టాటా ఇండికా, ఇండిగో మోడళ్లలో సిఎన్‌జి వెర్షన్స్ విడుదల
దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ భారత మార్కెట్లో విక్రయిస్తున్న ఇండికా హ్యాచ్‌బ్యాక్, ఇండిగో సెడాన్ మోడళ్లలో సిఎన్‌జి వెర్షన్లను విడుదల చేసింది. గడచిన జూన్ నెలలో టాటా మోటార్స్ తమ 'హారిజానెక్స్ట్' ప్రణాళికలో భాగంగా, ఈమ్యాక్స్ సిరీస్‌లో సిఎన్‌జి వెర్షన్ ఇండికా, ఇండిగో మోడళ్లను ఆవిష్కరించింది. కాగా.. కంపెనీ ఇప్పుడు వీటిని వాణిజ్య పరంగా అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఇండికా ఈమ్యాక్స్: ఇంజన్, మైలేజ్, ధర
ఇండికా ఈమ్యాక్స్ కారులో 1.2 లీటర్, 4-సిలిండర్ బై-ఫ్యూయెల్ (సిఎన్‌జి, పెట్రోల్) ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 65 హెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది కేజీ సిఎన్‌జికి 23.7 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది. కొత్త టాటా ఇండికా ఈమ్యాక్స్ సిఎన్‌జి వెర్షన్ ధరలు రూ.3.99 (జిఎల్ఎస్ వేరియంట్) లక్షల నుంచి రూ.4.26 లక్షల (జిఎల్ఎక్స్ వేరియంట్) రేంజ్‌లో ఉన్నాయి.

ఇండిగో ఈమ్యాక్స్: ఇంజన్, మైలేజ్, ధర
ఇండిగో ఈమ్యాక్స్ కారులో 1.2 లీటర్, 4-సిలిండర్ బై-ఫ్యూయెల్ (సిఎన్‌జి, పెట్రోల్) ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 65 హెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది కేజీ సిఎన్‌జికి 24.6 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది. కొత్త టాటా ఇండికా ఈమ్యాక్స్ సిఎన్‌జి వెర్షన్ ధరలు రూ.4.99 (జిఎల్ఎస్ వేరియంట్) లక్షల నుంచి రూ.5.27 లక్షల (జిఎల్ఎక్స్ వేరియంట్) రేంజ్‌లో ఉన్నాయి. (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

ఈ సందర్భంగా, టాటా మోటార్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ యూనిట్, కమర్షియల్) అంకుష్ అరోరా మాట్లాడుతూ.. భారత మార్కెట్లో మార్కెట్లో సిఎన్‌జి ఇంధనానికి క్రమంగా డిమాండ్ పెరుగుతోందని, దీనికి అనుగుణంగా తాము తమ సిఎన్‌జి వాహణాల శ్రేణిని విస్తరించడం సంతోషంగా ఉందని అన్నారు. కొత్త సిఎన్‌జి వెర్షన్ ఇండికా, ఇండిగో వాహనాలను ఢిల్లీతో పాటుగా మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, త్రిపుర మార్కెట్లలో ప్రవేశపెట్టనున్నాట్లు కంపెనీ పేర్కొంది.
టాటా తమ హారిజానెక్స్ట్ ప్రణాళికలో భాగంగా సిఎన్‌జి వెర్షన్ నానో కారును కూడా ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. గడచిన అక్టోబర్ నెలలో టాటా మోటార్స్ టాటా నానో ఈమ్యాక్స్ సిఎన్‌జిని మార్కెట్లో విడుదల చేసింది. నానో ఈమ్యాక్స్ సిఎక్స్ ధర రూ.2.45 లక్షలు గాను, నానో ఈమ్యాక్స్ ఎల్ఎక్స్ ధర రూ.2.72 లక్షలు (ఎక్స్-షోరూమ్) గాను ఉన్నాయి.


Click it and Unblock the Notifications








