త్వరలో టాటా మాంజా హైబ్రిడ్ సెడాన్ విడుదల!

By Ravi

భారత ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించిన మాంజా హైబ్రిడ్ వెర్షన్‌ను కంపెనీ త్వరలోనే మార్కెట్లో విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దేశీయ విపణిలో హైబ్రిడ్ వాహనాలకు డిమాండ్ క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో, మాంజా హైబ్రిడ్ కూడా మార్కెట్లో సక్సెస్ సాధించవచ్చని కంపెనీ భావిస్తోంది.

టొయోటా ఇప్పటికే తమ ప్రియస్ హైబ్రిడ్ కారును భారత్‌లో విక్రయిస్తోంది. అయితే, టొయోటా ఈ కారును విదేశాల నుంచి దిగుమతి చేసుకొని ఇక్కడి మార్కెట్లో విక్రయిస్తోంది. అందుకే దీని ధర కూడా ఎక్కువగా ఉండటం, ఫలితంగా డిమాండ్ తగ్గిపోవటం వంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ టాటా మోటార్స్ మాత్రం మాంజా హైబ్రిడ్‌ను పూర్తిగా భారత్‌లోనే తయారు చేయటం వలన ఇది సరసమైన ధరకే అందుబాటులోకి వచ్చే ఆస్కారం ఉంది.

Tata Manza Hybrid Launching Soon

టాటా హైబ్రిడ్ కారు మార్కెట్లో విడుదలైతే, దేశీయ విపణిలో హైబ్రిడ్ కారును ఆఫర్ చేయనున్న మొట్టమొదటి ఇండియన్ కంపెనీగా టాటా మోటార్స్ రికార్డు సృష్టిస్తుంది. మాంజా హైబ్రిడ్ కారులో ఓ 1.05 లీటర్ డైరెక్ట్ కామన్ రెయిల్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్‌తో పాటుగా ఓ 45 ఎలక్ట్రిక్ ట్రాక్షన్ మోటార్‌ను కూడా ఉపయోగించనున్నారు. ఈ కారులో కంపెనీ సివిటి (కంటిన్యూస్లీ వేరియబల్ ట్రాన్సిమిషన్)ని ఆఫర్ చేయనున్నారు.

డీజిల్ పవర్ ప్లస్ ఎలక్ట్రిక్ పవర్‌తో కలిపి ఫుల్ ట్యాంక్‌పై 1000 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని టాటా మోటార్స్ చెబుతోంది. అయితే, ఈ ఇంజన్లు విడుదల చేసే శక్తిని, కొన్ని ఇతర సాంకేతిక వివరాలను టాటా మోటార్స్ ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే కంపెనీ వీటి గురించి వెల్లడించే ఆస్కారం ఉంది. ప్రస్తుతం దేశీయ విపణిలో మాంజా ధరలు రూ.5.86 లక్షల నుంచి రూ.8.08 లక్షల రేంజ్‌లో ఉన్నాయి. మాంజా హైబ్రిడ్ ధర వీటి కన్నా మరింత ఎక్కువగా ఉండనుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Wednesday, May 28, 2014, 16:45 [IST]
English summary
Indian automobile giant Tata Motors had showcased their Hybrid version of their Manza sedan at the 2014 Auto Expo, which was held in New Delhi. The acceptance of hybrid vehicles in India is growing gradually and Tata feels its hybrid sedan will be in demand soon.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+