స్కొడా విజన్ సి కాన్సెప్ట్ స్కెచ్ విడుదల
స్కొడా ఫొక్స్‌వ్యాగన్‌కు బడ్జెట్ కార్ బ్రాండ్ అయినప్పటికీ, చెక్ రిపబ్లిక్‌కు చెందిన ఈ కార్ కంపెనీ అత్యుత్తమంగా కనిపించే కార్లను తయారు చేయటం మాత్రం మానేయలేదు. ఈ ప్రయత్నంలో భాగంగానే, స్కొడా మరో సరికొత్త కాన్సెప్ట్ కారును వచ్చే నెలలో ప్రపంచానికి పరిచయం చేయనుంది.
వచ్చే నెలలో జరగనున్న 2014 జెనీవా మోటార్ షోలో ఓ సరికొత్త కాన్సెప్ట్ ఆవిష్కరించనుంది. ఆ కాన్సెప్ట్ పేరు 'విజన్ సి'. ఈ నేపథ్యంలో, స్కొడా విజన్ సి కాన్సెప్ట్ కారుకు సంబంధించిన ఓ అఫీషియల్ స్కెచ్‌ను కంపెనీ విడుదల చేసింది. ఆసలు కాన్సెప్ట్‌ను జెనీవా మోటార్ షోలో ప్రదర్శించనున్నారు.

స్కొడా విజన్ సి ఓ ఫోర్ డోర్ కూపే కాన్సెప్ట్. ఇది ప్రస్తుత ఆక్టావియా సెడాన్‌ను అత్యధిక స్టయిలిష్‌గా తీర్చిదిద్దితే తయారైనదిగా అనిపిస్తుంది. బాడీ పొడవును షార్ప్ క్యారెక్టర్ లైన్స్‌ను ఈ స్కెచ్‌లో గమనించవచ్చు. స్కొడా విజన్ సి కాన్సెప్ట్‌ను పాపులర్ ఎమ్‌క్యూబి ప్లాట్‌ఫామ్‌పైనే అభివృద్ధి చేసే అవకాశం ఉంది.
త్రికోణాకృతిలో ఉండే షార్ప్ హెడ్‌ల్యాంప్ డిజైన్, అదేమాదిరిగా ఉండే ఫాగ్‌ల్యాంప్స్‌ను ఈ స్కెచ్‌లో చూడొచ్చు. అలాగే, ఇందులో పెద్ద అల్లాయ్ వీల్స్‌ను కూడా గమనించవచ్చు. ప్రస్తుతానికి స్కొడా విజన్ సి కాన్సెప్ట్‌కు సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని కంపెనీ వెల్లడించలేదు. మార్చ్ 4, 2014వ తేది నుంచి ప్రారంభం కానున్న 2014 జెనీవా మోటార్ షోలో ఈ కాన్సెప్ట్ కారును ఆవిష్కరించిన తర్వాత దీనికి సంబంధించిన వివరాలను కంపెనీ తెలిపే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








