స్కొడా ర్యాపిడ్ వేరియంట్లలో సవరణ; ధరల తగ్గింపు
స్కొడా ఇండియా దేశీయ విపణిలో అందిస్తున్న మిడ్-సైజ్ సెడాన్ ర్యాపిడ్ వేరియంట్ లైనప్‌లో కంపెనీ కొన్ని సవరణలు చేసింది. కొత్త 2014 స్కొడా ర్యాపిడ్ సెడాన్ ఇప్పుడు యాక్టివ్, యాంబిషన్ ప్లస్ మరియు ఎలగాన్స్ అనే మూడు వేరియంట్లలో మాత్రమే లభ్యం కానుంది. ఇదివరకు ఆఫర్ చేసిన యాంబిషన్ వేరియంట్‌ను కంపెనీ నిలిపి వేసింది.
ఇది కూడా చదవండి: హ్యుందాయ్ వెర్నా సిఎక్స్ విడుదల; వేరియంట్ల సవరణ
ఇదే సెగ్మెంట్లో హ్యుందాయ్ అందిస్తున్న వెర్నా సెడాన్ వేరియంట్ లైనప్‌లో కంపెనీ మార్పులు చేసిన కొద్ది రెండు రోజులకే స్కొడా కూడా తమ ర్యాపిడ్ సెడాన్ వేరియంట్ లైనప్‌లో మార్పులు చేయటం గమనార్హం. ఈ సెగ్మెంట్లో సరసమైన ధరకే లభ్యమవుతున్న హోండా సిటీ సెడాన్ నుంచి ఎదురవుతున్న పోటీని సమర్థవంతంగా ఎదుర్కునేందుకు స్కొడా ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది.
స్కొడా ర్యాపిడ్ వేరియంట్ లైనప్‌లో చేసిన మార్పుల చేర్పుల వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

స్కొడా ర్యాపిడ్ యాక్టివ్
బేస్ వేరియంట్ అయిన స్కొడా ర్యాపిడ్ యాక్టివ్‌లో సెంట్రల్ లాకింగ్, ఫ్రంట్ అండ్ రియర్ ఆర్మ్‌రెస్ట్స్, రేక్ అండ్ రీచ్ అడ్జస్టబల్ స్టీరింగ్ కాలమ్, రియర్ ఏసి వెంట్స్‌ను స్టాండర్డ్‌గా ఆఫర్ చేస్తున్నారు.

స్కొడా ర్యాపిడ్ యాంబిషన్ ప్లస్
మిడ్-లెవల్ వేరియంట్ అయిన స్కొడా ర్యాపిడ్ యాంబిషన్ ప్లస్‌లో డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబిఎస్, బ్రేక్ అసిస్ట్ (ఏటి), స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, లెథర్‌తో కవర్ చేయబడిన స్టీరింగ్ వీల్, గేర్ షిఫ్ట్ లివర్, హ్యాండ్‌బ్రేక్ లివర్ మరియు బ్లూటూత్, యూఎస్‌బి కనెక్టివిటీతో కూడిన 2-డిన్ ఆడియో సిస్టమ్, ఎలక్ట్రిక్ ఓవిఆర్ఎమ్ ఫీచర్లను స్టాండర్డ్‌గా అందిస్తున్నారు.

స్కొడా ర్యాపిడ్ ఎలిగాన్స్
టాప్-ఎండ్ వేరియంట్ అయిన స్కొడా ర్యాపిడ్ ఎలిగాన్స్‌లో పైన తెలిపిన ఫీచర్లకు అదనంగా 15 ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్‌ను ఆఫర్ చేస్తున్నారు.

పెట్రోల్ వెర్షన్ 2014 స్కొడా ర్యాపిడ్ ధరలు
Skoda Rapid 1.6 Active MT - INR 7.09 lakhs
Skoda Rapid 1.6 Ambition Plus MT - INR 7.99 lakhs
Skoda Rapid 1.6 Elegance MT - INR 8.59 lakhs
Skoda Rapid 1.6 Ambition Plus AT - INR 8.96 lakhs
Skoda Rapid 1.6 Elegance AT - INR 9.55 lakhs
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

డీజిల్ వెర్షన్ 2014 స్కొడా ర్యాపిడ్ ధరలు
Skoda Rapid 1.6 Active MT - INR 8.26 lakhs
Skoda Rapid 1.6 Ambition Plus MT - INR 9.06 lakhs
Skoda Rapid 1.6 Elegance MT - INR 9.61 lakhs
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)


Click it and Unblock the Notifications








