సుజుకి అలివియోగా మారిన మారుతి సుజుకి సియాజ్
ఈ బ్రౌన్ కలర్‌లో కనిపిస్తున్న కారును ఎక్కడో చూసినట్లుంది కదా..! ఇది చూడటానికి గడచిన ఫిబ్రవరి నెలలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో మారుతి సుజుకి ఆవిష్కరించిన మిడ్-సైజ్ సెడాన్ సియాజ్ కాన్సెప్ట్ మాదిరిగా ఉంది కదా..! ఉండటమేంటి, ఇది నిజానికి సియాజ్ కాన్సెప్టే, అయితే దీని పేరు మాత్రం 'అలివియో' (Alivio).
ఇది కూడా చదవండి: సెప్టెంబర్ 2014లో మారుతి సుజుకి సియాజ్ విడుదల
జపనీస్ కార్ కంపెనీ సుజుకి మోటార్ కార్పోరేషన్ ప్రస్తుతం చైనాలో జరుగుతున్న 2014 బీజింగ్ మోటార్ షోలో ఈ కొత్త సుజుకి అలివియో కాన్సెప్ట్ సెడాన్‌ను ఆవిష్కరించింది. సుజుకి సియాజ్ పేరును అలివియోగా మార్చి బేసిక్ డిజైన్‌లో ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా కొద్దిపాటి కాస్మోటిక్ అప్‌గ్రేడ్ చేసి ఈ కారును చైనా మార్కెట్ కోసం ఇలా మార్చేశారు.

ప్రస్తుతం ఆటోమొబైల్ మార్కెట్లో ఒకే కారును వివిధ దేశాల్లో వివిధ పేర్లతో విక్రయించడం ట్రెండ్‌గా మారిపోయింది. కాగా.. సుజుకి ఆవిష్కరించిన ఈ అలివియోసెడాన్ ప్రొడక్షన్‌కు చాలా దగ్గరగా ఉన్న మోడల్ అని కంపెనీ పేర్కొంది. సుజుకి అవిలియో కాన్సెప్ట్‌ను ఆధారంగా చేసుకొనే భారత కోసం ప్రొడక్షన్ వెర్షన్ మారుతి సుజుకి సియాజ్‌ను తయారు చేయనున్నట్లు తెలుస్తోంది.
అవిలియో కాన్సెప్ట్ సెడాన్‌ను తొలిసారిగా ఏప్రిల్ 2013లో జరిగిన షాంగై ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శనకు ఉంచారు. అప్పట్లో దీనికి అథెంటిక్స్ అనే పేరును పెట్టారు. ఆ తర్వాత ఈ కారులో కొన్ని మార్పులు చేసి తాజాగా అలివియో పేరుతో 2014 బీజింగ్ మోటార్ షోలో ప్రదర్శనకు ఉంచారు.

సుజుకి అలివియో కారులో 1586సీసీ, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. లైట్ వెయిట్ మరియు ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ కారణంగా ఈ ఇంజన్ మెరుగైన మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది. స్మూత్ రైడ్ అనుభూతి కోసం ఇందులో 16-వాల్వ్ వివిటి ఇన్-లైన్ ఇంజన్ టెక్నాలజీని ఉపయోగించారు. ఇందులో కొత్తగా అభివృద్ధి చేసిన 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను అమర్చనున్నారు.


Click it and Unblock the Notifications








