ఈకోస్పోర్ట్‌కు చెక్ పెట్టేందుకు వస్తున్న సుజుకి ఐవి-4
మొత్తానికి మారుతి సుజుకి మేల్కొంది. కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి ఇప్పటికే పలు అంతర్జాతీయ కంపెనీలు ప్రవేశించి, తమ అధునాతన మోడళ్లతో సక్సెస్‌ను ఎగరేసుకుపోతుంటే, ఈ సెగ్మెంట్లో తాజాగా ఎంట్రీ ఇచ్చేందుకు సుజుకి రంగం సిద్ధం చేసింది. మారుతి సుజుకి మాతృసంస్థ, జపాన్‌కు చెందిన సుజుకి మోటార్ కార్పోరేషన్ ఇప్పటికే 'ఐవి-4' (iV-4) అనే పేరుతో ఓ కాంపాక్ట్ ఎస్‌యూవీని అభివృద్ధి చేసింది.
ఈ నేపథ్యంలో సుజుకి ఐవి-4 టీజర్ ఫొటోలను కంపెనీ విడుదల చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో జరగనున్న 2013 ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షోలో ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని అధికారికంగా ఆవిష్కరించనున్నారు. గడచిన సంవత్సరం జనవరిలో జరిగిన 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో సుజుకి ఆవిష్కరించిన ఎక్స్ఏ ఆల్ఫా కాన్సెప్ట్‌ను ఆధారంగా చేసుకొని ఈ మోడల్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది
ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీకి సంబంధించిన మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షోలో విడుదల
వరల్డ్ క్లాస్ డిజైన్‌తో అభివృద్ధి చేసిన సుజుకి ఐవి-4 కాంపాక్ట్ ఎస్‌యూవీని ఈ ఏడాది సెప్టెంబర్ 10న జరగనున్న 2013 ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షోలో తొలిసారిగా ఆవిష్కరించనున్నారు.

డిజైన్ ఫీచర్లు
టీజర్ ఫొటోలను బట్టి చూస్తే, సుజుకి ఐవి-4 కాంపాక్ట్ ఎస్‌యూవీ మంచి గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ కారుకు పైభాగంలో అమర్చిన రూఫ్ మౌంటెడ్ హెడ్‌ల్యాంప్స్ మరొక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అయితే, ఇవి ప్రొడక్షన్ వెర్షన్‌లో ఉంటాయో లేవో వేచి చూడాల్సి ఉంది.

ఎక్స్ఏ ఆల్ఫా కాన్సెప్ట్
సుజుకి ఐవి-4 కాంపాక్ట్ ఎస్‌యూవీని గతంలో కంపెనీ ఆవిష్కరించిన ఎక్స్ఏ ఆల్ఫా కాన్సెప్ట్‌ను ఆధారంగా చేసుకొని అభివృద్ధి చేశారు. వచ్చే ఏడాదిలో జరగనున్న 2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో మారుతి సుజుకి బ్యాడ్జ్‌తో ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని విడుదల చేసే ఆస్కారం ఉంది.

కాంపిటీషన్
సుజుకి నుంచి రానున్న ఐవి-4 కాంపాక్ట్ ఎస్‌యూవీ ఈ సెగ్మెంట్లోని రెనో డస్టర్, ఫోర్డ్ ఈకోస్పోర్ట్ మరియు ఫోక్స్‌వ్యాగన్ నుంచి త్వరలో మార్కెట్లోకి రానున్న టైగన్ వంటి మోడళ్లకు పోటీగా నిలువనుంది.

సెప్టెంబర్‌లో మరింత సమాచారం
సుజుకి ఐవి-4 కాంపాక్ట్ ఎస్‌యూవీకి సంబంధించిన మరింత సమాచారాన్ని సెప్టెంబర్‌లో జరగనున్న ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షోలో వెల్లడిస్తామని కంపెనీ పేర్కొంది.


Click it and Unblock the Notifications








