సెప్టెంబర్‌లో సుజుకి ఐవి-4 కాంపాక్ట్ ఎస్‌యూవీ ఆవిష్కరణ

By Ravi

కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో పెరుగుతున్న డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు సుజుకి కూడా సిద్ధమయ్యింది. మారుతి సుజుకి మాతృ సంస్థ, జపాన్‌కు చెందిన సుజుకి మోటార్ కార్పోరేషన్ తాజాగా అభివృద్ధి చేస్తున్న 'ఐవి-4' (iV-4) కాంపాక్ట్ ఎస్‌యూవీ టీజర్ ఫొటోలను విడుదల చేసిన సంగతి తెలిసినదే.

వచ్చే నెల ఆరంభంలో జరగనున్న 65వ అంతర్జాతీయ ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షోలో సుజుకి ఐవి-4 కాన్సెప్ట్‌ను ఆవిష్కరించనున్నారు. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, సుజుకి ఆవిష్కరించనున్నది ప్రొడక్షన్ వెర్షన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ అని తెలుస్తోంది. ఇది ఈ సెగ్మెంట్లోని ఫోర్డ్ ఈకోస్పోర్ట్, రెనో డస్టర్ వంటి మోడళ్లకు పోటీగా నిలువనుంది.

Suzuki iV 4 Compact SUV

'గ్రాబ్ యువర్ ఫీల్డ్' అనే థీమ్‌తో ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని డెవలప్ చేశారు. సుజుకి ఐవి-4 కాంపాక్ట్ ఎస్‌యూవీని గడచిన సంవత్సరం 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో సుజుకి ఆవిష్కరించిన ఎక్స్ఏ ఆల్ఫా కాన్సెప్ట్‌ను ఆధారంగా చేసుకొని అభివృద్ధి చేశారు

టీజర్ ఫొటోలను బట్టి చూస్తే, సుజుకి ఐవి-4 కాంపాక్ట్ ఎస్‌యూవీ మంచి గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ కారుకు పైభాగంలో అమర్చిన రూఫ్ మౌంటెడ్ హెడ్‌ల్యాంప్స్ మరొక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.


సుజుకి ఐవి-4 కాంపాక్ట్ ఎస్‌యూవీకి సంబంధించిన మరింత సమాచారాన్ని సెప్టెంబర్‌లో జరగనున్న ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షోలో వెల్లడిస్తామని కంపెనీ పేర్కొంది. వరల్డ్ క్లాస్ డిజైన్‌తో అభివృద్ధి చేసిన సుజుకి ఐవి-4 కాంపాక్ట్ ఎస్‌యూవీని సెప్టెంబర్ 10వ తేదీ నుంచి ప్రారంభం కానున్న 2013 ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్ షోలో తొలిసారిగా ఆవిష్కరించనున్నారు.

More from DriveSpark

Article Published On: Monday, August 26, 2013, 17:05 [IST]
English summary
Suzuki has announced iv-4 compact SUV. Suzuki iv-4 compact SUV will be unveiled at Frankfurt Auto Show. Suzuki iv-4 compact SUV will rival Duster and EcoSport.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+