హైదరాబాద్: వేసవి వేడికి భగ్గుమన్న టాటా ఇండిగో కార్!
హైదరాబాద్: భానుడి కోపానికి కార్లు భగ్గుమంటున్నాయి. మంగళవారం నాడు బేగంపేట్‌కు సమీపంలోని రసూల్‌పుర వద్ద ఓ టాటా ఇండిగో సెడాన్ అగ్నికి ఆహుతైంది. ప్రమాద సమయంలో కారును యూసఫ్ అలీ అనే డ్రైవర్ నడుపుతున్నాడు. ఆ సమయంలో కారులో డ్రైవర్‌తో పాటుగా మరో ఇద్దరు ప్రయాణీకులు కూడా ఉన్నారు.
యూసఫ్ అలీ కారును నడుపుతుండగా, కారు బేగంపేట్‌కు చేరుకునే సమయంలో ఇంజన్ నుంచి ఒక్కసారిగా పొగలు రావటంతో అప్రమత్తమైన డ్రైవర్ కారు లోనుంచి బయటకు తప్పించుకుని, వెనుక సీట్లో ఉన్న ప్రయాణీకులను కూడా క్రిందకు దించేయడంతో ప్రాణ నష్టం తప్పింది.
యూసఫ్ అలీ టాటా ఇండిగో సెడాన్ (డీజిల్ కారు)ను నడుపుకుంటూ పంజాగుట్ట నుంచి సికింద్రాబాద్ వస్తుండాగ, మార్గ మధ్యంలో బేగంపేట వద్దకు వచ్చే సరికి కారు ఇంజన్ నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు వ్యాపించి, క్యాబిన్‌లో మంటలు చేలరేగాయి. ఈ ఘటనలో అందరూ సురక్షితంగా బయటపడ్డారు, కానీ ఫైర్ ఇంజన్ సంఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేలోగా కారు పూర్తిగా కాలిపోయింది.
ఓవైపు ఇదే రోడ్డుపై మెట్రోరైలు పనులు కూడా జరుగుతుండటంతో, ఈ ఘటన వలమ ఆ రోడ్డుగా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎండ వేడికే కారు తగలబడిందని ప్రాధమికంగా భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన అసలు కారణాన్ని అధికారులు విచారిస్తున్నారు.

యూసఫ్ అలీ టాటా ఇండిగో సెడాన్ (డీజిల్ కారు)ను నడుపుకుంటూ పంజాగుట్ట నుంచి సికింద్రాబాద్ వస్తుండగా, మార్గ మధ్యంలో బేగంపేట వద్దకు వచ్చే సరికి కారు ఇంజన్ నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు వ్యాపించి, క్యాబిన్‌లో మంటలు చేలరేగాయి.

ప్రమాద సమయంలో కారును యూసఫ్ అలీ అనే డ్రైవర్ నడుపుతున్నాడు. ఆ సమయంలో కారులో డ్రైవర్‌తో పాటుగా మరో ఇద్దరు ప్రయాణీకులు కూడా ఉన్నారు. అప్రమత్తమైన డ్రైవర్ కారు లోనుంచి బయటకు తప్పించుకుని, వెనుక సీట్లో ఉన్న ప్రయాణీకులను కూడా క్రిందకు దించేయడంతో ప్రాణ నష్టం తప్పింది.

ఈ ఘటనలో అందరూ సురక్షితంగా బయటపడ్డారు, కానీ ఫైర్ ఇంజన్ సంఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేలోగా కారు పూర్తిగా కాలిపోయింది.

ఎండ వేడికే కారు తగలబడిందని ప్రాధమికంగా భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన అసలు కారణాన్ని అధికారులు విచారిస్తున్నారు.


Click it and Unblock the Notifications








