స్పై షాట్స్: కెమెరాకు చిక్కిన టాటా నానో డీజిల్ వెర్షన్
దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ అందిస్తున్న ప్రజల కారు 'టాటా నానో'లో కంపెనీ ఓ డీజిల్ వెర్షన్‌ను అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసినదే. టాటా మోటార్స్ ఇప్పటికే, తమ డీజిల్ నానోను భారత రోడ్లపై టెస్టింగ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో, డీజిల్ వెర్షన్ టాటా నానో రహస్య చిత్రాలను మా సన్నిహిత బ్లాగ్ రష్‌లేన్ తమ కెమెరాలో బంధించింది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం రండి..!
టాటా మోటార్స్ ఇటీవలే తమ నానో కారును అప్‌గ్రేడ్ చేసి మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. కొత్త నానో ఎక్స్టీరియర్, ఇంటీరియర్లలో కొద్దిపాటి మార్పులు చేర్పు చేయడంతో పాటుగా, వినియోగదారుల ఎంపిక మేరకు నాలుగు రకాల ఆప్షనల్ ప్యాకేజీలను కూడా కంపెనీ అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో కొత్త నానో అమ్మకాలు క్రమంగా జోరందుకున్నాయి.
కాగా.. ఇదే ట్రెండ్‌లో డీజిల్ వెర్షన్ నానోను కూడా మార్కెట్లో విడుదల చేసినట్లయితే, ఇక నానో అమ్మకాలక తిరుగు ఉండదు. ఈ స్పైషాట్లను బట్టి చూస్తే, పెట్రోల్ వెర్షన్ టాటా నానో కారుకు, డీజిల్ వెర్షన్ నానో కారుక అనేక తేడాలు ఉన్నట్లు తెలుస్తోంది. అవేంటో తెలియాలంటే ఈ ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి.

బేసిక్ డిజైన్
టాటా నానో ఓవరాల్ బేసిక్ డిజైన్ మాత్రం పెట్రోల్ వెర్షన్ మాదిరిగానే ఉంటుంది.

ఫ్రంట్ డిజైన్
ఫ్రంట్ బంపర్ మాత్రం పూర్తి భిన్నంగా ఉంటుంది. పెద్ద హనీకోంబ్ గ్రిల్‌తో కూడిన బంపర్, ఫాగ్ ల్యాంప్స్ ఆప్షన్‌ను డీజిల్ వెర్షన్ టాటా నానోలో గమనించవచ్చు.

వెనుక డిజైన్
కొత్త డీజిల్ వెర్షన్ టాటా నానో వెనుక డిజైన్‌లో కూడా ముందువైపు ఉన్నట్లుగానే పెద్ద హనీకోంబ్ స్మైలీ గ్రిల్‌ను ఇందులో గమనించవచ్చు. ఇంజన్‌ను కూల్‌గా ఉంచేందుకు పెద్ద గ్రిల్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

ఇంటీరియర్స్
ఇంటీరియర్లలో డీజిల్ వెర్షన్ నానోకు, పెట్రోల్ వెర్షన్ నానోకు పెద్దగా మార్పులు ఉండే అవకాశం లేదు. కొత్త 2013 టాటా నానోలో జోడించిన అనేక అధనపు ఇంటీరియర్ ఫీచర్లను ఈ డీజిల్ వెర్షన్ నానోలోను చూడొచ్చు.


Click it and Unblock the Notifications








