స్కొడా ర్యాపిడ్ అల్టిమా విడుదల; ధర రూ.8.33 లక్షలు

చెక్ రిపబ్లిక్ కార్ కంపెనీ స్కొడా ఆటో ఇండియా భారత మార్కెట్లో విక్రయిస్తున్న పాపులర్ సెడాన్ 'ర్యాపిడ్'లో 'స్కొడా ర్యాపిడ్ అల్టిమా' (Skoda Rapid Ultima) అనే కొత్త స్పెషల్ ఎడిషన్‌ను దేశీయ విపణికి పరిచయం చేయనున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ గడచిన డిసెంబర్ నెలలో ఓ కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే.

కాగా.. కంపెనీ ఇప్పుడు ఈ స్పెషల్ ఎడిషన్ స్కొడా ర్యాపిడ్ అల్టిమాను భారత మార్కెట్లో వాణిజ్య పరంగా విడుదల చేసింది. రెగ్యులర్ ర్యాపిడ్‌కు ఈ స్పెషల్ ఎడిషన్ ర్యాపిడ్ అల్టిమాకు కొద్దిపాటి కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్ ఉన్నాయి. ర్యాపిడ్ అల్టిమా పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. దీని ధరలు మరియు ఇందులో లభించే ఫీచర్లు క్రింది విధంగా ఉన్నాయి:


పెట్రోల్ వెర్షన్ ర్యాపిడ్ అల్టిమా ధరలు:
* ర్యాపిడ్ అల్టిమా 1.6 ఎమ్‌పిఐ (మ్యాన్యువల్) యాంబిషన్ ప్లస్ - రూ.8.33 లక్షలు
* ర్యాపిడ్ అల్టిమా 1.6 ఎమ్‌పిఐ (ఆటోమేటిక్) యాంబిషన్ ప్లస్ - రూ.9.30 లక్షలు
* ర్యాపిడ్ అల్టిమా 1.6 ఎమ్‌పిఐ (మ్యాన్యువల్) ఎలిగాన్స్ - రూ.8.95 లక్షలు
* ర్యాపిడ్ అల్టిమా 1.6 ఎమ్‌పిఐ (ఆటోమేటిక్) ఎలిగాన్స్ - రూ.9.91 లక్షలు
డీజిల్ వెర్షన్ ర్యాపిడ్ అల్టిమా ధరలు:
* ర్యాపిడ్ అల్టిమా 1.6 టిడిఐ యాంబిషన్ ప్లస్ - రూ.9.40 లక్షలు
* ర్యాపిడ్ అల్టిమా 1.6 టిడిఐ ఎలిగాన్స్ - రూ.9.97 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)
Skoda Rapid Ultima Features

స్కొడా ర్యాపిడ్ అల్టిమా ఫీచర్లు:
* కారు బానెట్ నుండి వెనుక వరకు అలాగే సైడ్స్‌పై స్పెషల్ గ్రాఫిక్స్
* గార్మిన్ అండ్ టామ్-టామ్ నావిగేషన్ సిస్టమ్
* ప్రొజెక్టర్ లెన్స్ హెడ్‌ల్యాంప్స్
* బ్లూటూత్ టెలిఫోన్ కనెక్టివిటీ
* ఆన్-బోర్డ్ కంప్యూటర్
* స్టీరింగ్ వీల్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్
* పార్కింగ్ సెన్సార్స్
* లెథర్ ప్యాకేజ్
* సెవన్-స్పోక్ అల్లాయ్ వీల్స్
* అల్టిమా బ్యాడ్జింగ్
* మిడిల్ వేరియంట్లో అదనపు ఎయిర్‌బ్యాగ్స్
* లెథరేట్ సీట్ కవర్స్
* అల్టిమా బ్రాండెడ్ ఫ్లోర్ మ్యాట్స్
* అల్టిమా బ్రాండెడ్ డోర్ సిల్ మోల్డింగ్స్

స్కొడా ర్యాపిడ్ అల్టిమా ఎడిషన్‌లో ఇంజన్స్ పరంగా ఎలాంటి మార్పులు లేవు. ఇందులోని 1.6 లీటర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 105 పిఎస్‌ల శక్తిని, 220 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ (గేర్‌బాక్స్)తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

ఇకపోతే.. 1.6 లీటర్ డీజిల్ ఇంజన్ కలిగిన ర్యాపిడ్ కూడా గరిష్టంగా 105 పిఎస్‌ల గరిష్ట శక్తిని, 250 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే, ఈ ఇంజన్ మాత్రం కేవలం 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తోనే లభిస్తుంది.

More from DriveSpark

Article Published On: Monday, March 3, 2014, 11:13 [IST]
English summary
Skoda Auto India has launched the new Rapid Ultima Edition in India. The Skoda Rapid Ultima will be available with both petrol and diesel engine options and is priced between Rs 8.33-9.97 lakh (ex-showroom, Delhi). 
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+