టాటా మాంజా క్లబ్ క్లాస్ డీజిల్ ఇప్పుడు రూ.5.99 లక్షలకే
టాటా మోటార్స్ అందిస్తున్న మాంజా క్లబ్ క్లాస్ సెడాన్ ధరలు ఇ్పపుడు మరింత దిగొచ్చాయి. ప్రస్తుతం కేవలం రూ.5.99 లక్షల ప్రారంభ ధరకే టాటా మోటార్స్ తమ మాంజా క్లబ్ క్లాస్ డీజిల్ కారును అందిస్తోంది. గడచిన అక్టోబర్ నెలలో టాటా మాంజా క్లబ్ క్లాస్ సెడాన్ దేశీయ విపణిలో విడుదలైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఈ కారు యజమానుల కోసం 'క్లబ్ క్లాస్ సర్వీస్' అనే ఓ ప్రత్యేక సర్వీస్ స్కీమ్‌ను పరిచయం చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ స్కీమ్‌లో భాగంగా, షోరూమ్‌లు, సర్వీస్ సెంటర్లలో టాటా మాంజా క్లబ్ క్లాస్ కార్లను అటెండ్ అయ్యేందుకు కంపెనీ డెడికేటెడ్ మేనేజర్లను అపాయింట్ చేసింది.
కాగా.. తాజాగా మాంజా క్లబ్ క్లాస్ సెడాన్ ధరను తగ్గించడంతో పాటుగా 'క్లబ్ క్లాస్ బైబ్యాక్ అశ్శూరెన్స్' అనే మరొక కొత్త స్కీమ్‌ను టాటా మోటార్స్ పరిచయం చేసింది. ఈ స్కీమ్‌లో భాగంగా, క్లబ్ క్లాస్ మాంజా కారును కొనుగోలు చేసిన వారు, 3 ఏళ్ల తర్వాత సదరు కారును అమ్మేయాలనుకుంటే, ఆ కారు విలువలో 60 శాతం రీసేల్ వ్యాల్యూని టాటా మోటార్స్ నుంచి పొందవచ్చు. ఈ కారులో కంపెనీ అందిస్తున్న క్లబ్ క్లాస్ ఫీచర్లను క్రింది ఫోటో ఫీచర్‌లో గమనించవచ్చ. టాటా మాంజా క్లబ్ క్లాస్ ప్రస్తుత ధరలు ఇలా ఉన్నాయి:
- టాటా మాంజా ఎల్ఎక్స్ క్యూజెట్ 90పిఎస్ బిఎస్4 - రూ. 5.99 లక్షలు
- టాటా మాంజా ఎల్ఎక్స్ క్యూజెట్ 90పిఎస్ బిఎస్4 - రూ. 6.54 లక్షలు
- టాటా మాంజా విఎక్స్ క్యూజెట్ 90పిఎస్ బిఎస్4 - రూ. 7.19 లక్షలు
- టాటా మాంజా ఈఎక్స్ క్యూజెట్ 90పిఎస్ బిఎస్4 - రూ. 8.14 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

Tata Manza Club Class
టాటా మోటార్స్ అందిస్తున్న మాంజా క్లబ్ క్లాస్ సెడాన్ ధరలు ఇ్పపుడు మరింత దిగొచ్చాయి. ప్రస్తుతం కేవలం రూ.5.99 లక్షల ప్రారంభ ధరకే టాటా మోటార్స్ తమ మాంజా క్లబ్ క్లాస్ డీజిల్ కారును అందిస్తోంది.

టాటా మాంజా క్లబ్ క్లాస్ - ఫీచర్లు
* శ్రేణిలో కెల్లా ఉత్తమమైన క్యాబిన్ స్పేస్
* విలాసవంతమైన ఇంటీరియర్స్
* రిచ్ ఇటాలియన్ లెథర్ సీట్స్
* పూర్తి ఆటోమేటిక్ ఎయిర్ కండిషనింగ్
* ఇన్-బిల్ట్ జిపిఎస్‌తో కూడిన టచ్‌స్క్రీన్ మల్టీ-మీడియా ఇంటర్‌ఫేస్
* కాంట్రాస్ట్ రూఫ్
* 8 స్ప్లిట్-స్పోక్ అల్లాయ్ వీల్స్

టాటా మాంజా క్లబ్ క్లాస్ - ఫీచర్లు
టాటా మాంజా క్లబ్ క్లాస్ మైలేజ్:
టాటా మాంజా క్లబ్ క్లాస్‌లో ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన 90 పిఎస్ క్వాడ్రాజెట్ డీజిల్ ఇంజన్, సఫైర్ పెట్రోల్ ఇంజన్లను ఉపయోగించారు. క్వాడ్రాజెట్ డీజిల్ ఇంజన్ లీటర్ డీజిల్‌కు 21.02 కి.మీ. మైలేజీని, సఫైర్ పెట్రోల్ ఇంజన్ లీటర్ పెట్రోల్‌కు 13.7 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

టాటా మాంజా క్లబ్ క్లాస్ - ఫీచర్లు
టాటా మాంజా క్లబ్ క్లాస్ సేఫ్టీ, సెక్యూరిటీ ఫీచర్లు:
కొలాప్సబల్ స్టీరింగ్ కాలమ్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇంజన్ ఇమ్మొబిలైజర్, సెంట్రల్ లాకింగ్ వంటి సెక్యూరిటీ ఫీచర్లు కారు భద్రతకు మరింత సురక్షితను చేకూర్చి పెడుతాయి.

టాటా మాంజా క్లబ్ క్లాస్ - ఫీచర్లు
టాటా మాంజా క్లబ్ క్లాస్ కలర్స్, వేరియంట్స్:
టాటా మాంజా క్లబ్ క్లాస్ ఇన్ఫినిటీ బ్లాక్ (కొత్త కలర్), టైరియాన్ వైన్, లేజర్ రెడ్, క్యాస్టల్ గ్రే, డ్యూ వైట్ మరియు జెట్ సిల్వర్ అనే ఆరు ఆకర్షనీయమైన రంగులలో ఎల్ఎస్, ఎల్ఎక్స్, విఎక్స్, ఈఎక్స్ఎల్ (లెథర్ వేరియంట్) అనే ఐదు వేరియంట్లలో లభ్యమవుతుంది.

టాటా మాంజా క్లబ్ క్లాస్ - ఫీచర్లు
టాటా మాంజా క్లబ్ క్లాస్ సర్వీసింగ్:
టాటా మాంజా క్లబ్ క్లాస్ యజమానుల కోసం కంపెనీ ఓ ప్రత్యేక సర్వీస్ స్కీమ్‌ను ఆఫర్ చేస్తోంది. షోరూమ్‌లు, సర్వీస్ సెంటర్లలో టాటా మాంజా క్లబ్ క్లాస్ కార్లను అటెండ్ అయ్యేందుకు కంపెనీ డెడికేటెడ్ మేనేజర్లను అపాయింట్ చేసింది. ఈ కొత్త కారు 2 ఏళ్లు లేదా 75,000 కిలోమీటర్ల వారంటీతో లభిస్తుంది (ఏది ముందుగా ముగిస్తే అది).

టాటా మాంజా క్లబ్ క్లాస్ - ఫీచర్లు
టాటా మాంజా క్లబ్ క్లాస్ ధరలు:
* టాటా మాంజా ఎల్ఎక్స్ క్యూజెట్ 90పిఎస్ బిఎస్4 - రూ. 5.99 లక్షలు
* టాటా మాంజా ఎల్ఎక్స్ క్యూజెట్ 90పిఎస్ బిఎస్4 - రూ. 6.54 లక్షలు
* టాటా మాంజా విఎక్స్ క్యూజెట్ 90పిఎస్ బిఎస్4 - రూ. 7.19 లక్షలు
* టాటా మాంజా ఈఎక్స్ క్యూజెట్ 90పిఎస్ బిఎస్4 - రూ. 8.14 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

టాటా మాంజా క్లబ్ క్లాస్ - ఫీచర్లు
లగ్జరీ ఫీల్‌ను ఇచ్చే క్యాబిన్ ఇంటీరియర్స్

టాటా మాంజా క్లబ్ క్లాస్ - ఫీచర్లు
స్టీరింగ్ వీల్‌పై ఆడియో కంట్రోల్స్

టాటా మాంజా క్లబ్ క్లాస్ - ఫీచర్లు
ఆల్-పవర్ విండోస్

టాటా మాంజా క్లబ్ క్లాస్ - ఫీచర్లు
లెథర్‌తో కప్పబడిన గేర్‌నాబ్


Click it and Unblock the Notifications








