యూకే మార్కెట్ కోసం సుజుకి స్విఫ్ట్ లిమిటెడ్ ఎడిషన్

By Ravi

జపనీస్ కార్ బ్రాండ్ సుజుకి గ్లోబల్ మార్కెట్లలో విక్రయిస్తున్న స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ త్వరలోనే ఓ స్పెషల్ ఎడిషన్ రూపంలో దర్శనమివ్వనుంది. 'స్విఫ్ట్ ఎస్‌జెడ్-ఎల్' (Swift SZ-L) పేరిట సుజుకి మోటార్ కార్పోరేషన్ తయారు చేసిన ఓ స్పెషల్ ఎడిషన్ మోడల్ మార్చ్ 1వ తేది నుంచి యూకే మార్కెట్లలో అందుబాటులోకి రానుంది.

ఎక్స్‌క్లూజివిటీ కోసం సుజుకి స్విఫ్ట్ ఎస్‌జెడ్-ఎల్ ఉత్పత్తిని పరిమితం చేయనున్నారు. కేవలం 500 యూనిట్ల లిమిటెడ్ ఎడిషన్ స్విఫ్ట్ ఎస్‌జెడ్-ఎల్ కార్లు మాత్రమే అందుబాటులో ఉంటాయని కంపెనీ పేర్కొంది. రెగ్యులర్ ఎస్‌జెడ్3 వేరియంట్‌ను ఆధారంగా చేసుకొని ఈ స్పెషల్ ఎడిషన్ ఎస్‌జెడ్-ఎల్ వేరియంట్‌ను అభివృద్ధి చేశారు. ఇది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో లభిస్తుంది.

సుజుకి స్విఫ్ట్ లిమిటెడ్ ఎడిషన్

ఈ స్పెషల్ ఎడిషన్ సుజుకి స్విఫ్ట్ ఎస్‌జెడ్-ఎల్ వేరియంట్‌లో ఈఎస్‌పి, 7-ఎయిర్ బ్యాగ్స్, యూఎస్‌బి పోర్ట్, బ్లూటూత్ ఆడియో సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్, ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్ వంటి ఫీచర్లు లభ్యం కానున్నాయి

సుజుకి స్విఫ్ట్ లిమిటెడ్ ఎడిషన్

ఈ స్పెషల్ ఎడిషన్ సుజుకి స్విఫ్ట్ కాస్మిక్ బ్లాక్, బూస్ట్ బ్లూ అనే రెండు రంగులలో లభిస్తుంది. ఇవి రెండూ మెటాలిక్ టూ టోన్ పెయింట్ స్కీమ్‌తో లభిస్తాయి.ఇందులో కాంట్రాస్టింగ్ వైట్ రూఫ్, డోర్ మిర్రర్స్ మరియు రియర్ స్పాయిలర్ కూడా లభిస్తుంది.

సుజుకి స్విఫ్ట్ లిమిటెడ్ ఎడిషన్

సుజుకి స్విఫ్ట్ ఎస్‌జెడ్-ఎల్ లిమిటెడ్ ఎడిషన్ విశిష్టమైన ఫ్యాబ్రిక్‌తో చేయబడిన ప్రత్యేకమైన సీట్లతో లభిస్తుంది. దీని స్టీరింగ్ వీల్ మరియు గేర్ లివర్‌లు సిల్వర్ కాంట్రాస్ట్ స్టిచింగ్‌తో ఉంటాయి.

సుజుకి స్విఫ్ట్ లిమిటెడ్ ఎడిషన్

సుజుకి స్విఫ్ట్ ఎస్‌జెడ్-ఎల్ లిమిటెడ్ ఎడిషన్ ప్రస్తుతానికి యూకే వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి రానుంది. అయితే, భారత్‌లో కూడా స్పెషల్ ఎడిషన్ లేదా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ త్వరలోనే విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సుజుకి స్విఫ్ట్ లిమిటెడ్ ఎడిషన్

యూకే మార్కెట్లో ఈ కొత్త సుజుకి స్విఫ్ట్ ఎస్‌జెడ్-ఎల్ లిమిటెడ్ ఎడిషన్ మార్చ్ 1, 2014వ తేది నుంచి అందుబాటులోకి రానుంది. ఇందులో 3-డోర్ వెర్షన్ ధర 10,899 పౌండ్లుగా ఉంటే, 5-డోర్ వెర్షన్ ధర 11,316 పౌండ్లుగా ఉంది.

More from DriveSpark

Article Published On: Tuesday, February 25, 2014, 18:34 [IST]
English summary
A special edition Swift will be launched soon by Suzuki. The Japanese automobile giant call it Swift SZ-L and it will be available from 1st of March in UK. Suzuki explains they will manufacture 500 special edition vehicles to maintain exclusivity. The SZ-L is based on SZ3 and will sport a 1.2 litre petrol mill.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+