'టాటా బోల్ట్' హ్యాచ్‌బ్యాక్ ఆవిష్కరణ - వివరాలు

భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ఫాల్కన్ 4, ఫాల్కన్ 5 కోడ్‌నేమ్‌లతో ఓ కాంపాక్ట్ కారును మరియు ఓ కాంపాక్ట్ సెడాన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనాల్లో ప్రచురించిన సంగతి తెలిసినదే. తాజాగా.. కంపెనీ ఈ రెండు మోడళ్లను నేడు (ఫిబ్రవరి 3, 2014) తొలిసారిగా ప్రజల ముందుకు తీసుకువచ్చింది. ఈ రెండు మోడళ్లలో ఒకటైన 'టాటా బోల్ట్' హ్యాచ్‌బ్యాక్ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

ప్రస్తుతం టాటా మోటార్స్ అందిస్తున్న విస్టా హ్యాచ్‌బ్యాక్‌కు అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా (బహుశా రీప్లేస్‌మెంట్‌గా) టాటా మోటార్స్ తమ బోల్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను తయారు చేసింది. ప్రస్తుత విస్టా కన్నా మెరుగైన డిజైన్, ఫీచర్స్, ఇంజన్స్‌తో ఈ కారును తయారు చేశారు. అయినప్పటికీ, ఇందులో విస్టా బేసిక్ డిజైన్ డిఎన్ఏ మనకు స్పష్టంగా కనిపిస్తుంది.

మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

'టాటా బోల్ట్' హ్యాచ్‌బ్యాక్ ఆవిష్కరణ

టాటా మోటార్స్ యొక్క ఎక్స్1 ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని కొత్త టాటా బోల్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను తయారు చేశారు.

'టాటా బోల్ట్' హ్యాచ్‌బ్యాక్ ఆవిష్కరణ

కొత్త టాటా బోల్ట్ హ్యాచ్‌బ్యాక్ ఫ్రంట్ డిజైన్ పూర్తిగా కొత్తగా అనిపిస్తుంది. టాటా 'హ్యుమినిటీ' లైన్ కాన్సెప్ట్ ఆధారంగా చేసుకొని డిజైన్ చేసిన ఫ్రంట్ గ్రిల్, కొత్త హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్, కొత్త బంపర్స్, కొత్త కల్ ఆప్షన్స్‌ ఇందులో ప్రత్యేక ఆకర్షణలు.

'టాటా బోల్ట్' హ్యాచ్‌బ్యాక్ ఆవిష్కరణ

ఈ కారులో లేటెస్ట్ ఎలక్ట్రానిక్ ఎమినిటీస్‌తో అప్‌గ్రేడ్ చేసిన సరికొత్త ఇంటీరియర్లు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

'టాటా బోల్ట్' హ్యాచ్‌బ్యాక్ ఆవిష్కరణ

టాటా బోల్ట్ కారులో మరో ప్రధానమైన మార్పు ఏంటంటే, టాటా మోటార్స్ ఇటీవల విడుదల చేసిన 1.2 లీటర్ రెవోట్రాన్ ఎమ్‌పిఎఫ్ఐ టర్బోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్‌ను ఇందులో ఉపయోగించారు.

'టాటా బోల్ట్' హ్యాచ్‌బ్యాక్ ఆవిష్కరణ

అలాగే బోరింగ్ రెగ్యులర్ 1.3 లీటర్ మల్టీజెట్ డీజిల్ ఇంజన్‌కు బదులుగా ఇందులో శక్తివంతమైన 1.5 లీటర్ మల్టీజెట్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు.

'టాటా బోల్ట్' హ్యాచ్‌బ్యాక్ ఆవిష్కరణ

ఈ కారులో ఆఫర్ చేయనున్న కొన్ని ముఖ్యమైన ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో 5 ఇంచ్ టచ్‍స్క్రీన్‌తో కూడిన హార్మన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, బ్లూటూత్ ఫోన్ కనెక్టివిటీ, వాయిస్ రికగ్నైజేషన్ అండ్ టెక్స్ట్ టూ స్పీచ్ సిస్టమ్, ఫోన్ ఆధారిగా నావిగేషన్ సిస్టమ్ వంటి మరెన్నో అధునాతన ఫీచర్లున్నాయి.

'టాటా బోల్ట్' హ్యాచ్‌బ్యాక్ ఆవిష్కరణ

ఫిబ్రవరి 5, 2014వ తేది నుంచి ప్రారంభం కానున్న 12వ ఎడిషన్ ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో టాటా మోటార్స్ ఈ కొత్త కారుతో పాటుగా జెస్ట్ కాంపాక్ట్ సెడాన్‌ను కూడా ప్రదర్శించనుంది.

'టాటా బోల్ట్' హ్యాచ్‌బ్యాక్ ఆవిష్కరణ

లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Monday, February 3, 2014, 14:23 [IST]
English summary
Tata Motors Bolt hatchback, the Vista replacement, previously known only by its ‘Facon 4' codename, has been unveiled in Delhi. Tata Bolt can be considered as a heavily facelifted Vista which now sports a new front fascia, featuring a new grille design based on Tata's ‘Humanity' line, new headlamps, new bumpers, new colours and and all new interior that's loaded with the latest electronic amenities.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+