గ్లోబల్ మోడళ్లుగా మారనున్న టాటా బోల్ట్, టాటా జెస్ట్
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఆవిష్కరించిన తమ బోల్ట్ హ్యాచ్‌బ్యాక్ మరియు జెస్ట్ కాంపాక్ట్ సెడాన్లను కంపెనీ గ్లోబల్ మోడళ్లుగా తీర్చిదిద్దనుంది. అంతర్జాతీయ మార్కెట్లను టార్గెట్‌గా చేసుకొని కంపెనీ ఈ స్ట్రాటజీని రూపొందించింది. టాటా బోల్ట్ మరియు టాటా జెస్ట్ కార్లను ఇండియన్, యూరోపియన్ బృందాలు కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.
వాస్తవానికి, ఈ రెండు మోడళ్ల డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ లండన్‌కు సమీపంలోని కోవెంట్రీ వద్ద ఉన్న యూరోపియన్ టెక్నికల్ సెంటర్‌లోనే జరిగింది. ఈ రెండు మోడళ్లు ఇండియన్ మార్కెట్‌తో పాటుగా, దక్షిణాఫ్రికా మరియు ఇండోనేషియా వంటి పలు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా విడుదల కానున్నాయి. ఈ విషయంలో కంపెనీ యూరోపియన్ ఆర్ అండ్ డి సెంటర్ కీలక పాత్ర పోషించనుంది.

టాటా విస్టా హ్యాచ్‌బ్యాక్, టాటా మాంజా సెడాన్లకు రీప్లేస్డ్ వెర్షన్లుగా వస్తున్న టాటా బోల్ట్ హ్యాచ్‌బ్యాక్, టాటా జెస్ట్ కాంపాక్ట్ సెడాన్లు రెండూ డిజైన్ పరంగా ఒకేవిధంగా ఉంటాయి, కాకపోతే జెస్ట్ సెడాన్‌లో మాత్రం పొడగించబడిన బూట్ స్పేస్ ఉంటుంది. ఈ రెండింటిలో ఇదే ప్రధాన వ్యత్యాసం. పాత విస్టాను ఆధారంగా చేసుకొనే ఈ రెండు మోడళ్లను డిజైన్‌ను చేసినప్పటికీ, ఇవి మోడ్రన్ లుక్‌ని కలిగి ఉంటాయి.
కొత్త హెడ్‌లైట్స్, కొత్త ఫాగ్ ల్యాంప్ డిజైన్, కొత్త గ్రిల్, కొత్త టెయిల్ ల్యాంప్, కొత్త బంపర్స్ మరియు సైడ్ మిర్రర్లను ఈ కార్లలో గమనించవచ్చు. టాటా జెస్ట్‌లో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, శాటిలైట్ నావిగేషన్, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, స్పీడ్ సెన్సిటివ్ పవర్ స్టీరింగ్ వంటి ప్రీమియం ఫీచర్లు లభిస్తాయి. కానీ టాటా బోల్ట్‌లో ఇందులోని కొన్ని ప్రీమియం ఫీచర్లు ఉండవు.
ఈ రెండు మోడళ్లలో కూడా ఒకేరకమైన ఇంజన్లను ఉపయోగించారు. పెట్రోల్ వెర్షన్లలో 1.2 లీటర్, టర్బో చార్జ్డ్, రెవట్రోన్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 85 పిఎస్‌ల శక్తిని, 140 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ వెర్షన్లలో 1.3 లీటర్, క్వాడ్రాజెట్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 90 పిఎస్‌ల శక్తిని, 190 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.


Click it and Unblock the Notifications








