సుజుకి విటారా కాంపాక్ట్ ఎస్‌యూవీ ఆవిష్కరణ; భారత్‌కు వస్తుందా?

By Ravi

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా, రానున్న రోజుల్లో దేశీయ విపణిలో కొన్ని సరికొత్త ఉత్పత్తులను విడుదల చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసినదే. ఇందులో భాగంగానే, కంపెనీ సెప్టెంబర్ నెలలో తమ సియాజ్ మిడ్-సైజ్ సెడాన్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. మారుతి సుజుకి ప్రస్తుతం తమ ప్రధాన దృష్టంతా సియాజ్‌పైనే కేటాయించినప్పటికీ, కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో కూడా ఓ సరికొత్త ఉత్పత్తిని ప్రవేశపెట్టాలని కంపెనీ యోచిస్తోంది.

ఈ నేపథ్యంలో, మారుతి సుజుకి మాతృ సంస్థ, జపాన్‌కి చెందిన ఆటోమొబైల్ దిగ్గజం సుజుకి మోటార్ కార్పోరేషన్ ఇటీవలే తమ సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ 'విటారా'ను ఆవిష్కరించింది. ఈ నెక్స్ట్ జనరేషన్ సుజుకి విటారా కాంపాక్ట్ ఎస్‌యూవీ మునుపటి వెర్షన్ గ్రాండ్ విటారా కన్నా డిజైన్ పరంగా ఎన్నో రెట్లు మెరుగ్గా అనిపిస్తుంది. ఇందులో ప్రొడక్షన్ వెర్షన్‌ను సుజుకి ఈ ఏడాది అక్టోబర్ నెలలో జరగనున్న 2014వ అంతర్జాతీయ ప్యారిస్ మోటార్ షోలో ఆవిష్కరించనున్నట్లు కంపెనీ పేర్కొంది.

Suzuku Vitara Compact SUV

మారుతి సుజుకి ఇప్పటికే, భారత మార్కెట్లో 'గ్రాండ్ విటారా' అమ్మకాలను కంపెనీ పూర్తిగా నిలిపివేసిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, సరికొత్త సుజుకి గ్రాండ్ విటారాను ఇండియాలో ప్రవేశపెట్టడం ద్వారా కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లోని అవకాశాలను క్యాష్ చేసుకోవాలని మారుతి భావిస్తున్నట్లు సమాచారం.

కొత్త విటారా కాంపాక్ట్ ఎస్‌యూవీని గతంలో సుజుకి ఆవిష్కరించిన ఐవి-4 కాన్సెప్ట్ ఆధారంగా చేసుకొని తయారు చేశారు. గడచిన సంవత్సరంలో జరిగిన 2013 ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షోలో ఈ కాన్సెప్ట్ వాహనాన్ని ఆవిష్కరించారు. ఈ కాన్సెప్ట్‌కు అశేష ప్రజాదరణ లభించడంతో కంపెనీ ఇందులో ప్రొడక్షన్ వెర్షన్‌ను అక్టోబర్ 2వ తేది నుంచి ప్రారంభం కానున్న ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్‌లో ప్రదర్శనకు ఉంచనున్నారు. ఈ సరికొత్త సుజుకి విటారాకి సంబంధించిన సాంకేతిక, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌‌ను గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Saturday, August 30, 2014, 12:30 [IST]
English summary
The new Suzuki Vitara compact SUV is based on Suzuki's iV-4 concept vehicle. They had showcased the model for the first time in 2013. The concept was revealed at Frankfurt Motor Show and had garnered a lot of interest. Suzuki will be globally unveiling the production model in October.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+