స్కొడా సూపర్బ్ ఫేస్‌లిఫ్ట్ విడుదల: ధర, వివరాలు

By Ravi

స్కొడా ఇండియా దేశీయ విపణిలో అందిస్తున్న ప్రీమియం సెడాన్ 'సూపర్బ్'లో కంపెనీ ఓ కొత్త వేరియంట్‌ను ప్రవేశపెట్టింది. మునుపటి వెర్షన్ సూపర్బ్‌తో పోల్చుకుంటే డిజైన్, ఫీచర్ల పరంగా మరింత మెరుగ్గా ఉండేలా తయారు చేసిన ఈ కొత్త ఆక్టావియా ప్రారంభ ధర రూ.18.87 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించినట్లు కంపెనీ పేర్కొంది.

కొత్త 2014 స్కొడా సూపర్బ్‌లో చేసిన మార్పులు చేర్పులు, దీని వేరియంట్లు మరియప ధరలు మొదలైన సమాచారం ఈ ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి.

స్కొడా సూపర్బ్ ఫేస్‌లిఫ్ట్ విడుదల

సరికొత్త బట్టర్‌ఫ్లై గ్రిల్, కొత్త టూ-టోన్ స్కొడా లోగో, రీషేప్డ్ హెడ్‌ల్యాంప్స్ అండ్ ఫాగ్‌ల్యాంప్స్, రీప్రొఫైల్డ్ బంపర్ వంటి మార్పులను ఇందులో గమనించవచ్చు.

స్కొడా సూపర్బ్ ఫేస్‌లిఫ్ట్ విడుదల

అలాగే, ఈఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన బై-జెనాన్ హెడ్‌లైట్స్‌ను ఇందులో కొత్తగా ఆఫర్ చేస్తున్నారు. ఇప్పుడు టాప్-ఎండ్ వేరియంట్ (ఎలిగాన్స్)లో పవర్ వాషర్స్ ఆఫర్ చేస్తున్నారు. టర్న్ ఇండికేటర్‌ సి-ఆకారంలో ఉండే ఎల్ఈడి లైట్లతో చేయబడినది.

స్కొడా సూపర్బ్ ఫేస్‌లిఫ్ట్ విడుదల

వెనుక డిజైన్‌ను గమనిస్తే, సగం బాడీపై, సగం బూట్ డోర్‌పై ఉండే స్ప్లిట్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ రివైజ్డ్ రియర్ బంపర్, లైసెన్స్ ప్లేట్ స్లాట్, స్పాయిలర్ వంటి మార్పులు చేశారు.

స్కొడా సూపర్బ్ ఫేస్‌లిఫ్ట్ విడుదల

కొత్త 2014 స్కొడా సూపర్బ్ ఇంటీరియర్స్‌లో కూడా కొద్దిపాటి మార్పులు చేర్పులున్నాయి.

స్కొడా సూపర్బ్ ఫేస్‌లిఫ్ట్ విడుదల

అయితే, ఇంజన్ పరంగా మాత్రం కొత్త స్కొడా సూపర్బ్‌లో ఎలాంటి మార్పులు లేవు. ప్రస్తుతం లభిస్తున్న స్కొడా సూపర్బ్ కారులో 1.8 లీటర్ టర్బో పెట్రోల్, 2.0 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్లనే ఇందులోను ఉపయోగిస్తున్నారు.

స్కొడా సూపర్బ్ ఫేస్‌లిఫ్ట్ విడుదల

పెట్రోల్ వేరియంట్లు - ధరలు

స్కొడా సూపర్బ్ 1.8 టిఎస్ఐ ఎమ్‌టి యాంబిషన్ - రూ.18.87 లక్షలు

స్కొడా సూపర్బ్ 1.8 టిఎస్ఐ ఎమ్‌టి ఎలిగాన్స్ - రూ.20.65 లక్షలు

స్కొడా సూపర్బ్ 1.8 టిఎస్ఐ ఏటి ఎలిగాన్స్ - రూ.22.27 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

స్కొడా సూపర్బ్ ఫేస్‌లిఫ్ట్ విడుదల

డీజిల్ వేరియంట్లు - ధరలు

స్కొడా సూపర్బ్ 2.0 టిడిఐ ఏటి యాంబిషన్ - రూ.23.43 లక్షలు

స్కొడా సూపర్బ్ 2.0 టిడిఐ ఏటి ఎలిగాన్స్ - రూ.25.20 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

More from DriveSpark

Article Published On: Monday, February 10, 2014, 16:05 [IST]
English summary
Skoda India has launched the Superb facelift at Rs 18.87 lakh (Ex-showroom, Delhi). The New Skoda Superb gets styling tweaks at the front which include an all-new “butterfly” grille with the new two-tone Skoda logo, the head- and fog-lamps are reshaped and the front bumper is also re-profiled. 
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+