గ్లోబల్ వెర్షన్ 2013 సుజుకి స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్ విడుదల
జపాన్ ఆటో దిగ్గజం సుజుకి మోటార్ కార్పోరేషన్ గ్లోబల్ మార్కెట్లలో అందిస్తున్న స్విఫ్ట్ రేంజ్ ఉత్పత్తులన్నింటినీ అప్‌గ్రేడ్ చేస్తోంది. ఇటీవలే ఫోర్ వీల్ డ్రైవ్ స్విఫ్ట్, పెర్ఫామెన్స్ వెర్షన్ 5-డోర్ స్విఫ్ట్ స్పోర్ట్ మోడళ్లను ఆవిష్కరించిన సుజుకి, తాజాగా రెగ్యులర్ వెర్షన్ స్విఫ్ట్‌ను విడుదల చేసింది. ఈ కొత్త మోడళ్లన్నీ త్వరలోనే యూకే మార్కెట్లో వాణిజ్యం పరంగా అందుబాటులోకి రానున్నాయి.
కొత్త అప్‌గ్రేడెడ్ 2013 సుజుకి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌కు ఫ్రంట్ బంపర్‌లో ఫాగ్‌ల్యాంప్స్ చుట్టూ డేటైమ్ ఎల్ఈడి రన్నింగ్ లైట్లను జోడించారు. (ఈ ఫీచర్ ఇప్పటికే ఇండియాలో లభిస్తున్న ఐ20 హ్యాచ్‌బ్యాక్‌లో అందుబాటులో ఉన్నాయి). కొత్త అల్లాయ్ వీల్స్, సరికొత్త బూట్ బ్లూ (మెటాలిక్) కలర్ ఆప్షన్ వంటి ఎక్స్టీరియర్ ఫీచర్లను ఇందులో గమనించవచ్చు. వాస్తవానికి ఎక్స్టీరియర్ డిజైన్‌లో పెద్దగా చెప్పుకోదగిన మార్పులు లేవనే చెప్పవచ్చు. బేసిక్ డిజైన్ యాధాతథంగా ఉంది.
ఇంటీరియర్స్ విషయానికి వస్తే, కొత్త సీట్లు, రిఫ్రెష్డ్ ఇంటీరియర్ లుక్, డ్రైవర్ సైడ్ పవర్ విండో కోసం ఆటో అప్ ఫీచర్ (ఆటోమేటిక్ క్లోజ్ అయ్యే విండో), పవర్ ఫోల్డ్ ఓవిఆర్ఎమ్ (ఇంజన్ స్టార్ట్/స్టాప్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా ఓపెన్/క్లోజ్ అయ్యే సైడ్ మిర్రర్), సూర్యకాంతి తగ్గగానే ఆటోమేటిక్‌గా ఆన్ అయ్యే హెడ్‌ల్యాంప్స్ వంటి అధునాత ఫీచర్లను కొత్త 2013 సుజుకి స్విఫ్ట్‌లో జోడించారు.
అంతర్జాతీయ వెర్షన్ స్విఫ్ట్‌లో పుష్ బటన్ స్టార్ట్, క్రూయిజ్ కంట్రోల్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు యధావిధిగా ఉన్నాయి. ఈ కొత్త స్విఫ్ట్‌లో ఇంజన్ పరంగా ఇలాంటి మార్పులు లేవు. ఇందులో ఇదివరకటి 1.2 లీటర్ కె-సిరీస్ పెట్రోల్ ఇంజన్, 1.3 లీటర్ డిడిఐఎస్ డీజిల్ ఇంజన్లనే ఉపయోగించారు. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి..!

2013 సుజుకి స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్

2013 సుజుకి స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్

2013 సుజుకి స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్

2013 సుజుకి స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్

2013 సుజుకి స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్ (ఫోర్-వీల్ డ్రైవ్)

2013 సుజుకి స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్ (ఫోర్-వీల్ డ్రైవ్)

2013 సుజుకి స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్ (ఫోర్-వీల్ డ్రైవ్)

2013 సుజుకి స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్ (ఫోర్-వీల్ డ్రైవ్)

2013 సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్

2013 సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్

2013 సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్ ఫేస్‌లిఫ్ట్



Click it and Unblock the Notifications








