స్పెషల్ ఎడిషన్ ఎర్టిగా ఎలిగాంట్‌ను విడుదల చేసిన సుజుకి

By Ravi

ఆటోమొబైల్స్ విషయంలో ఇండియాకు, ఇండోనేషియా దేశాలకు మధ్య చాలా దగ్గర సంబంధం ఉంది. భారత్‌లో లభ్యమవుతున్న దాదాపు అన్ని రకాల ఆటోమొబైల్ ఉత్పత్తులు ఇక్కడి ఇండోనేషియాకు ఎగుమతి అవుతుంటాయి. అయితే, అక్కడి మార్కెట్‌కు అనుగుణంగా వీటిని ట్యూన్ చేస్తుంటారు.

అలాగే, వివిధ అంతర్జాతీయ కార్ కంపెనీలు కూడా కొన్ని రకాల ఉత్పత్తులను ఇండియాలో కన్నా ముందుగా ఇండోనేషియా మార్కెట్లో విడుదల చేస్తారు. అక్కడి మార్కెట్లో ఇవి సక్సెస్‌ను సాధిస్తే, వాటిని తిరిగి భారత మార్కెట్లో విడుదల చేస్తారు. సరే, ఇదంతా అటుంచి, ఈ కథనంలో మనం 'సుజుకి ఎర్టిగా ఎలిగాంట్' గురించి తెలుసుకుందాం.

మరిన్ని వివరాల కోసం క్రింది ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి.

స్పెషల్ ఎడిషన్

స్పెషల్ ఎడిషన్

భారత మార్కెట్లో తయారైన మారుతి సుజుకి ఎర్టిగాను, మారుతి మాతృసంస్థ జపాన్‌కు చెందిన సుజుకి మోటార్ కార్పోరేషన్ సుజుకి ఎర్టిగా పేరుతో ఇండోనేషియా మార్కెట్లో అందిస్తుంది. అక్కడి మార్కెట్లో ఈ మోడల్ భారీ హిట్ కావటంతో, కంపెనీ ఇందులో 'ఎర్టిగా ఎలిగాంట్' అనే స్పెషల్ ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది.

ఎక్స్టీరియర్ ఫీచర్లు

ఎక్స్టీరియర్ ఫీచర్లు

ఈ స్పెషల్ ఎడిషన్‌ను ఎర్టిగా జిఎక్స్ వేరియంట్ ఆధారంగా చేసుకొని అభివృద్ధి చేశారు. ఇది సైడ్ మౌల్డింగ్స్, బాడీ స్కర్టింగ్, రియర్ రూఫ్ స్పాయిలర్, ఎగ్జాస్ట్ ఎక్స్‌టెన్షన్, వెనుక వైపు క్రోమ్ గార్నిష్ మరియు ఎలిగాంట్ బ్యాడ్జ్‌‌లతో లభిస్తుంది.

ఇంటీరియర్ ఫీచర్లు

ఇంటీరియర్ ఫీచర్లు

ఇంటీరియర్ల విషయానికి వస్తే, ఇతర వేరియంట్లలో ఆప్షన్ ఫీచ్‌గా ఉన్న లెథర్ అప్‌హోలెస్ట్రీని ఇందులో ఆఫర్ చేస్తున్నారు. ఎర్టిగా ఫెలిజ్ లిమిటెడ్ ఎడిషన్‌లో ఆఫర్ అన్ని ఇంటీరియర్ ఫీచర్లను ఈ ఎర్టిగా ఎలింగాంట్‌లోను ఆఫర్ చేస్తున్నారు.

ఇంజన్

ఇంజన్

ఇంజన్ పరంగా ఎర్టిగా ఎలిగాంట్‌లో ఎలాంటి మార్పులు లేవు. ఇండోనేషియా మార్కెట్లో లభ్యమవుతున్న ఎర్టిగా ఎలిగాంట్‌లో 1.4 లీటర్ కె-సిరీస్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది.

సికెడి అసెంబ్లింగ్

సికెడి అసెంబ్లింగ్

ఎర్టిగాను భారత్ నుంచి సికెడి (కంప్లీట్లీ నాక్డ్ డౌన్) రూపంలో ఇండోనేషియాకు దిగుమతి చేసుకుని అక్కడి మార్కెట్లో అసెంబ్లింగ్ చేస్తున్నారు. ఈ మోడల్‌కు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని, దీని అసెంబ్లింగ్ సామర్థ్యాన్ని పెంచేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది.

ధర

ధర

ఇండోనేషియా మార్కెట్లో సుజుకి ఎర్టిగా ఎలిగాంట్ ఎమ్‌పివి ధర 10 మిలియన్ రుపయ్య (మనదేశ కరెన్సీలో సుమారు రూ.59,480) లుగా ఉంది.

భారత మార్కెట్లో విడుదల

భారత మార్కెట్లో విడుదల

ఎర్టిగా ఫెలిజ్ లిమిటెడ్ ఎడిషన్ భారత మార్కెట్లో విడుదలైనట్లుగానే, ఈ ఎర్టిగా ఎలిగాంట్ కూడా భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశాలున్నాయి. బహుశా పండుగ సీజన్‌లో ఇది విడుదలైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

More from DriveSpark

Article Published On: Monday, September 9, 2013, 12:17 [IST]
English summary
Japanese carmaker Suzuki has launched a special edition Ertiga Elegant in Indonesia. The Suzuki Ertiga Elegant is based on the GX variant and comes with loaded features. Suzuki has priced Ertiga Elegant at 10 million rupiah (around Rs. 59,480) in Indonesia.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+