టాప్ 10 చెత్త కార్ల జాబితాలో, టాటా ఇండికా టాప్!

By Ravi

దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్, ఇటీవలి కాలంలో యూకెకు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ సంస్థను కొనుగోలు చేసిన సంగతి మనందరికీ తెలిసినదే. అయితే, ఇదే కంపెనీ గతంలో యూకెకు చెందిన ఎమ్‌జి రోవర్ గ్రూప్ (ప్రస్తుతం ఈ కంపెనీ చరిత్రలో కలిసిపోయింది)తో టైఅప్ పెట్టుకుందని ఎంతమందికి తెలుసు..?

బ్రిటన్‌లో ఈ ఎమ్‌జి రోవర్ గ్రూప్, టాటా మోటార్స్ అందిస్తున్న టాటా ఇండికా హ్యాచ్‌బ్యాక్ కారును 2003 కాలంలో సిటీరోవర్ పేరుతో రీబ్యాడ్జ్ చేసి విక్రయించేంది. అయితే, ఈ కారు అక్కడి మార్కెట్లో అట్టర్ ఫ్లాప్ అయ్యి, కంపెనీకు భారీ నష్టాలు తెచ్చిపెట్టింది. బ్రిటన్ మార్కెట్లో అప్పట్లో ఈ సిటీరోవర్ (ఇండికా) కారు ధర కేవలం 7,000 పౌండ్లు (మన కరెన్సీలో సుమారు 7 లక్షలు) మాత్రమే.

కాగా.. ఇటీవల యూకేకు చెందిన ఆటోమొబైల్ పబ్లికేషన్ ఆటో ఎక్స్‌ప్రెస్, గడచిన 25 ఏళ్ల కాలంలో పరమ చెత్త కార్లపై నిర్వహించిన ఓ సర్వేలో సిటీరోవర్ (ఇండికా) అగ్ర స్థానంలో నిలిచింది. 2003లో యూకే మార్కెట్లోకి ప్రవేశించిన ఈ కారు, పరాజయం కావటంతో 2005లోనే దీని ఉత్పత్తిని నిలిపివేశారు. 'ఆటో ఎక్స్‌ప్రెస్ టాప్ 10 వరస్ట్ కార్స్' వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

రోవర్ సిటీరోవర్ (2003)

రోవర్ సిటీరోవర్ (2003)

రోవర్ గ్రూప్ 2003లో ఈ సిటీరోవర్ (టాటా ఇండికా)ను బ్రిటన్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. అక్కడి మార్కెట్లో ఇదే అత్యంత చవక కారుగా నిలిచినప్పటికీ, అమ్మకాలు మాత్రం ఆశించిన రీతిలో సాగలేదు. ఏప్రిల్ 2005లో రోవర్ గ్రూప్ ఈ కారు ఉత్పత్తిని నిలిపివేసింది.

దైహస్తు మూవ్ (1997)

దైహస్తు మూవ్ (1997)

దైహస్తు ఈ కారును 1997లో మార్కెట్లో విడుదల చేసింది. అప్పట్లో కంపెనీ దీని మార్కెటింగ్ చిత్రవిచిత్రమైన ప్రయోగాలు చేసింది. అయినప్పటికీ, ఇది సక్సెస్ కాలేకపోయింది.

మిత్సుబిషి కరిస్మా (1995)

మిత్సుబిషి కరిస్మా (1995)

కారును తయారు చేయటమే కాదు, ఆ కారుకు సరైన పేరును పెట్టడం కూడా ఎంతో అవసరం. ఈ కారు విషయంలో మిత్సుబిషి అదే తప్పు చేసింది. కరిష్మా అంటే ట్రబుల్ అని అర్థమట. ఈ కారు పరాజయానికి దీని పేరే కారణమని ఈ సర్వేలో తేలింది.

సుజుకి ఎక్స్-90 (1995)

సుజుకి ఎక్స్-90 (1995)

ఇదొక టూ-సీటర్ మినీ ఎస్‌యూవీ. అయితే, దీని పూర్ హ్యాండ్లింగ్, లిమిటెడ్ ఆఫ్ రోడింగ్ సామర్థ్యం, వికారమైన స్టయిలింగ్ వంటి ఫీచర్లతో ఇది మార్కెట్లో సక్సెస్ సాధించలేకపోయింది. కేవలం రెండేళ్ల మాత్రమే ఈ కారు హవా కొనసాగింది.

రెనో అవాంటైమ్ (2001)

రెనో అవాంటైమ్ (2001)

ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో నుంచి అట్టర్ ఫ్లాప్ అయిన మోడళ్లలో ఈ మోడల్ కూడా ఒకటి. మొత్తం 18 నెలలకు గాను రెనో కేవలం 4,000 యూనిట్ల అవాంటైమ్ కార్లను మాత్రమే విక్రయించగలిగిందంటేనే ఈ మోడల్ పాపులారిటీ ఏంటో అర్థమవుతుంది.

స్కొడా ఎస్టెలె (1988)

స్కొడా ఎస్టెలె (1988)

స్కొడా 1988లో ఈ సెడాన్‌ను ప్రవేశపెట్టింది. మొదట్లో ఈ కారు అమ్మకాలు సజావుగా సాగినప్పటికీ, 1991లో ఫోక్స్‌‌వ్యాగన్ గ్రూప్, స్కొడా కంపెనీలో వాటాలు కొనుగోలు చేసిన తర్వాత పరిస్థితులు తారుమారయ్యాయి.

లెక్సస్ ఎస్‌సి 430 (2001)

లెక్సస్ ఎస్‌సి 430 (2001)

గొప్పవాళ్లు అప్పుడప్పుడూ తప్పులు చేస్తుంటారనడానికి ఇదొక ఉదాహరణ. లెక్సస్ 2001లో విడుదల చేసిన ఈ 4-సీటర్, 2-డోర్ కారు మార్కెట్లో మంచి ఆదరణ పొందలేకపోయింది.

నిస్సాన్ సెరెనా (1992)

నిస్సాన్ సెరెనా (1992)

ఎవ్వరు కూడా పెర్ఫామెన్స్ కోసం ఎమ్‌పివిని కొనుగోలు చేయరు. అందుకే నిస్సాన్ సెరెనా పరాజయం పాలైంది. ఇందులో 2.3 లీటర్ డీజిల్ ఇంజన్ ఉన్నప్పటికీ, దీని యాక్సిలేషన్ నెమ్మదిగా ఉంటుందని కొనుగోలుదారులు ఈ మోడల్‌ను బహిష్కరించేవారు.

సిట్రోయెన్ సి3 ప్లూరీల్ (2003)

సిట్రోయెన్ సి3 ప్లూరీల్ (2003)

ఈ కారు రూఫ్‌ను మ్యాన్యువల్‌గా తొలగించుకొని కన్వర్టిబల్ కారుగా మార్చుకోవచ్చు. అయితే, ఇందుకు కాస్తంత కండబలం కావాలి. అలాగే, ఇలా తొలగించిన రూఫ్‌ను దాచుకునేందుకు కారులో స్థలంలో లేదు. ఇలాంటి అసౌకర్యాలతో ఈ కారు ఫ్లాప్ అయ్యింది.

క్రైస్లర్ పిటి క్రూజర్ కన్వర్టిబల్ (2005)

క్రైస్లర్ పిటి క్రూజర్ కన్వర్టిబల్ (2005)

ఈ కన్వర్టిబల్ కారు సూర్యరశ్మి ఎక్కువగా ఉండే అమెరికా రాష్ట్రాల్లో మంచి సక్సెస్‌ను సాధించింది కానీ, వర్షం పడే ప్రాంతాలకు పనికిరాదని విమర్శకులు చెప్పేవారు. పైగా ఇది నాణ్యత, డ్రైవర్ ఎంజాయ్‌మెంట్ వంటి అంశాల్లో విఫలమైందని సమాచారం.

ఎఫ్ఎస్ఓ పోలోనెజ్

ఎఫ్ఎస్ఓ పోలోనెజ్

ఫియట్ 125పి మోడల్‌కు రీబాడీడ్ చేయబడిన కారే ఈ ఎఫ్ఎస్ఓ పోలోనెజ్. పోలండ్‌కు చెందిన ఎఫ్ఎస్ఓ కంపెనీ ఈ కారును తయారు చేసింది. పూర్ పెర్ఫామెన్స్ కారణంగా 1997లో దీని దిగుమతులు నిలిపివేశారు.

More from DriveSpark

Article Published On: Friday, October 4, 2013, 16:28 [IST]
English summary
UK based automobile publication AutoExpress has now included the CityRover in its Top 10 Worst Cars in the past 25 years list.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+