కొత్త ఏ-స్టార్/ఆల్టో తయారీ కోసం సుజుకి ఏ:విండ్ కాన్సెప్ట్

By Ravi

రెగ్యులర్ 1000సీసీ ఆల్టో డిజైన్ చూసి బోర్ కొట్టేసిందా..? ఏ-స్టార్ ఆటోమేటిక్ కారు ఉత్పత్తి నిలిచిపోయిందని చింతిస్తున్నారా..? అయితే, బాధపడకండి. త్వరలోనే మారుతి సుజుకి మీకు ఓ సరికొత్త కాంపాక్ట్ కారును పరిచయం చేయనుంది. అదే ఏ:విండ్ (A:Wind) కాన్సెప్ట్. నెక్స్ట్ జనరేషన్ ఏ-స్టార్ (ఇండియన్ మార్కెట్లో) / ఆల్టో (అంతర్జాతీయ మార్కెట్లలో) తయారీ కోసం సుజుకి ఓ ఏ:విండ్ కాన్సెప్ట్‌ను పరిచయం చేసింది.

ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో జరుగుతున్న అంతర్జాతీయ మోటార్ ఎక్స్ 2013లో సుజుకి ఈ కారును ఆవిష్కరించింది. సుజుకి ఏ:విండ్ కాన్సెప్ట్ కారును ఆధారంగా చేసుకొని మారుతి సుజుకి తమ సరికొత్త కాంపాక్ట్ కారును అభివృద్ధి చేయనుంది. 'గ్లోబల్ కాంపాక్ట్ కారుగా ఇది ఏ-సెగ్మెంట్‌కు తాజా గాలి (విండ్)ని తీసుకువస్తుంద'ని సుజుకి పేర్కొంది.

డైనమిక్ బాడీ, విశాలమైన క్యాబిన్, నాణ్యత అనే మూడు ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని ఏ:విండ్ కాన్సెప్ట్ కారును డిజైన్ చేశారు. ఈ సరికొత్త కారు సంబంధించిన మరింత సమాచారాన్ని క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

సుజుకి ఏ:విండ్ కాన్సెప్ట్

సుజుకి ఏ:విండ్ ఇదివరకటి ఏ-స్టార్/ఆల్టో ఆటోమేటిక్ కారు కన్నా విశాలంగా ఉంటుంది. ఇది 3600 మి.మీ. పొడవును, 1600 మి.మీ. వెడల్పును, 1540 మి.మీ. ఎత్తును, 2425 మి.మీ. వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది.

సుజుకి ఏ:విండ్ కాన్సెప్ట్

ఏ:విండ్ కాన్సెప్ట్ కారులోని డైనమిక్ ఫ్రంట్ గ్రిల్, లెక్సస్ స్పిండల్ గ్రిల్‌ను తలపిస్తుంది. ఈ సరికొత్త గ్రిల్ డిజైన్‌తో సుజుకి ఏ:విండ్ కారు మరింత మోడ్రన్‌గా, స్టయిలిష్‌గా కనిపిస్తుంది.

సుజుకి ఏ:విండ్ కాన్సెప్ట్

సుజుకి ఏ:విండ్ కాన్సెప్ట్ కారులో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్‌ను అమర్చారు. ఇందులో ఎల్ఈడి ల్యాంప్స్ మరో ఆకర్షణగా నిలుస్తాయి. అయితే, ప్రొడక్షన్ వెర్షన్‌కు వచ్చే సరికి ఈ తరహా లైట్లు ఉంటాయనేది మాత్రం సందేహమే.

సుజుకి ఏ:విండ్ కాన్సెప్ట్

వెనుక వైపు కూడా ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ ప్రత్యేకంగా ఉంటాయి. దీని సైడ్ డిజైన్‌ను గమనిస్తే, ఆకర్షనీయమైన స్లీక్ ఫ్లోటింగ్ బాడీ లైన్స్ ఉంటాయి. ఓవరాల్‌గా మొత్తం కారు డిజైన్ స్టయిలిష్‌గా, స్పోర్టీగా అనిపిస్తుంది.

సుజుకి ఏ:విండ్ కాన్సెప్ట్

ఏదేమైనప్పటికీ, సుజుకి ఏ:విండ్ కాన్సెప్ట్ డిజైన్ విషయంలో ఈ చిన్నపాటి కాస్మోటిక్ మార్పులు మినహా ఇది ఆల్టో/ఏ-స్టార్ బేసిక్ డిజైన్‌నే పోలి ఉంటుంది.

సుజుకి ఏ:విండ్ కాన్సెప్ట్

ఈ కాన్సెప్ట్ వెర్షన్‌లో కనిపించే ఫ్యూచరిస్టిక్ ఇంటీరియర్స్ ప్రొడక్షన్ వెర్షన్ కారులో ఉండే అవకాశమే లేదనిపిస్తోంది. ఇంతటి లైట్ కలర్ ఇంటీరియర్లను మాస్ ప్రొడక్షన్ కార్లలో ఉపయోగిచడమంటే కొంచెం కష్టమే.

సుజుకి ఏ:విండ్ కాన్సెప్ట్

ఇంటీరియర్ ఫీచర్లను కూడా వివిధ మారుతి కార్లను సేకరించి ఒక్కచోట అమర్చినట్లు అనిపిస్తుంది. ఉదాహరణకు ఎయిర్ వెంట్స్, స్టీరింగ్, హ్యాండ్‌బ్రేక్, డోర్ హ్యాండిల్స్ ఇవన్నీ ఇదివరకటి మారుతి కార్లలో (ఎక్కువగా వ్యాగన్ఆర్ కారులో) కనిపిస్తాయి.

సుజుకి ఏ:విండ్ కాన్సెప్ట్

సుజుకి ఏ:విండ్ కాన్సెప్ట్ పరిమాణంలో పెద్దిగా ఉంటుంది కాబట్టి, ఇందులో క్యాబిన్ స్పేస్ కూడా విశాలంగానే ఉంటుంది. ఫ్రంట్ అండ్ రీయర్ సీట్లలోని వ్యక్తులు సౌకర్యవంతంగా కూర్చొని ప్రయాణం చేయవచ్చు. ఇంకా విశాలంగా ఓపెన్ అయ్యే డోర్స్ కూడా సులువుగా ఎక్కడానికి, దిగడానికి ఉపయోగపడుతాయి. దీని లగేజ్ స్పేస్ కూడా ఎక్కువగానే ఉంటుంది.

సుజుకి ఏ:విండ్ కాన్సెప్ట్

ఇక సుజుకి సుజుకి ఏ:విండ్ ఇంజన్ విషయానికి వస్తే, ఇందులో 996సీసీ పెట్రోల్ ఇంజన్‌ను అమర్చారు. ఇది సివిటి గేర్‌బాక్సుతో (ఆటోమేటిక్) అనుసంధానం చేయబడి ఉంటుంది. ఇంజన్ నుంచి విడుదలయ్యే శక్తిని ఈ గేర్‌బాక్స్ ముందు చక్రాలకు బదిలీ చేస్తుంది.

సుజుకి ఏ:విండ్ కాన్సెప్ట్

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న 2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో మారుతి సుజుకి ఈ కొత్త ఏ:విండ్ కాన్సెప్ట్ కారును ప్రదర్శించవచ్చని అంచనా. ఈ కారుకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

More from DriveSpark

Article Published On: Friday, November 29, 2013, 12:35 [IST]
English summary
This folks is the Suzuki A:Wind Concept. A car that's expected to be the pre-production version of the next-gen Maruti A-Star and Alto (outside India). The A:Wind Concept, showcased at the Thailand International Motor Expo 2013 and has been developed to "bring fresh wind to the A-segment as a global compact car," according to Suzuki. 
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+