హైదరాబాద్‌లో శాంగ్‌యాంగ్ రెక్స్టన్ ఆర్ఎక్స్6 విడుదల

By Ravi

హైదరాబాద్: ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) స్వాధీనం చేసుకున్న కొరియన్ ఆటోమొబైల్ కంపెనీ శాంగ్‌యాంగ్‌, భారత మార్కెట్లో విక్రయిస్తున్న హై-ఎండ్ ప్రీమియం ఎస్‌యూవీ 'రెక్స్టన్'లో మహీంద్రా ఇప్పుడు మరో కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది.

రాష్ట్ర విపణిలో 'శాంగ్‌యాంగ్ రెక్స్టన్ ఆర్ఎక్స్6' వేరియంట్ ధర రూ.20.11 లక్షలు (ఎక్స్-షోరూమ్, హైదరాబాద్)గా ఉంది. శాంగ్‌యాంగ్ రెక్స్టన్‌ ఎస్‌యూవీ ఇప్పటికే రెండు వేరియంట్లలో (ఆర్ఎక్స్5, ఆర్ఎక్స్7), టూ-వీల్ డ్రైవ్ (4x2) మరియు ఫోర్-వీల్ డ్రైవ్ (4x4) ఆప్షన్‌తో లభ్యమవుతుంది. తాజా వేరియంట్ (ఆర్ఎక్6) రాకతో మొత్తం రెక్స్టన్ వేరియంట్ల సంఖ్య మూడుకు చేరుకుంది.


ప్రస్తుతం శాంగ్‌యాంగ్ రెక్స్టన్ ఆర్‌ఎక్స్7 ధర రూ.21.28 లక్షలు గాను శాంగ్‌యాంగ్ రెక్స్టన్ ఆర్‌ఎక్స్5 ధర రూ.19 లక్షలు గాను ఉన్నాయి. కాగా.. ఈ కొత్త శాంగ్‌యాంగ్ రెక్స్టన్ ఆర్ఎక్స్5 వేరియంట్ శాటిన్ వైట్, మూన్‌డస్ట్ సిల్వర్, వోల్కానో బ్లాక్, ఓప్యులెంట్ పర్పల్ అనే నాలుగు ఆకర్షనీయమైన రంగుల్లో లభిస్తుంది. ఇందులో 2.7 లీటర్, 5-సిలిండర్, ఆర్ఎక్స్270ఎక్స్‌డిఐ ఇంజన్‌‌ను ఉపయోగించారు.

ఇందులో జిపిఎస్ నావిగేషన్, డివిడి, సిడి, ఎమ్‌పి3, ఎఫ్ఎమ్, యూఎస్‌బి సపోర్ట్‌తో కూడిన 6-ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, బయటి వాతావరణానికి అనువుగా సర్దుబాటు అయ్యే పూర్తి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, డ్రైవర్ సీట్, ఓవిఆర్ఎమ్ (సైడ్ మిర్రర్స్) సర్దుబాటును స్టోర్ చేసి ఉంచే 3 మెమరీ ఫంక్షన్స్, టిల్ట్/ఓపెన్ ఫంక్షన్‌తో కూడిన ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, స్టీరింగ్ వీల్‌పై ఆడియో కంట్రోల్ క్రూయిజ్ కంట్రోల్, వర్షం పడగానే ఆటోమేటిక్‌గా ఆన్ అయ్యే వైపర్స్, బయటి కాంతి తగ్గగానే ఆటోమేటిక్‌గా ఆన్ అయ్యే హెడ్‌ల్యాంప్స్, ఎల్ఐఈడి ఇండికేటర్లతో కూడిన పవర్ ఫోల్డబిల్ సైడ్ మిర్రర్స్ వంటి అనేక అధునాక సాంకేతిక ఫీచర్లున్నాయి.

SsangYong Rexton Interior

ఇంకా.. అత్యవసర సమయాల్లో అదుపు తప్పిన వాహనాన్ని నియంత్రణలోకి తెచ్చే ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఈఎస్‌పి), ముందు సీట్లలో కూర్చునే డ్రైవర్, ప్యాసింజర్‌లను రక్షించే ఎయిర్‌బ్యాగ్స్, సమర్థవంతమైన బ్రేకింగ్ కోసం యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్), కొండ ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు రోడ్డుపై వాహనం జారిపోకుండా ఉండేందుకు సహకరించే హిల్ డిసెంట్ కంట్రోల్, యాంటీ స్లిప్ రెగ్యులేషన్ అండ్ యాక్టివ్ రోల్ఓవర్ ప్రొటెక్షన్, ఇంజన్ ఇమ్మొబిలైజర్ మొదలైన ఫీచర్లున్నాయి. ఆర్ఎక్స్5, ఆర్ఎక్స్ వేరియంట్లలో లేని 17 రకాల కొత్త ఫీచర్లను ఈ ఆర్‌ఎక్స్6 వేరియంట్లో ఆఫర్ చేస్తున్నారు.
Most Read Articles

English summary
Mahindra and Mahindra Limited has launched the SsangYong Rexton RX6, a five-speed manual transmission, high-end sports utility vehicle (HSUV) in Hyderabad. The New Rexton RX6 is priced at Rs 20.11 lakh (ex-showroom, Hyderabad).
Story first published: Tuesday, May 6, 2014, 10:41 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X