ఫైవ్ డోర్ వెర్షన్ స్విఫ్ట్ స్పోర్ట్‌ను విడుదల చేసిన సుజుకి
భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడుపోతున్న స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను గ్లోబల్ మార్కెట్లలో మూడు రూపాల్లో (5-డోర్ వెర్షన్ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్, 4-వీల్ డ్రైవ్ స్విఫ్ట్ మరియు 3-డోర్ వెర్షన్ స్విఫ్ట్ స్పోర్ట్) లభ్యమవుతున్న సంగతి తెలిసినదే. మారుతి సుజుకి మాతృ సంస్థ అయిన జపాన్‌కు చెందిన సుజుకి మోటార్ కార్పోరేషన్ అంతర్జాతీయ మార్కెట్లోల అందిస్తున్న 3-డోర్ వెర్షన్ స్విఫ్ట్ స్పోర్ట్‌లో కంపెనీ ఓ కొత్త వేరియంట్‌ను మార్కెట్‌కు పరిచయం చేసింది.
ఇప్పటి వరకూ మూడు డోర్లతో మాత్రమే లభ్యమవుతున్న స్విఫ్ట్ స్పోర్ట్ హ్యాచ్‌బ్యాక్ ఇప్పుడు 5-డోర్ల ఆప్షన్‌తో కూడా లభ్యం కానుంది. రెగ్యులర్ వెర్షన్ స్విఫ్ట్‌కు, స్విఫ్ట్ స్పోర్ట్‌కు బేసిక్ డిజైన్ విషయంలో పెద్దగా మార్పులు లేవు. అయితే, పెర్ఫామెన్స్ విషయంలో మాత్రం మార్పులు ఉన్నాయి. రెగ్యులర్ వెర్షన్ స్విఫ్ట్ సాధారణ 1.2 లీటర్ ఇంజన్‌తో లభ్యమవుతుంటే, స్విఫ్ట్ స్పోర్ట్ మాత్రం పవర్‌ఫుల్ 1.6 లీటర్ వివిటి ఇంజన్‌తో లభ్యమవుతుంది. ఇది గరిష్టంగా 136 పిఎస్‌ల పవర్‌ను, 160 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఈ ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది ఫ్రంట్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో లభ్యమవుతుంది. ఇది కేవలం 8.7 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకోగలదు. దీని గరిష్ట వేగం గంటకు 193 కిలోమీటర్లు. ఇది లీటరుకు 15.6 కి.మీ. మైలేజీని ఆఫర్ చేయనుంది. ఆటోమేటిక్ ఎయిర్ కండిషన్, ముందువైపు ఫాగ్ ల్యాంప్స్, పుష్ బటన్ స్టార్ట్, క్రూయిజ్ కంట్రోల్, బ్లూటూత్, హెడ్‌ల్యాంప్ వాషర్లతో కూడిన హెచ్ఐడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ వంటి ఫీచర్లు స్విఫ్ట్ స్పోర్ట్‌లో స్టాండర్డ్‌గా లభిస్తాయి.
సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్ ఇప్పట్లో ఇండియాకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. భారత్‌లో పెర్ఫామెన్స్ స్విఫ్ట్ కోరుకునే వారికి నిరాశే మిగలనుంది. అయితే, స్పోర్టీ లుక్ అండ్ ఫీల్ కోరుకునే స్విఫ్ట్ ప్రియుల కోసం కంపెనీ ఇటీవలే ఓ లిమిటెడ్ ఎడిషన్ స్విఫ్ట్ ఆర్ఎస్‌ను మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే.

2013 స్విఫ్ట్ స్పోర్ట్
2012 స్విఫ్ట్ స్పోర్ట్ కేవలం 3 డోర్ల మాత్రమే లభ్యమయ్యేది.

2013 స్విఫ్ట్ స్పోర్ట్
కంపెనీ కొత్తగా అభివృద్ధి చేసిన 2013 స్విఫ్ట్ స్పోర్ట్‌లో 5-డోర్ ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది.

2013 స్విఫ్ట్ స్పోర్ట్
త్రీ డోర్ వెర్షన్ స్విఫ్ట్ స్పోర్ట్ కారుకు, ఫైవ్ డోర్ వెర్షన్ స్విఫ్ట్ స్పోర్ట్ కారుకు బేసిక్ డిజైన్‌లో ఎలాంటి మార్పులు లేవు.

2013 స్విఫ్ట్ స్పోర్ట్
2012 స్విఫ్ట్ స్పోర్ట్‌లో ఉపయోగించిన 1.6 లీటర్ వివిటి ఇంజన్‌నే ఈ కొత్త 2013 స్విఫ్ట్ స్పోర్ట్ లోను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 136 పిఎస్‌ల పవర్‌ను, 160 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

2013 స్విఫ్ట్ స్పోర్ట్
ఈ ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది ఫ్రంట్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో లభ్యమవుతుంది.

2013 స్విఫ్ట్ స్పోర్ట్
ఇది కేవలం 8.7 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకోగలదు. దీని గరిష్ట వేగం గంటకు 193 కిలోమీటర్లు.

2013 స్విఫ్ట్ స్పోర్ట్
ఆటోమేటిక్ ఎయిర్ కండిషన్, ముందువైపు ఫాగ్ ల్యాంప్స్, పుష్ బటన్ స్టార్ట్, క్రూయిజ్ కంట్రోల్, బ్లూటూత్, హెడ్‌ల్యాంప్ వాషర్లతో కూడిన హెచ్ఐడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ వంటి ఫీచర్లు స్విఫ్ట్ స్పోర్ట్‌లో స్టాండర్డ్‌గా లభిస్తాయి.


Click it and Unblock the Notifications








