శాంగ్‌యాంగ్ తొలి కాంపాక్ట్ ఎస్‌యూవీ 'టివోలి' విడుదల

By Ravi

భారత ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా గ్రూపుకి చెందిన కొరియన్ కార్ కంపెనీ శాంగ్‌యాంగ్, తమ మొట్టమొదటి కాంపాక్ట్ ఎస్‌యూవీ 'టివోలి' (Tivoli)ని దక్షిణ కొరియా మార్కెట్లో విడుదల చేసింది. శాంగ్‌యాంగ్ టివోలి ఓ గ్లోబల్ కాంపాక్ట్ ఎస్‌యూవీ. అంటే, ఇది కేవలం కొరియన్ మార్కెట్లోనే కాకుండా, పలు ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో (భారత్‌లో) కూడా లభ్యమయ్యే ఆస్కారం ఉంది.

కొరియన్ మార్కెట్లో శాంగ్‌యాంగ్ టివోలి ప్రారంభ ధర 16.3 మిలియన్ వొన్ (సుమారు రూ.9.31 లక్షలు)గా ఉంది. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీలో లేటెస్ట్ 1.6 లీటర్ ఇంజన్‌ను ఉపయోగించారు. సంవత్సరానికి లక్ష టివోలీ కార్లను విక్రయించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 40 వేల యూనిట్లను కొరియన్ మార్కెట్లో విక్రయించాలని, మిగిలిన వాటిని ఎగుమతి చేయాలని నిర్ణయించారు.

శాంగ్‍‌‌యాంగ్ టివోలి కాంపాక్ట్ ఎస్‌యూవీకి సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకుందాం రండి..!

శాంగ్‌యాంగ్ టివోలి

టివోలి కాంపాక్ట్ ఎస్‌యూవీ కోసం 350 బిలియన్ కొరియన్ వొన్‌లను పెట్టుబడిగా వెచ్చించామని, కేవలం 42 నెలల్లోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేశామని శాంగ్‌యాంగ్ తెలిపింది.

శాంగ్‌యాంగ్ టివోలి

శాంగ్‌యాంగ్ టివోలి డ్యూయెల్-టోన్ బాడీ, రూఫ్ ఆప్షన్స్ కలిగి ఉంటుంది. కార్ యజమానుల వ్యక్తిగత అభిరుచి ప్రకారం వీటిని ఎంచుకునే అవకాశం ఉంటుంది.

శాంగ్‌యాంగ్ టివోలి

శాంగ్‌యాంగ్ టివోలి బ్లాక్, రెడ్, వైట్, సిల్వర్ బాడీ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. కస్టమర్లు ఈ కలర్ ఆప్షన్లకు తగినట్లుగా వింగ్ మిర్రర్స్, రూఫ్, రియర్ స్పాయిలర్‌లను కస్టమర్లు తమకు నచ్చిన కలర్‌లో ఎంచుకోవచ్చు.

శాంగ్‌యాంగ్ టివోలి

ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇంటీరియర్లను అత్యంత విలాసవంతంగా తీర్చిదిద్దారు. ఇది 1795 మి.మీ. వెడల్పును (ఈ సెగ్మెంట్లో కెల్లా వెడల్పైనది) కలిగి ఉండి, విశాలమైన ఇంటీరియర్ స్పేస్‌ను ఆఫర్ చేస్తుంది. ఇందులో 423 లీటర్ల బూట్ స్పేస్ (ఈ సెగ్మెంట్లో కెల్లా ఎక్కువ)ను కలిగి ఉంటుంది.

శాంగ్‌యాంగ్ టివోలి

ఇంకా ఇందులో ఫల్ ఫ్లాట్ ఫోల్డింగ్ సెకండ్ రో సీట్స్, డి-కట్ స్టీరింగ్ వీల్, 3.5 ఇంచ్ డిస్‌ప్లేతో కూడిన సిక్స్ కలర్ ఇన్ఫోటైన్‌మెంట్ క్లస్టర్, మూడు విభిన్న ఇంటీరియర్ కలర్ థీమ్స్ (రెడ్, బ్లాక్, బీజ్), సెమీ బకెట్ సీట్స్ వంటి కీలక ఫీచర్లున్నాయి.

శాంగ్‌యాంగ్ టివోలి

శాంగ్‌యాంగ్ టివోలి కాంపాక్ట్ ఎస్‌యూవీలో ఉపయోగించిన 1.6 లీటర్ ఇంజన్ గరిష్టంగా 126 పిఎస్‌ల శక్తిని, 160 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. మ్యాన్యువల్ వెర్షన్ లీటరుకు 12.3 కి.మీ. మైలేజీని, ఆటోమేటిక్ వెర్షన్ లీటరుకు 12 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ తెలిపింది.

శాంగ్‌యాంగ్ టివోలి

ప్రతి టివోలి కాంపాక్ట్ ఎస్‌యూవీలో కూడా స్మార్ట్ స్టీర్ అనే ఫీచర్ ఉంటుంది. ఇందులో మూడు డ్రైవింగ్ మోడ్స్ (నార్మల్, కంఫర్ట్, స్పోర్ట్) ఉంటాయి. డ్రైవర్ తన ఇష్టానికి తగినట్లుగా ఈ డ్రైవింగ్ మోడ్స్‌ను ఎంచుకోవచ్చు.

శాంగ్‌యాంగ్ టివోలి

శాంగ్‌యాంగ్ టివోలి మోడల్‌ను అత్యధిక ధృడత్వం కలిగిన (హెచ్ఎస్ఎస్) స్టీల్‌తో తయారు చేశారు. దీని బాడీ నిర్మాణంలో దాదాపు 71.4 శాతం ఈ మెటీరియల్‌నే ఉపయోగించారు. అలాగే, షాషీలో ఆల్ట్రాహై స్ట్రెన్త్ స్టీల్ (యూహెచ్ఎస్ఎస్)ను ఉపయోగించారు. దీని ఫలితంగా, ఇది ఈ సెగ్మెంట్లో కెల్లా ధృడమైన కారుగా ఉంటుంది.

శాంగ్‌యాంగ్ టివోలి

సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో పెద్ద డిస్క్ బ్రేక్‌లు, మల్టీ ఫంక్షనల్ ఈఎస్‌పి (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, టిపిఎమ్ఎస్ (టైర్ ప్రెజర్ మోనిటరింగ్ సిస్టమ్), ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్, ఏబిఎస్, ఎయిర్‌బ్యాగ్స్ వంటి ఫీచర్లున్నాయి.

శాంగ్‌యాంగ్ టివోలి

ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే.. దీనిని మోడ్రన్ స్మార్ట్ ఫోన్లతో కనెక్ట్ చేసుకునే విధంగా డిజైన్ చేయబడి ఉంటుంది. ఇందులో 7-ఇంచ్ డిస్‌ప్లేతో కూడిన టచ్‌స్క్రీన్ ఉంటుంది. ఇది ఇన్ఫోటైన్‌మెంట్‌గానే కాకుండా రివర్స్ పార్కింగ్ సిస్టమ్‌గా కూడా ఉపయోగపడుతుంది. ఇందులోని ఆరు స్పీకర్లు అత్యుత్తమ ఆడియో అనుభూతిని అందిస్తాయి.

Most Read Articles

English summary
SsangYong Motor Company (SYMC), a part of the US $ 16.5 billion Mahindra Group, today announced the launch of its eagerly awaited ‘Tivoli compact SUV model in Seoul, South Korea. 
Story first published: Wednesday, January 14, 2015, 10:39 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X