'టాటా విస్టా విఎక్స్ టెక్' విడుదల; ధర, ఫీచర్లు
దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ భారత మార్కెట్లో విక్రయిస్తున్న విస్టా సిరీస్‌లో మరో కొత్త వేరియంట్‌ను మార్కెట్లో విడుదల చేసింది. 'విస్టా విఎక్స్ టెక్' (Vista VX Tech) పేరిట కంపెనీ ఓ కొత్త వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. ఫస్ట్ ఇన్ క్లాస్ హైటెక్ ఫీచర్స్, 75 పిఎస్ ఇంజన్‌తో ఈ అడ్వాన్స్డ్, డైనమిక్ కారును తయారు చేశామని, ఇందులో అధునాతన టెక్నలాజికల్ ఫీచర్లను జోడించామని టాటా మోటార్స్ తెలిపింది.
కొత్త 'టాటా విస్టా విఎక్స్ టెక్' కారులో జిపిఎస్ నావిగేషన్‌తో కూడిన మల్టీ మీడియా సిస్టమ్, కొత్త డ్రైవ్ ప్రో కన్సోల్, అడ్వాన్స్డ్ డ్రైవర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, కొత్త ఫ్రంట్ డ్యుయో-ఫ్లోట్ సస్పెన్షన్, స్టీరింగ్ వీల్‌పై కంట్రోల్స్, బ్లూ-5 టెక్నాలజీ వంటి బెస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లతో ఈ సెగ్మెంట్లోని ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మోడళ్లకు గట్టి పోటీనిచ్చేలా ఈ వెర్షన్‌ను అభివృద్ధి చేసినట్లు కంపెనీ తెలిపింది.

కొత్త టాటా విస్టా విఎక్స్ టెక్ టాప్-ఎండ్ లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్లో, 6.5 ఇంచ్ టిఎఫ్‌టి టచ్‌స్క్రీన్ మల్టీమీడియా సిస్టమ్‌ను ఆఫర్ చేస్తున్నారు. ఇది ఆడియో, వీడియో ప్లేయర్‌గా పనిచేస్తుంది. సిడి, డివిడి, యూఎస్‌బి, బ్లూ-5 (5 విభిన్న మొబైల్ ఫోన్లను బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు), ఆక్స్-ఇన్ కనెక్టివిటీలను సోపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా, ఇది జిపిఎస్ నావిగేషన్ సిస్టమ్‌లా కూడా పనిచేస్తుంది.
స్టీరింగ్ వీల్‌పై ఉండే కంట్రోల్ సాయంతో ఈ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను సులభంగా కంట్రోల్ చేయవచ్చు. ఇంకా ఇందులో డ్రైవర్ ప్రో కన్సోల్ అనే అధునాతన డ్రైవర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌ను కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇందులో డిజిటల్ క్లాక్, డ్రైవింగ్ మోడ్, మైలేజ్, సగటు మైలేజ్ మొదలైన విషయాలను తెలుసుకోవచ్చు. రెడ్ లైన్స్ కలిగిన టాకోమీటర్ ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

విస్టా రేంజ్ కార్లు బ్లూ చిల్ అనే కొత్త ఎక్స్టీరియర్ కలర్‌లో లభ్యం కానున్నాయి. ఇందులోని ఇంటీరియర్స్ డ్యూయెల్ టోన్ ఆప్షన్‌తో లభిస్తాయి. విస్టా మొత్తం మూ3 వేరియంట్లలో (ఎల్ఎస్, ఎల్ఎక్స్, విఎక్స్ టెక్) వేరియంట్లలో లభ్యం కానుంది.
ఎల్ఎస్ వేరియంట్ 1.4 లీటర్ టిడిఐ బిఎస్3 మరియు క్వాడ్రాజెట్ 75 పిఎస్ బిఎస్4 డీజిల్ ఇంజన్లతో లభ్యం కానుంది. ఎల్ఎక్స్ వేరియంట్ కేవలం 1.4 లీటర్ టిడిఐ బిఎస్3 డీజిల్ ఇంజన్‌తో మాత్రమే లభిస్తుంది. కాగా.. టాప్-ఎండ్ లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్ విఎక్స్ టెక్‍ను 1.3 లీటర్ క్వాడ్రాజెడ్ 75 పిఎస్ బిఎస్4 డీజిల్ ఇంజన్‌తో ఆఫర్ చేస్తున్నారు. భారత మార్కెట్లో విస్టా రేంజ్ ధరలు రూ.4.94 లక్షలు (విస్టా ఎల్ఎస్) నుంచి రూ.5.99 లక్షలు (విస్టా విఎక్స్ టెక్) రేంజ్‌లో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).



Click it and Unblock the Notifications








