సుజుకి 30వ వార్షికోత్సవం; స్విఫ్టి ఎస్ ఎడిషన్ విడుదల
సుజుకి స్విఫ్ట్‌లో ఇప్పుడు స్పెషల్ ఎడిషన్ల పర్వం సాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో సుజుకి తమ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌లో లిమిటెడ్ ఎడిషన్‌లను ప్రవేశపెట్టే పనిలో ఉంది. ఇప్పటికే యూకే మార్కెట్ కోసం సరికొత్త స్విఫ్ట్ ఎస్‌జెడ్-ఎల్ లిమిటెడ్ ఎడిషన్ (500 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి)ను ప్రవేశపెట్టిన సుజుకి, తాజాగా నెథర్లాండ్స్‌లో మరో రకం స్పెషల్ ఎడిషన్ స్విఫ్ట్‌ను విడుదల చేసింది.
ఇది కూడా చదవండి: సుజుకి స్విఫ్ట్ ఎస్‌జెడ్-ఎల్ ఎడిషన్
స్విఫ్ట్ బ్రాండ్ 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, సుజుకి నెథర్లాండ్స్‌లో 'స్విఫ్ట్ ఎస్ ఎడిషన్' (Swift S-Edition) పేరిట ఓ స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేసింది. ఇతర స్పెషల్ ఎడిషన్ మోడళ్ల మాదిరిగానే ఈ సుజుకి స్విఫ్ట్ ఎస్ ఎడిషన్‌లో కూడా కాస్మోటిక్ మార్పులు ఉన్నాయి. ఇది కూడా 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో లభిస్తుంది. ఈ ఇంజన్ 94 పిఎస్‌ల శక్తిని, 118 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో లభిస్తుంది. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

సుజుకి స్విఫ్ట్ ఎస్ ఎడిషన్ ఉత్పత్తిని కేవలం 275 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయనున్నారు. ఇది ఐదు ఆకర్షనీయమైమ రంగుల్లో లభ్యం కానుంది. దీని ఎక్స్టీరియర్స్‌లో బానెట్‌పై ఇరువైపులా వైట్ స్ట్రిప్స్, వైట్ కలర్ రూఫ్ మరియు వైట్ స్పాయిలర్స్‌ను గమనించవచ్చు. ఇంకా 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్, సైడ్ స్కర్ట్స్, వీల్ ఆర్చెస్, స్టెయిన్‌లెస్ స్టీల్ స్ట్రిప్, బూట్ డోర్‌పై ఎస్-ఎడిషన్ బ్యాడ్జ్, ట్విన్ ఎగ్జాస్ట్ అవుట్‌లెట్స్‌ను ఇందులో ఆఫర్ చేస్తున్నారు.

ఇంటీరియర్స్ విషయానికి వస్తే, డోర్ సిల్స్‌పై యూనిట్ నెంబర్ మరియు ఎస్ ఎడిషన్ బ్యాడ్జ్ ఉంటుంది. అలాగే స్పోర్టీ పెడల్స్, వైట్ టిప్డ్ గేర్ షిఫ్ట్ నాబ్, స్పెషల్ ఫ్లోర్ మ్యాట్స్, ఫ్రంట్ సీట్లపై స్విఫ్ట్ ఎంబ్రాయిడ్ లోగో వంటి మార్పులను ఇందులో గమనించవచ్చు.

క్రూయిజ్ కంట్రోల్, రేడియో/సిడి/ఎమ్‌పి3 కనెక్టివిటీతో కూడిన ఆడియో సిస్టమ్, ఈబిడితో కూడిన ఏబిఎస్, ఈఎస్‌పి, 7-ఎయిర్‌బ్యాగ్స్‌ను స్టాండర్డ్ ఫీచర్లుగా ఆఫర్ చేస్తున్నారు.

ప్రస్తుతానికి సుజుకి స్విఫ్ట్ ఎడిషన్ నెథర్లాండ్స్‌లో మాత్రమే లభ్యం కానుంది. అక్కడి మార్కెట్లో దీని ధర 17,499 యూరోలు (మన కరెన్సీలో సుమారు రూ.14.91 లక్షలు)గా ఉంది.


Click it and Unblock the Notifications








