కళ్యాణి మోటార్స్ స్పెషల్ ఎడిషన్ మారుతి సుజుకి రిట్జ్

By Ravi

బెంగుళూరు: ప్లాటినం ఎడిషన్ పేరిట సరికొత్త డీలర్ స్పెసిఫిక్ మారుతి సుజుకి స్విఫ్ట్‌ను కొనుగోలుదారులకు అందిస్తున్న బెంగుళూరుకు చెందిన మారుతి సుజికి అధీకృత డీలర్‌షిప్ 'కళ్యాణి మోటార్స్', ఇప్పుడు తాజాగా మారుతి సుజుకి రిట్జ్ హ్యాచ్‌బ్యాక్‌లో మరో స్పెషల్ ఎడిషన్‌ను ఆఫర్ చేస్తోంది. రెగ్యులర్ వెర్షన్ రిట్జ్‌తో పోల్చుకుంటే, ఈస్పెషల్ ఎడిషన్ రిట్జ్ భిన్నంగా కనిపిస్తుంది.

కర్ణాటకలో అత్యంత పాపులర్ అండ్ ట్రస్టెడ్ మారుతి సుజుకి డీలర్ అయిన కళ్యాణి మోటార్స్ అందిస్తున్న ఈ స్పెషల్ ఎడిషన్ మారుతి సుజుకి రిస్జ్ కారు కూడా కంపెనీ ఆఫర్ చేస్తున్న స్పెషల్ ఎడిషన్ కాదు. ఇది ప్రత్యేకించి సదరు డీలర్ మోడిఫై చేసిన స్పెషల్ రిట్జ్. కళ్యాణి మోటార్స్ డీలర్‌షిప్ ఈ రిట్జ్ కారును ప్రత్యేకంగా కస్టమైజ్ చేసి కొనుగోలుదారులకు అందిస్తోంది.

తమ కొత్త స్పెషల్ మారుతి రిట్జ్ గురించి, అందులో సదరు డీలర్ ఆఫర్ చేస్తున్న ఫీచర్ల గురించి కళ్యాణి మోటార్స్ తెలిపిన వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి

కళ్యాణి స్పెషల్ 'మారుతి రిట్జ్'

కళ్యాణి స్పెషల్ ఎడిషన్ మారుతి సుజుకి రిట్జ్ కారును వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్‌లో ఆఫర్ చేస్తున్నారు.

కళ్యాణి స్పెషల్ 'మారుతి రిట్జ్'

ఈ కళ్యాణి స్పెషల్ ఎడిషన్ రిట్జ్ కారు ముందు వైపు లైసెన్స్ ప్లేట్ వెనుక భాగం, ఫాగ్ ల్యాంప్స్ చుట్టూ, వెనుక వైపు లైసెన్స్ ప్లేట్ పై భాగం మరియు డోర్ హ్యాండిల్స్ మరియు సైడ్ మిర్రర్స్ బ్లూ కలర్ కోటింగ్‌తో లభిస్తాయి.

కళ్యాణి స్పెషల్ 'మారుతి రిట్జ్'

కళ్యాణి మోటార్స్ ఆఫర్ చేస్తున్న ఈ స్పెషల్ ఎడిషన్ రిట్జ్ కారు ఫ్రంట్ గ్రిల్‌ను పూర్తిగా బాడీ కలర్‌తో మ్యాచ్ అయ్యేలా తెలుపు రంగులో పెయింట్ చేశారు.

కళ్యాణి స్పెషల్ 'మారుతి రిట్జ్'

కళ్యాణి స్పెషల్ ఎడిషన్ రిట్జ్ కార వెనుక వైపు కంపెనీ రూఫ్ రెయిల్‌ను అదనంగా ఆఫర్ చేస్తుంది.

కళ్యాణి స్పెషల్ 'మారుతి రిట్జ్'

ఇంటీరియర్స్‌లో కంపెనీ ఓ సరికొత్త మ్యూజిక్ సిస్టమ్ ఈ కొత్త మారుతి రిట్జ్ కారుతో ఆఫర్ చేస్తున్నారు.

కళ్యాణి స్పెషల్ 'మారుతి రిట్జ్'

ఈ అదనపు ఫీచర్లను జోడించినందుకు గాను, కొత్త రిట్జ్ ధరపై కళ్యాణి మోటార్స్ అదనంగా రూ.35,000 వసూలు చేస్తోంది.

కళ్యాణి మోటార్స్

ఈ కారుకు సంబంధించిన మరింత సమాచారం కోసం బెంగుళూరులోని అధీకృత కళ్యాణి మోటార్స్‌ను సంప్రదించండి.

More from DriveSpark

Article Published On: Friday, December 6, 2013, 13:19 [IST]
English summary
Bangalore based Maruti Suzuki official dealer Kalyani Motors is offering special edition Ritz. This new Maruti Suzuki Ritz i now available at Kalyani Motors. Please visit the stores for more details.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+