కొన్ని ఈకోస్పోర్ట్ వేరియంట్ల బుకింగ్‌లను నిలిపివేసిన ఫోర్డ్
అమెరికాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ ఫోర్డ్ ఇండియా, భారత మార్కెట్లో అందిస్తున్న సక్సెస్‌ఫుల్ కాంపాక్ట్ ఎస్‌యూవీ 'ఈకోస్పోర్ట్'లో కొన్ని వేరియంట్ల బుకింగ్‌లను నిలిపివేసింది. దేశీయ విపణిలో ఫోర్డ్ ఈకోస్పోర్ట్ ఊహించని రీతిలో విజయం సాధించిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, ఈకోస్పోర్ట్ ఉత్పత్తికి మించి డిమాండ్ వస్తుండటంతో, కొన్ని వేరియంట్ల బుకింగ్‌లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు కంపెనీ పేర్కొంది.
కొన్ని వేరియంట్ల వెయిటింగ్ పీరియడ్ గణనీయంగా పెరుగుతోందని, అందుకే తాత్కాలికంగా సదరు వేరియంట్ల బుకింగ్‌లను నిలిపి వేశామని ఫోర్డ్ ఇండియా అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. అయితే, ఏయే వేరియంట్ల ఉత్పత్తిని నిలిపివేసిన విషయాన్ని ఆయన వెల్లడించలేదు. అలాగే, ఇప్పటి వరకూ ఎన్ని పెండింగ్ బుకింగ్‌లు ఉన్న విషయాన్ని కూడా కంపెనీ స్పష్టం చేయలేదు.

డీలర్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ బుకింగ్‌ల నిలిపివేత డీలర్‌షిప్ నుంచి డీలర్‌షిప్‌కు వేర్వేరుగా ఉంటోంది. కొందరు డీలర్లు ఎంట్రీ లెవల్ వేరియంట్ డీజిల్ వెర్షన్ ఈకోస్పోర్ట్ బుకింగ్‌లను నిలిపివేయగా, మరికొందరు డీలర్లు టాప్-ఎండ్, మిడ్-లెవల్ వేరియంట్ డీజిల్ వెర్షన్ ఈకోస్పోర్ట్ బుకింగ్‌లను నిలిపివేస్తున్నట్లు సమాచారం. ఇంకొంతమంది డీలర్లు ఆప్షనల్ వేరియంట్ 1.0 లీటర్ ఈకోబూస్ట్ ఇంజన్ కలిగిన పెట్రోల్ వెర్షన్ ఈకోస్పోర్ట్ బుకింగ్‌లను నిలిపివేస్తున్నారు.
ఫోర్డ్ ఇండియా, తమ కాంపాక్ట్ ఎస్‌యూవీ 'ఈకోస్పోర్ట్'ను జూన్ 26న భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇది దేశీయ విపణిలో విడుదలైన 17 రోజుల్లోనే 30,000 బుకింగ్‌లను దక్కించుకుంది. సియామ్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, జులై నెలలో ఫోర్డ్ ఇండియా మొత్తం 8717 కార్లను విక్రయించగా, అందులో 4715 కార్లు ఈకోస్పోర్ట్ ఎస్‌యూవీలు కావటం విశేషం.

భారత మార్కెట్లో ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 1.5 లీటర్ పెట్రోల్ వేరియంట్ల ధరలు రూ.5.59 లక్షల నుంచి రూ.8.44 లక్షల మధ్యలో ఉండగా, 1.5 లీటర్ డీజిల్ వేరియంట్ల ధరలు రూ.6.69 లక్షల నుంచి రూ.8.99 లక్షల రేంజ్‌లోను, 1.0 లీటర్ ఈకోబూస్ట్ టెక్నాలజీ కలిగిన పెట్రోల్ వేరియంట్ల ధరలు రూ.7.89 లక్షల నుంచి రూ.8.28 లక్షల రేంజ్‌లో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).


Click it and Unblock the Notifications








