2014 ఆరంభంలో స్కొడా సూపర్బ్ ఫేస్‌లిఫ్ట్ విడుదల

భారత్‌లో ఇటీవలే ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఆక్టావియా సెడాన్‌ను విడుదల చేసిన స్కొడా ఇండియా, ఇప్పుడు తాజాగా మరో ప్రీమియం కారును దేశీయ విపణలో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. కొత్త స్కొడా ఆక్టావియాకు ఇదివరకటి కన్నా మంచి స్పందన లభిస్తుండటంతో, త్వరలోనే ఓ అప్‌గ్రేడెడ్ సూపర్బ్ ప్రీమియం కారును విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోంది.

స్కొడా సూపర్బ్ కొత్త ఆక్టావియా కన్నా మరిన్ని ప్రీమియం ఫీచర్లతో, అత్యంత విలాసవంతంగా ఉండనుంది. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, వచ్చే ఏడాది ఆరంభంలో కొత్త 2014 స్కొడా సూపర్బ్ డి-సెగ్మెంట్ సెడాన్ విడుదలయ్యే ఆస్కారం ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో న్యూఢిల్లీలోని గ్రేటర్ నోయిడాలో జరగనున్న 2014 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో కూడా ఈ కారును ప్రదర్శించవచ్చని తెలుస్తోంది.


ఈ ఫొటోల్లో మనం చూస్తున్నది, కొత్త స్కొడా సూపర్బ్‌లో కనిపించనున్న డిజైన్ మార్పులకు సంబంధించినవి. కొత్త ఆక్టావియా డిజైన్ థీమ్ నుంచి స్ఫూర్తి పొంది, కొత్త సూపర్బ్‌ను డిజైన్ చేయనున్నారు. ముందు వైపు గమనిస్తే, కొత్త గ్రిల్, బానెట్, హనీకోంబ్ గ్రిల్, లోవర్ ఎయిర్‌డ్యామ్, రీడిజైన్డ్ హెడ్‌ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్ వంటి మార్పులు కొత్త సూపర్బ్‌లో ఉండే అవకాశం ఉంది.
Skoda Superb Rear

వెనుక డిజైన్‌ను గమనిస్తే, సగం బాడీపై, సగం బూట్ డోర్‌పై ఉండే స్ప్లిట్ టెయిల్ ల్యాంప్స్ (కొత్త ర్యాపిడ్‌లో ఈ తరహా డిజైన్‌ను చూడొచ్చు), రివైజ్డ్ రియర్ బంపర్, లైసెన్స్ ప్లేట్ స్లాట్ వంటి మార్పులు ఇందులో చూడొచ్చు. ఇంటీరియర్స్‌లో కూడా ఇందులో కొద్దిపాటి మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది. కాగా.. ఇంజన్ పరమైన మార్పుల గురించి కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ప్రస్తుతం లభిస్తున్న స్కొడా సూపర్బ్ కారులో 1.8 లీటర్ టర్బో పెట్రోల్, 2.0 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్లను ఉపయోగిస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Wednesday, December 18, 2013, 15:34 [IST]
English summary
Skoda, earlier this year, reintroduced the Octavia nameplate with the launch of the facelifted model. The new Octavia has since then been selling better than its predecessor. Skoda could soon follow up with a similar treatment to its upper D-segment model, the Superb saloon, which is one of the better selling models from the Czech automaker India lineup.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+