ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో టాటా ఆరియా ఆటోమేటిక్ ఆవిష్కరణ
దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ భారత మార్కెట్లో అందిస్తున్న టాటా ఆరియా క్రాసోవర్‌లో కంపెనీ ఈ ఏడాది జెనీవాలో జరిగిన 83వ అంతర్జాతీయ మోటార్ షోలో ప్రదర్శనకు ఉంచిన ఆటోమేటిక్ వెర్షన్ టాటా ఆరియాను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న 2014 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించనున్నట్లు సమాచారం.
ప్రత్యేకించి యూరోపియన్ మార్కెట్లను దృష్టిలో ఉంచుకొని పవర్‌ఫుల్ ఇజన్, ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్, స్టయిలిష్ ఎక్స్టీరియర్స్ మరియు లగ్జరీ ఇంటీరియర్స్‌తో ఈ కొత్త ఆరియా ఏటి మోడల్‌ను కంపెనీ తయారు చేసింది. ఇందులో సరికొత్త డ్యూయెల్ టోన్ పెయింటింగ్, బ్లాక్ ఇన్‌సెర్ట్స్‌తో కూడిన హెడ్‌ల్యాంప్స్, డేటైమ్ రన్నింగ్ లైట్స్ (డిఆర్ఎల్స్), సరికొత్త టెయిల్ ల్యాంప్స్, 19-ఇంచ్ అల్లాయ్ వీల్స్, ప్రీమియం లెథర్ సీట్స్, అప్‌రేటెడ్ ఇంజన్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ వంటి మార్పులను గమనించవచ్చు.
మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

భారత ఆటో దిగ్గజం టాటా మోటార్స్ దేశీయ విపణిలో అందిస్తున్న ఆరియా క్రాసోవర్‌లో మరింత శక్తివంతమైన ఇంజన్ మరియు ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తో కూడిన సరికొత్త అప్‌గ్రేడెడ్ ఆరియా త్వరలోనే మార్కెట్లోకి రానుంది.

టాటా మోటార్స్ తమ సరికొత్త అప్‌గ్రేడెడ్ ఆరియా కాన్సెప్ట్‌ను తొలిసారిగా 2013 జెనీవా అంతర్జాతీయ మోటార్ షోలో ప్రదర్శనకు ఉంచింది.

యూరోపియన్ మార్కెట్ల దృష్టిని ఆకట్టుకునేందుకు పవర్‌ఫుల్ ఇంజన్, ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్, బెస్ట్ ఇన్ క్లాస్ ఇంటీరియర్స్, అద్దిరిపోయే ఎక్స్టీరియర్ ఫీచర్లతో కంపెనీ తమ ఆరియాను అభివృద్ధి చేసింది.

జెనీవాలో టాటా మోటార్స్ ప్రదర్శనకు ఉంచిన ఈ అప్‌డేటెడ్ టాటా ఆరియాను గమనిస్తే, ఇందులో సరికొత్త డ్యూయెల్ టోన్ పెయింటింగ్, బ్లాక్ ఇన్‌సెర్ట్స్‌తో కూడిన హెడ్‌ల్యాంప్స్, డేటైమ్ రన్నింగ్ లైట్స్ (డిఆర్ఎల్స్), సరికొత్త టెయిల్ ల్యాంప్స్, 19-ఇంచ్ అల్లాయ్ వీల్స్, ప్రీమియం లెథర్ సీట్స్, అప్‌రేటెడ్ ఇంజన్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ వంటి మార్పులను గమనించవచ్చు.

టాటా మోటార్స్ నుంచి లభ్యమవుతున్న కార్లలో ఇప్పటి వరకూ అసలు ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్ అందుబాటులో లేదు. ఈ సరికొత్త టాటా ఆరియా మార్కెట్లోకి విడుదలైతే టాటా నుంచి లభ్యం కానున్న మొట్టమొదటి ఆటోమేటిక్ కారుగా కొత్త ఆరియా నిలువనుంది.

ఈ కొత్త ఆరియాలో 2.2 లీటర్ డైకర్ ఇంజన్‌ను ఉపయోగించారు ఇది గరిష్టంగా 158 బిహెచ్‌పిల శక్తిని, 407 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఇందులో ఉపయోగించిన 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌ను జనరల్ మోటార్స్ నుంచి టాటా కొనుగోలు చేసింది. ఈ పవర్‌ఫుల్ ఆరియా 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ ఆప్షన్‌తో కూడా లభిస్తుంది.

పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, ఈ అప్‌గ్రేడెడ్ టాటా ఆరియా యూరోపియన్ మార్కెట్ల కన్నా ముందుగా మన ఇండియా మార్కెట్లో విడుదల కావచ్చని సమాచారం.

వచ్చే ఏడాది ఏప్రిల్ నెల నాటికి ఇది భారత విపణిలో వాణిజ్యం పరంగా విడుదల కానున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications








