ఆటో ఎక్స్‌పో 2014లో 'టాటా జంప్' ఎస్‌యూవీ లాంచ్

కాంపాక్ట్ ఎస్‌యూవీ తయారీదారుల జాబితాలోకి తాజాగా దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ వచ్చి చేరనుంది. టాటా మోటార్స్ ఇప్పటి వరకు దేశీయ విపణిలో సబ్-ఫోర్ మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీని ఆఫర్ చేయలేదు. అయితే, ఈ సెగ్మెంట్లోకి ప్రవేశించిన ఫోర్డ్, రెనో, నిస్సాన్, మహీంద్రా వంటి కంపెనీలు తమ కాంపాక్ట్ ఎస్‌యూవీలతో మంచి సక్సెస్‌ను తమ ఖాతాలో వేసుకున్న నేపథ్యంలో, టాటా మోటార్స్ కూడా ఈ సెగ్మెంట్లోని అవకాశాలను చేజిక్కించుకునేందుకు కొంచెం ఆలస్యంగానే సిద్ధమైందని చెప్పాలి.

టాటా మోటార్స్ ఇప్పుడు నాలుగు మీటర్ల కన్నా తక్కువ పొడవు ఉంటే ఓ కాంపాక్ట్ ఎస్‌యూవీని అభివృద్ధి చేస్తోంది. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ 'టాటా జంప్' అనే పేరును ఖరారు చేసినట్లు సమాచారం. వచ్చే నెలలో జరగనున్న 2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో టాటా మోటార్స్ ఈ బుజ్జి ఎస్‌యూవీని ఆవిష్కరించనుంది. కంపెనీ నుంచి పాపులర్ అయిన 'ఎక్స్1 ప్లాట్‌ఫామ్'ను ఆధారంగా చేసుకొని ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని తయారు చేస్తున్నారు. ఇదే ప్లాట్‌ఫామ్‌పై విస్టా, ఫాల్కన్ రేంజ్ మోడళ్లు తయారవుతున్నాయి.

Tata Motors Jump

టాటా జంప్ టాటా మోటార్స్‌కు తొలి సబ్-4 మీటర్ ఎస్‌యూవీ కావడంతో పాటుగా, టాటా ఈ ఎస్‌యూవీ విడుదలతో కొత్త డిజైన్ ఫిలాసఫీని మార్కెట్‌కు పరిచయం చేయనుంది. భవిష్యత్తులోని టాటా కార్లలో ఈ ఫ్యూచర్ డిజైన్ ఉపయోగించే అవకాశం ఉంది. టాటా జంప్ ఎస్‌యూవీలో 100 హెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేసే 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది.

ఇది టాటా మోటార్స్ ఇటీవలే ఆవిష్కరించిన రెవట్రాన్ సిరీస్ ఇంజన్ ఫ్యామిలీకి చెందినదని సమాచారం. ఇందులో కొత్త డీజిల్ ఇంజన్‌ను కూడా పరిచయం చేసే అవకాశం ఉంది. టాటా జంప్ ప్రొడక్షన్ వెర్షన్ 2015లో విడుదల కావచ్చని అంచనా. ఇది ఈ సెగ్మెంట్లోని ఫోర్డ్ ఈకోస్పోర్ట్, రెనో డస్టర్‌లతో పాటుగా త్వరలో మారుతి సుజుకి, షెవర్లే, హ్యుందాయ్ మరియు హోండాల నుంచి విడుదల కానున్న కాంపాక్ట్ ఎస్‌యూవీలకు సవాలుగా నిలువనుంది.

More from DriveSpark

Article Published On: Saturday, January 25, 2014, 16:45 [IST]
English summary
It is reported that Tata Motors will showcase its first sub-4 meter SUV, called Jump, in concept form at the upcoming Auto Expo 2014. The Jump will be based on the company's X1 platform that also forms the base of the Vista and the soon to be revealed ‘Falcon' vehicle range.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+