుకున్న తరుణంలో, స్కొడా తమ పెట్రోల్ వెర్షన్ ర్యాపిడ్ సెడాన్‌లో ఓ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కలిగిన వేరియంట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ వేరియంట్‌లో 1.2 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్, 7-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌లను ఉపయోగించవచ్చని అంచనా. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








