శాంగ్‌యాంగ్ రెక్స్టన్ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ; ఇండియాకు వస్తుంది!
భారతదేశపు అగ్రగామి యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) స్వాధీనం చేసుకున్న కొరియన్ ఆటోమొబైల్ కంపెనీ శాంగ్‌యాంగ్, ఆఫర్ చేస్తున్న హై-ఎండ్ ప్రీమియం ఎస్‌యూవీ 'రెక్స్టన్'లో కంపెనీ ఇప్పుడు ఓ కొత్త వెర్షన్‌ను కొరియా మార్కెట్లో విడుదల చేసింది. శాంగ్‌యాంగ్ రెక్స్టన్ ఇండియాలో కూడా లభిస్తున్న నేపథ్యంలో, ఈ కొత్త వెర్షన్ కూడా త్వరలోనే భారత మార్కెట్లో లభ్యమయ్యే ఆస్కారం ఉంది.
ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ శాంగ్‌యాంగ్ రెక్స్టన్‌లో కొత్త రేడియేటర్ గ్రిల్, హెచ్ఐడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్, కొత్త టెయిల్ ల్యాంప్ క్లస్టర్, సరికొత్త డిజైన్‌తో కూడిన అల్లాయ్ వీల్స్ వంటి బాహ్య మార్పులు ఉన్నాయి. అలాగే, రిఫ్రెష్డ్ ఇంటీరియర్స్ ఎల్ఈడి క్యాబిన్ ల్యాంప్స్, హీటెడ్ సీట్స్, కొత్త స్టీరింగ్ వీల్, సరికొత్త డిజైన్‌తో కూడిన సెంటర్ కన్సోల్ వంటి అంతర్గత మార్పులు ఉన్నాయి.

కొత్త శాంగ్‌యాంగ్ రెక్స్టన్ ఎస్‌యూవీలో ఎక్స్టీరియర్, ఇంటీరియర్లలో మార్పుల తప్ప ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు. ఇది 2.0 లీటర్ డీజిల్, 2.7 లీటర్ డీజిల్ మరియు 3.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. గేర్‌బాక్స్ ఆప్షన్స్ విషయానికి వస్తే.. 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌లు అందుబాటులో ఉన్నాయి.
రెక్స్టన్ ఫేస్‌లిఫ్ట్ ఆల్-వీల్ డ్రైవ్ మరియు పార్ట్-టైమ్ ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్లతో కూడా లభ్యం కానుంది. ఇంకా ఇందులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఈఎస్‌పి), టైర్ ప్రెజర్ మోనిటరింగ్ సిస్టమ్ (టిపిఎమ్ఎస్), క్రూయిజ్ కంట్రోల్, స్మార్ట్ కీ ఎంట్రీ, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, బ్లూటూత్ ఆధారిత ఆడియో సిస్టమ్ మొదలైన సేఫ్టీ, కంఫర్ట్ ఫీచర్లను జోడించారు.



Click it and Unblock the Notifications








