సుజుకి గ్రాండ్ విటారా కాంపాక్ట్ ఎస్‌యూవీ ఆవిష్కరణ
ఫోర్ వీలర్స్ విషయంలో జపాన్‌కు చెందిన సుజుకి భారతదేశపు అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్‌గా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న 2014 ఆటో ఎక్స్‌పోలో కంపెనీ కొన్ని ఆకర్షనీయమైన ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచింది. అందులో ఒకటి ఈ 'స్పెషల్ ఎడిషన్ గ్రాండ్ విటారా'.
గ్రాండ్ విటారా ఓ కాంపాక్ట్ ఎస్‌యూవీ, ఈ విభాగంలోకి ప్రవేశించేందుకు మారుతి సుజుకి కూడా అత్యంత ఉత్సుకతతో ఉంది. ఈ ఏడాది జరుగుతున్న 12వ ఎడిషన్ ఆటో ఎక్స్‌పోలో సుజుకి తమ గ్రాండ్ విటారాలో ఓ స్పెషల్ ఎడిషన్‌ను పరిచయం చేసింది.
అయితే, ఈ బుజ్జి గ్రాండ్ విటారా సెడాన్ ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్‌కు రాకపోయినప్పటికీ, సమీప భవిష్యత్తులో ఇది ఇక్కడి మార్కెట్లో విడుదలయ్యే అవకాశాలున్నాయి. కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో ప్రవేశించడానికి ఇప్పటికే జాప్యం చాలా జాప్యం చేసిన మారుతి సుజుకి ఇకనైనా మేల్కొని, త్వరగా ఈ విభాగంలో ఉత్పత్తులను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సుజుకి ప్రదర్శించిన ఈ స్పెషల్ ఎడిషన్ గ్రాండ్ విటారాకు సంబంధించిన స్పెషాలిటీలు ఏంటో ఈ కథనంలో పరిశీలిద్దాం రండి..!

ఫ్రంట్ డిజైన్
కొత్త సుజుకి గ్రాండ్ విటారాలో మజిక్యులర్ లుక్ కలిగిన ఫ్రంట్ గ్రిల్, ఫ్రంట్ గ్రిల్ చుట్టూ క్రోమ్ యాక్సెంట్, స్టయిలిష్ హెడ్‌ల్యాంప్స్ మరియు ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్‌తో ఇది ఆకర్షనీయమైన డిజైన్‌ను కలిగి ఉండి, ప్రీమియ లుక్ అండ్ ఫీల్‌ను ఆఫర్ చేస్తుంది.

రియర్ డిజైన్
ఈ సుజుకి స్పెషల్ ఎడిషన్ గ్రాండ్ విటారా వెనుక డిజైన్ భారీగా ఉండి, ఓ పెద్ద కార్/ఎస్‌యూవీ లుక్‌నిస్తుంది. దీని టెయిల్ ల్యాంప్స్ సింపుల్‌గా ఉన్నప్పటికీ ఇవి మంచి లుక్‌నిస్తాయి.

సైడ్ డిజైన్
సుజుకి గ్రాండ్ విటారా స్పెషల్ ఎడిషన్ సైడ్ డిజైన్‌ను సింపుల్‌గా ఉంచారు. క్రోమ్ టచ్‌తో కూడిన వింగ్ మిర్రర్స్, డోర్ హ్యాండిల్స్, డోర్స్‌పై క్రోమ్ స్ట్రిప్, సైడ్ స్కర్ట్‌పై క్రోమ్ స్ట్రిప్ మరియు సరికొత్త అల్లాయ్ వీల్స్ డిజైన్‌తో ఇది ప్రీమియం లుక్‌ని ఆఫర్ చేస్తుంది.

ఇంటీరియర్స్
గ్రాండ్ విటారా స్పెషల్ ఎడిషన్ ఇంటీరియర్‌ను లగ్జరీ కార్ ఫీల్‌ను తలపించేలా డిజైన్ చేశారు. డ్యాష్‌బోర్డుపై లెథర్ టచ్, ప్రయాణికుల సౌకర్యార్థం కస్టమ్ చేసిన ఆల్ట్రా ప్రీమియం సీట్స్, యల్లో అండ్ బ్లాక్ కలర్ ఇంటీరియర్ థీమ్‌లు ఇందులో ప్రత్యేక ఆకర్షణలు.

ఎంటర్‌టైన్‌మెంట్
వెనుక సీట్లలో కూర్చుని ప్రయాణించే ప్రయాణికుల వినోదం కోసం ముందు సీట్లకు వెనుక భాగంలో అమర్చబడిన టచ్ స్క్రీన్ ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్స్ ఇందులో మరో ప్రత్యేకతగా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications








