జపాన్ మార్కెట్లో సుజుకి ఆల్టో టర్బో ఆర్ఎస్ విడుదల

By Ravi

జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం సుజుకి మోటార్ కార్పోరేషన్ (మారుతి సుజుకి మాతృ సంస్థ) గడచిన సంవత్సరం డిసెంబర్ నెలలో ఆవిష్కరించిన 'సుజుకి ఆల్టో టర్బో ఆర్ఎస్' (Suzuki Alto Turbo RS) మోడల్‌ను కంపెనీ తాజాగా జపాన్ మార్కెట్లో విడుదల చేసింది.

సుజుకి ఆల్టో టర్బో ఆర్ఎస్‌ను ఈ ఏడాది ఆరంభంలో జరిగిన 2015 టోక్యో ఆటో సెలన్‌లో ప్రదర్శనకు ఉంచారు. గ్లోబల్ మార్కెట్లలో సుజుకి ఆఫర్ చేస్తున్న స్టాండర్డ్ ఆల్టో మోడల్ కారును ఆధారంగా చేసుకొని ఈ పవర్‌ఫుల్ కారును తయారు చేశారు.

సుజుకి ఆల్టో టర్బో ఆర్ఎస్ కారులో 660సీసీ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. గరిష్ట పవర్, బెటర్ యాక్సిలరేషన్‌ను ఆఫర్ చేసేలా ఈ ఇంజన్‌ను ట్యూన్ చేశారు. ఈ ఇంజన్ ఏజిఎస్ (ఆటో గేర్ షిఫ్ట్ లేదా ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్)తో లభిస్తుంది.

Suzuki Launches Alto Turbo RS Minicar In Japan

ఈ ఇంజన్‌ను పూర్తిగా సరికొత్త ప్లాట్‌ఫామ్‌పై తయారు చేశారు, ఇదివరకటి ఇంజన్లతో పోల్చుకుంటే ఇది చాలా తేలికగా (సుమారు 60 కేజీలు) ఉంటుంది. అధునాతన సేఫ్టీ ఫీచర్లు, స్పెషల్ బాడీ గ్రాఫిక్స్, రీట్యూన్డ్ సస్పెన్షన్ వంటి మార్పులను ఇందులో చూడొచ్చు.

జపాన్‌లో లభిస్తున్న స్టాండర్డ్ సుజుకి ఆల్టోకి ఈ కొత్త సుజుకి ఆల్టో ఆర్ఎస్ టర్బో మోడల్‌కి అనేక కాస్మోటిక్ అప్‍‌గ్రేడ్స్ ఉంటాయి. వైట్ కలర్ బాడీ పెయింట్, రెడ్ డీకాల్స్ అండ్ డీటేలింగ్స్, వెనుక వైపు ఆర్ఎస్ బ్యాడ్జ్, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, క్రోమ్ గార్నిష్ వంటి అప్‌డేట్స్ ఉన్నాయి. ఈ కారులో పెద్ద 17-ఇంచ్ రెడ్ కలర్ అల్లాయ్ వీల్స్‌ను కూడా ఆఫర్ చేస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Wednesday, March 11, 2015, 10:54 [IST]
English summary
Suzuki Motor Corporation has launched the all-new Alto Turbo RS minicar in Japan on 11 March, 2015. Alto Turbo RS is a minicar that has pursued sporty, brisk driving and fun of maneuvering a car.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+