మహీంద్రా - శాంగ్‌యాంగ్ నెక్స్ట్ ప్రోడక్ట్: కొరాండో ఎస్‌యూవీ

By Ravi

దేశపు అగ్రగామి యుటిలిటీ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) స్వాధీనం చేసుకున్న కొరియన్ ఆటోమొబైల్ కంపెనీ శాంగ్‌యాంగ్ నుండి మరొక కొత్త ఉత్పత్తి భారత మార్కెట్లోకి రానుంది. కంపెనీ ఇటీవల విడుదల చేసిన శాంగ్‌యాంగ్ రెక్స్టన్ ప్రీమియం ఎస్‌యూవీకి దిగువన అందుబాటులో ధరలో శాంగ్‌యాంగ్ కొరాండో ఎస్‌యూవీని మహీంద్రా అండ్ మహీంద్రా విడుదల చేయనుంది. గడచిన సంవత్సరం జనవరిలో జరిగిన 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో కంపెనీ కొరాండో ఎస్‌యూవీని ప్రదర్శనకు ఉంచింది.

లగ్జరీ కార్ ప్రియుల ఆదరణతో శాంగ్‌యాంగ్ రెక్స్టన్ సక్సెస్ సాధించినట్లుగానే కొరాండో కూడా మంచి సక్సెస్‌ను తన ఖాతాలో వేసకోగలదని కంపెనీ ఆశిస్తోంది. ప్రస్తుతం శాంగ్‌యాంగ్ కొరాండో ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేసే అంశాన్ని ఎమ్ అండ్ ఎమ్ అధ్యయనం చేస్తుంది. ఇది ఈ సెగ్మెంట్లోని స్కొడా యెటి వంటి ఎస్‌యూవీలతో పోటీ పడనుంది. శాంగ్‌యాంగ్ కొరాండో 2-లీటర్ పెట్రోల్ ఇంజన్, 2-లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కావచ్చని అంచనా. ఈ రెండు ఇంజన్లు కూడా 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్లతో లభ్యం కానున్నాయి. భారత మార్కెట్లో శాంగ్‌యాంగ్ కొరాండో ధర రూ.15 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.

శాంగ్‌యాంగ్ కొరాండో ఎస్‌యూవీ

శాంగ్‌యాంగ్ కొరాండో ఎస్‌యూవీ

శాంగ్‌యాంగ్ తమ కొరాండో ఎస్‌యూవీని తొలిసారిగా 1983లో విడుదల చేసింది.

శాంగ్‌యాంగ్ కొరాండో ఎస్‌యూవీ

శాంగ్‌యాంగ్ కొరాండో ఎస్‌యూవీ

ఇండియన్ మార్కెట్లోకి రానున్న శాంగ్‌యాంగ్ కొరాండో ఎస్‌యూవీని, శాంగ్‌యాంగ్ 2010లో కొరియాలో విడుదల చేసిన థర్డ్ జనరేషన్ కొరాండో ప్లాట్‌ఫామ్ ఆధారంగా తయారు చేయవచ్చని అంచనా.

శాంగ్‌యాంగ్ కొరాండో ఎస్‌యూవీ

శాంగ్‌యాంగ్ కొరాండో ఎస్‌యూవీ

ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లలో లభిస్తున్న కొరాండో ఎస్‌యూవీని, శాంగ్‌యాంగ్ 2008 ప్యారిస్ మోటార్ షోలో ఆవిష్కరించిన సి 200 కాన్సెప్ట్‌ను ఆధారంగా చేసుకొని నిర్మించారు.

శాంగ్‌యాంగ్ కొరాండో ఎస్‌యూవీ

శాంగ్‌యాంగ్ కొరాండో ఎస్‌యూవీ

ప్రస్తుతం లభిస్తున్న శాంగ్‌యాంగ్ కొరాండో ఎస్‍‌యూవీ 5-డోర్ వెర్షన్. ఇది వరకటి కొరాండోలో 3-డోర్, 5-డోర్ ఆప్షన్లు అందుబాటులో ఉండేవి.

శాంగ్‌యాంగ్ కొరాండో ఎస్‌యూవీ

శాంగ్‌యాంగ్ కొరాండో ఎస్‌యూవీ

శాంగ్‌యాంగ్ కొరాండో ఎస్‌యూవీ విశాలమైన ఇంటీరియర్ స్థలాన్ని కలిగి ఉంటుంది.

శాంగ్‌యాంగ్ కొరాండో ఎస్‌యూవీ

శాంగ్‌యాంగ్ కొరాండో ఎస్‌యూవీ

దీని ఇన్‌స్ట్రుమెంటల్ ప్యానెల్ డిజిటల్, అనలాగ్ కాంబినేషన్‌తో ఉంటుంది.

శాంగ్‌యాంగ్ కొరాండో ఎస్‌యూవీ

శాంగ్‌యాంగ్ కొరాండో ఎస్‌యూవీ

శాంగ్‌యాంగ్ కొరాండో 2-లీటర్ పెట్రోల్ ఇంజన్, 2-లీటర్ డీజిల్ ఇంజన్లతో లభ్యమవుతుంది. ఈ ఇంజన్లు 6-స్పీడ్ ఆటోమేటిక్, 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌లకు జతచేయబడి ఉంటాయి.

శాంగ్‌యాంగ్ కొరాండో ఎస్‌యూవీ

శాంగ్‌యాంగ్ కొరాండో ఎస్‌యూవీ

శాంగ్‌యాంగ్ కొరాండోలో స్మార్ట్ స్టోరేజ్ స్పేస్ ఉంటుంది.

శాంగ్‌యాంగ్ కొరాండో ఎస్‌యూవీ

శాంగ్‌యాంగ్ కొరాండో ఎస్‌యూవీ

ఇండియాలో స్కొడా యెటి వంటి మోడళ్లతో శాంగ్‌యాంగ్ కొరాండో పోటీ పడనుంది.

శాంగ్‌యాంగ్ కొరాండో ఎస్‌యూవీ

శాంగ్‌యాంగ్ కొరాండో ఎస్‌యూవీ

దేశీయ విపణిలో శాంగ్‌యాంగ్ కొరాండో ధర రూ.15 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.

శాంగ్‌యాంగ్ కొరాండో ఎస్‌యూవీ

శాంగ్‌యాంగ్ కొరాండో ఎస్‌యూవీ

శాంగ్‌యాంగ్ కొరాండో ఎస్‌యూవీ

శాంగ్‌యాంగ్ కొరాండో ఎస్‌యూవీ

శాంగ్‌యాంగ్ కొరాండో ఎస్‌యూవీ

శాంగ్‌యాంగ్ కొరాండో ఎస్‌యూవీ

శాంగ్‌యాంగ్ కొరాండో ఎస్‌యూవీ

శాంగ్‌యాంగ్ కొరాండో ఎస్‌యూవీ

శాంగ్‌యాంగ్ కొరాండో ఎస్‌యూవీ

More from DriveSpark

Article Published On: Thursday, January 24, 2013, 11:49 [IST]
English summary
South Korean SUV specialist Ssangyong, now owned by India's Mahindra and Mahindra, is all set to have a greater presence in the Indian SUV market. Mahindra is planning to launch a second Ssangyong SUV in India following the Rexton. The new model being considered for India is the Ssangyong Korando premium SUV.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+