స్పోర్ట్ వెర్షన్ స్కొడా ఆక్టావియా ఆర్ఎస్ విడుదల

By Ravi

చెక్ రిపబ్లిక్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కొడా ఆటో, ఇదివరకెన్నడూ లేనివిధంగా అత్యంత వేగవంతమైన ప్రొడక్షన్ వెర్షన్ ఆక్టావియా కారును అభివృద్ధి చేసింది. 'స్కొడా ఆక్టావియా ఆర్ఎస్' (Skoda Octavia RS)గా పిలువబడే సాధారణ ఆక్టావియాకు పెర్ఫామెన్స్ అప్‌గ్రేడ్ చేయబడిన వెర్షన్ అని చెప్పవచ్చు. జులై 10న జరగనున్న గుడ్‌వుడ్ ఫెస్టివల్ ఆఫ్ స్పీడ్ కార్యక్రమంలో స్కొడా ఈ కారును ఆవిష్కరించనుంది. ఆ తర్వాత్ యూరప్, యూకె వ్యాప్తంగా వివిధ స్కొడా డీలర్‌షిప్‌లలో ఈ కారును విడుదల చేస్తారు.

స్కొడా ఆక్టావియా ఆర్ఎస్ అత్యంత స్పోర్టీగా ఉంటుందని, ఇది పెర్ఫామెన్స్‌తో పాటుగా మైలేజ్ విషయంలో కూడా ఎక్కడా రాజీ పడదని స్కొడా సీఈఓ ప్రొఫెసర్ డా. హెచ్.సి. విన్‌ఫ్రైడ్ వాలంద్ తెలిపారు. ఇంతటి వేగవంతమైన ఆక్టావియాను తాము గతంలో తయారు చేయలేదని, ఇది విశాలవంతంగా ఉండి ప్రయాణికులకు మంచి సౌకర్యాలను అందిస్తుందని ఆయన అన్నారు. స్పోర్టీ కాంపాక్ట్ క్లాస్ సెగ్మెంట్లో తమ కొత్త ఆక్టావియా ఆర్ఎస్, ఆక్టావియా కాంబి ఆర్ఎస్‌లు కొత్త పరిమితులను సృష్టిస్తాయని వాలంద్ అన్నారు.

ఖాలీ సమయాల్లో మరియు ప్రతిరోజు వాడుకునేందుకు ఇది ఓ చక్కని కారు అని, గరిష్ట శక్తి, అధునాతన టెక్నాలజీల కలయితో ఇది ధరకు తగిన విలువను కలిగి ఉంటుందని ఆయన చెప్పారు. స్కొడా ఆక్టావియా ఆర్ఎస్ గురించి మరింత సమాచారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

ఇంజన్ ఆప్షన్స్

ఇంజన్ ఆప్షన్స్

స్కొడా ఆక్టావియా ఆర్ఎస్‌ రెండు విభిన్న ఇంజన్ ఆప్షన్లలో లభ్యం కానుంది. అవి.. 220 హార్స్‌ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేసే 2.0 లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్, 184 హార్స్‌ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేసే 2.0 లీటర్ టిడిఐ పెట్రోల్ ఇంజన్.

ట్రాన్సిమిషన్

ట్రాన్సిమిషన్

ఈ రెండు ఇంజన్లు కూడా 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్లతో అందుబాటులో ఉంటాయి.

పెర్ఫామెన్స్

పెర్ఫామెన్స్

మ్యాన్యువల్ గేర్‌బాక్స్, పెట్రోల్ ఇంజన్ కలిగిన ఆక్టావియా ఆర్ఎస్ కేవలం 6.8 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0-100 కి.మీ. వేగాన్ని అందుకుటుంది మరియు ఇది గరిష్టంగా గంటకు 248 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది. పెట్రోల్ వెర్షన్ ఆక్టావియా ఆర్ఎస్ 8.1 సెకండ్ల వ్యవధిలో గంటకు 0-100 కి.మీ. వేగాన్ని అందుకుటుంది మరియు ఇది గరిష్టంగా గంటకు 232 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది.

మైలేజ్

మైలేజ్

స్కొడా తమ ఆక్టావియా ఆర్ఎస్ మైలేజ్ గణాంకాలను ఇంకా స్పష్టంగా వెల్లడించకపోయినప్పటికీ, తమ ఇంజన్లు పెర్ఫామెన్స్ పరంగా మెరుగ్గా ఉన్నప్పటికీ 19 శాతం తక్కువ ఇంధనాన్ని ఉపయోగించుకుంటాయని కంపెనీ పేర్కొంది. ఇందులో స్టార్ట్/స్టాప్ సిస్టమ్, బ్రేక్ ఎనర్జీ రీజనరేషన్ సిస్టమ్‌లు స్టాండర్డ్‌గా లభిస్తాయి.

పెర్ఫామెన్స్ అప్‌గ్రేడ్స్

పెర్ఫామెన్స్ అప్‌గ్రేడ్స్

కొత్త స్పోర్టీ స్కొడా ఆక్టావియా ఆర్ఎస్ ఇప్పుడు మరింత స్పోర్టీ సస్పెన్షన్‌ను స్టాండర్డ్‌గా పొందింది. ఈఎస్‌సిలో ఇంటిగ్రేట్ చేసిన ఎలక్ట్రానికి ఎక్స్‌డిఎస్ డిఫరెన్షియల్ లాక్ (ట్రాక్షన్‌ మరియు అండర్‌స్టీర్‌ను తగ్గిస్తుంది) కూడా స్టాండర్డ్‌గా లభిస్తుంది.

కొలతలు

కొలతలు

ఈ కొత్త స్పోర్టీ ఆక్టావియా సెడాన్ సాధారణ వెర్షన్ ఆక్టావియా కన్నా 12 మి.మీ. ఎత్తు తక్కువగాను, 88 మి.మీ. పొడవుగాను, 45 మి.మీ. వెడల్పుగాను ఉంటుంది. దీని వీల్‌బేస్‌ను 102 మి.మీ. మేర పెంచారు.

బాహ్య మార్పులు

బాహ్య మార్పులు

ఆర్ఎస్ స్టయిల్ ఫ్రంట్ బంపర్, క్రోమ్ ఎగ్జాస్ట్ టెయిల్ పైప్స్, బ్లాక్ డిఫ్యూజర్ ఎలిమెంట్, రూఫ్ ఎడ్జ్ స్పాయిలర్ మరియు ఎల్ఈడి బ్రేక్ లైట్లతో ఇది మంచి స్పోర్టీ లుక్‌ను కలిగి ఉంటుంది.

సరికొత్త స్టయిల్

సరికొత్త స్టయిల్

హనీకోంబ్ ఎయిర్ ఇన్‌టేక్స్, ఫాగ్ లైట్స్, ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన బై-జెనాన్ హెడ్‌ల్యాంప్స్ వంటి ఫీచర్లతో ఇది సరికొత్త స్టయిల్‌ను కలిగి ఉంటుంది. ఇంకా ఇందులో 17, 18 మరియు 19 ఇంచ్ అల్లాయ్ వీల్స్ ఆప్షన్ అందుబాటులో ఉంది.

ఇంటీరియర్ అప్‌డేట్స్

ఇంటీరియర్ అప్‌డేట్స్

యాంబీనెంట్ లైటింగ్‌తో కూడిన లోపలివైపు డోర్ హ్యాండిల్స్, స్పోర్ట్ సీట్స్, లెథర్‌తో కవర్ చేయబడిన స్టీరింగ్ వీల్, కొత్త ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్టెయిన్‌లెస్ స్టీల్ పెడల్స్ మరియు సిల్ ప్లేట్స్ వంటి ఇంటీయర్ మార్పులను ఈ కొత్త కారులో గమనించవచ్చు.

ఇండియా లాంచ్?

ఇండియా లాంచ్?

ఈ సరికొత్త స్కొడా ఆక్టావియా ఆర్ఎస్ స్పోర్ట్ వెర్షన్ వచ్చే ఏడాది భారత మార్కెట్లో కూడా విడుదల కావచ్చని అంచనా.

స్కెచ్

స్కెచ్

More from DriveSpark

Article Published On: Thursday, June 6, 2013, 13:33 [IST]
English summary
Skoda has revealed the all new Octavia RS, what it calls the fastest production Octavia ever. Skoda will unveil the new Octavia RS at the Goodwood Festival of Speed on July 10, after which the sporty sedan will hit dealerships across Europe, starting with UK.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+