టాటా మోటార్స్ నుంచి ఎనిమిది అప్‌గ్రేడెడ్ కార్లు విడుదల
తగ్గుముఖం పడుతున్న అమ్మకాలను పెంచుకునేందు, సెగ్మెంట్లో పోటీదారుల నుంచి ఎదురవుతున్న పోటీని సమర్థవంతంగా ఎదుర్కునేందుకు దేశీయ ఆటోదిగ్గజం టాటా మోటార్స్ సరికొత్త ప్రణాళికలకు తెరలేపింది. ఇందులో భాగంగా, కంపెనీ అందిస్తున్న ఐదు కార్ బ్రాండ్లలో ఎనిమిది ఆధునీకరించిన (అప్‌గ్రేడెడ్) మోడళ్లను మార్కెట్‌కు పరిచయం చేసింది.
టాటా ఇండిగో ఈసిఎస్, టాటా సుమో గోల్డ్, టాటా నానో, టాటా ఇండికా, టాటా సఫారీ స్టోర్మ్ బ్రాండ్లలో మొత్తం 8 అప్‌గ్రేడెడ్ వెర్షన్లను పూణేలో జరిగిన ఓ కార్యక్రమంలో టాటా మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ కార్ల్ స్లిమ్ ఆవిష్కరించారు. మంచి ఉత్పత్తులపై దృష్టి, ప్రపంచ స్థాయి తయారీ పద్ధతులపై దృష్టి, ఉత్తమ వినియోగదారుల కొనుగోలు అనుభూతి మరియు సేవల నాణ్యత అనే నాలుగు కీలక అంశాలపై దృష్టి సారించే తమ 'హారిజోనెక్స్ట్' ప్రణాళికలో భాగంగా ఈ కొత్త కార్లను విడుదల చేస్తున్నామని ఆయన అన్నారు.
ఈ ఎనిమిది అప్‌గ్రేడెడ్ మోడళ్లలో ఇప్పటికే సిద్ధమయ్యాయని, మిగిలినవి రానున్న మూడు నెలల్లో మార్కెట్లోకి విడుదల చేస్తామని కార్ల్ స్లిమ్ చెప్పారు. ఈ అప్‌గ్రేడెడ్ మోడళ్లలో టాటా నానో, టాటా ఇండికా, టాటా ఇండిగో మోడళ్లలో సీఎన్‌జీ వేరియంట్లను కూడా అతి త్వరలోనే మార్కెట్లో ప్రవేశపెట్టనున్న ఆయన తెలిపారు. ప్రస్తుతం టాటా మోటార్స్ అందిస్తున్న ఇండిగో కార్ల శ్రేణి ధరలు రూ.4.99 లక్షల నుంచి రూ. 5.29 లక్షల రేంజ్‌లో ఉండగా, టాటా నానో ధరలు రూ. 1.50 లక్షల నుంచి, టాటా సుమో గోల్డ్ ధరలురూ.5.83 లక్షల నుంచి, టాటా ఇండికా ధర రూ. 3.99 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి. (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

5 బ్రాండ్లలో అప్‌గ్రేడెడ్ కార్లు

8 అప్‌గ్రేడెడ్ కార్లను లాంచ్ చేసిన టాటా మోటార్స్

అప్‌గ్రేడెడ్ టాటా ఇండిగో ఈసిఎస్

అప్‌గ్రేడెడ్ టాటా ఇండిగో ఈసిఎస్

అప్‌గ్రేడెడ్ టాటా ఇండిగో ఈసిఎస్ ఇంటీరియర్

అప్‌గ్రేడెడ్ టాటా ఇండిగో ఈసిఎస్ ఈమ్యాక్స్ (సిఎన్‌జి వెర్షన్)

అప్‌గ్రేడెడ్ టాటా ఇండికా ఈవి2

అప్‌గ్రేడెడ్ టాటా ఇండికా ఈవి2 ఈమ్యాక్స్ (సిఎన్‌జి వెర్షన్)

అప్‌గ్రేడెడ్ 2013 టాటా నానో

అప్‌గ్రేడెడ్ 2013 టాటా నానో

2013 టాటా నానో ఈమ్యాక్స్ (సిఎన్‌జి వెర్షన్)

2013 టాటా నానో ఈమ్యాక్స్ (సిఎన్‌జి వెర్షన్) - ఇంటీరియర్

అప్‌గ్రేడెడ్ 2013 టాటా సుమో గోల్డ్

అప్‌గ్రేడెడ్ 2013 టాటా సుమో గోల్డ్ - ఇంటీరియర్



Click it and Unblock the Notifications








