సుజుకి ఎస్-క్రాస్: సెడాన్-ఎస్‌యూవీల కాంబినేషన్

By Ravi

మీకు సుజుకి ఎస్-క్రాస్ గుర్తుందా..? 2012వ అంతర్జాతీయ ప్యారిస్ మోటార్ షోలో జపాన్ ఆటో దిగ్గజం సుజుకి మోటార్ కార్పోరేషన్ ఆవిష్కరించిన క్రాసోవర్ కాన్సెప్ట్ ఇది. ప్రస్తుతం ఈ కాన్సెప్ట్ ప్రొడక్షన్ దశకు చేరుకుంది. అంతేకాదు, రానున్న జనవరిలో ఆస్ట్రేలియా మార్కెట్లలో కూడా విడుదల కానుంది.

ఈ కాంపాక్ట్ ఎస్‌యూవ/క్రాసోవర్‌ను అక్కడి మార్కెట్లో 23,990 డాలర్లకు (మనదేశ కరెన్సీలో సుమారు రూ.13.2 లక్షల) విక్రయించనున్నారు. మొత్తం 4.3 మీటర్ల పొడవు ఉండే సుజుకి ఎస్-క్రాస్ ప్రస్తుత ఎస్ఎక్స్4 కన్నా తక్కువ ఎత్తును, ఎక్కువ వెడల్పును కలిగి ఉండటమే కాకుండా, 100 కేజీలు తక్కువ బరువును కలిగి ఉండి, ఎక్కువ మైలేజీని ఆఫర్ చేస్తుంది.

మరి ఈ సుజుకి ఎస్-క్రాస్ భారత్‌కు వస్తుందా..? మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

సుజుకి ఎస్-క్రాస్ క్రాసోవర్

సుజుకి ఎస్-క్రాస్ క్రాసోవర్ కాన్సెప్ట్ తక్కువ కర్భన ఉద్ఘారాలను విడుదల చేస్తూ, మంచి డ్రైవింగ్ డైనమిక్స్‌ను కలిగి ఉంటుంది. అధిక లగేజ్ స్పేస్, విశాలమైన ఇంటీరియర్స్ వంటి సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఈ క్రాసోవర్‌ను డిజైన్ చేసింది.

సుజుకి ఎస్-క్రాస్ క్రాసోవర్

మారుతి సుజుకి బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్, పవర్‌ఫుల్ సి-సెగ్మెంట్ సెడాన్ ఎస్ఎక్స్4, ప్రీమియం సెడాన్ కిజాల నుంచి స్ఫూర్తి పొంది కంపెనీ సుజుకి ఎస్-క్రాస్‌ను తయారు చేశారు.ఇది మంచి ఆన్-రోడ్ డ్రైవ్ డైనమిక్స్, మైలేజ్, పెర్ఫామెన్స్‌లను ఆఫర్ చేస్తుంది.

సుజుకి ఎస్-క్రాస్ క్రాసోవర్

సుజుకి ఎస్-క్రాస్ క్రాసోవర్‌లో ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌ను కూడా సుజుకి అభివృద్ధి చేస్తోంది. రోజూవారీ అవసరాలు, వారాంతపు దూర ప్రయాణాలకు అనువుగా సుజుకి తమ ఎస్-క్రాస్ క్రోసోవర్ కారును తీర్చిదిద్దారు.

సుజుకి ఎస్-క్రాస్ క్రాసోవర్

డైనమిక్ లైన్స్, ఎల్ఈడి హెడ్‌లైట్స్, ఫాగ్ ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్స్, స్పోర్టీ ఏరోడైనమిక్ డిజైన్, ఫ్లేర్డ్ వీల్ ఆర్చెస్, ఫ్రంట్ స్కిడ్ ప్లేట్, క్రోమ్ ఫ్రంట్ గ్రిల్, స్లీక్ రూఫ్ రెయిల్స్ వంటి ఫీచర్లు సుజుకి ఎస్-క్రాస్ క్రాసోవర్‌లో ప్రధానంగా చెప్పుకోదగినవి.

ఎస్-క్రాస్ క్రాసోవర్‌లో సుజుకి ప్లష్ ఇంటీరియర్స్‌ను పరిచయం చేసింది. అధునాత సాంకేతి పరిజ్ఞానాన్ని ఉపయోగించి సుజుకి ఈ కారును తయారు చేశారు. భారత్‌లో కాంపాక్ట్ కార్లకు గిరాకీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సుజుకి తమ ఎస్-క్రాస్‌ను భారత్‌లో కూడా విడుదల చేసే అవకాశం ఉంది. అయితే, ఇది 2015 తర్వాతే రావచ్చని అంచనా.

More from DriveSpark

Article Published On: Saturday, December 21, 2013, 16:23 [IST]
English summary
Suzuki will be launching the new S-Cross in Australia on January 1, 2014. The car will be on sale for an attractive $23,990 (INR 13.2 lakhs). However, the Big Question is when would India receive the S-Cross compact SUV?
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+