యూరో ఎన్‌సిఏపి క్రాష్ టెస్టులో 3-స్టార్ రేటింగ్ పొందిన సెలెరియో
మారుతి సుజుకి ఇటీవలే భారత మార్కెట్లో విడుదల చేసిన సెలెరియో హ్యాచ్‌బ్యాక్‌ను కేవలం ఇండియన్ మార్కెట్లోనే కాకుండా యూరోపియన్ మార్కెట్లలో కూడా విడుదల చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసినదే. యూరోపియన్ మార్కెట్లలో ఇది మారుతి సుజుకి మాతృ సంస్థ సుజుకి మోటార్ కార్పోరేషన్ బ్రాండింగ్‌తో అమ్ముడుపోనుంది.
ఈ ఏడాది చివరి నాటికి యూరోపియన్ వెర్షన్ మారుతి సుజుకి సెలెరియో మార్కెట్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, యూరోపియన్ సేఫ్టీ స్టాండర్డ్స్‌కు అనుగుణంగా ఈ మోడల్‌ను ధృడంగా తయారు చేశారు. ఇటీవలే నిర్వహించిన యూరో ఎన్‌సిఏపి క్రాష్ టెస్టులో యూరోపియన్ వెర్షన్ సుజుకి సెలెరియో 5 స్టార్లకు గాను 3 స్టార్ల రేటింగ్‌ను దక్కించుకుంది.

యూరోపియన్ మార్కెట్లోని సెలెరియోకి, ఇండియన్ మార్కెట్లో సెలెరియోకి ఇంజన్ పరంగా మాత్రం ఎలాంటి మార్పులు ఉండబోవు. ఇందులో అదే 1.0 లీటర్, కె-సిరీస్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 67 బిహెచ్‌పిల శక్తిని, 90 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 23 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది.
కార్ కేర్ సెట్ పై 10 శాతం తగ్గింపు! పరిమిత స్టాక్! త్వరపడండి!
యూరోపియన్ మార్కెట్లలో విడుదల కానున్న సెలెరియో కారును ఇండియాలో తయారు చేయట్లేదు. ఈ మోడల్‌ను థాయ్‌లాండ్‌లోని సుజుకి ఫ్యాక్టరీలో తయారు చేయనున్నారు. ఇండియన్ వెర్షన్ సెలెరియో కన్నా యూరోపియన్ వెర్షన్ సెలెరియోలోనే ఎక్కువ ఫీచర్లు ఉండనున్నాయి. ఇందులో అదనపు ప్రీమియం ఫీచర్లతో పాటుగా ఇంజన్ స్టార్ట్/స్టాప్ ఫీచర్ కూడా ఉండొచ్చని అంచనా.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/k0AwHKJwz9Q?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








