నానో ప్లాంట్‌‌ను తాత్కాలికంగా మూసివేయనున్న టాటా

By Ravi

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ఇటీవలే తమ నానోను అప్‌గ్రేడ్ చేసి పవర్ స్టీరింగ్‌తో పాటుగా మరికొన్ని స్మార్ట్ ఫీచర్లను జోడించి ఈ చవక కారును స్మార్ట్ సిటీ కారుగా నానో ట్విస్ట్ పేరుతో విడుదల చేసిన సంగతి తెలిసినదే. ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న రెగ్యులర్ నానోతో పాటుగానే ఈ నానో ట్విస్ట్‌ను కూడా ఆఫర్ చేస్తున్నారు.

టాటా నానో మరియు టాటా నానో ట్విస్ట్ రెండు వేరియంట్లను కూడా కంపెనీ గుజరాత్‌లోని సనంద్ ప్లాంట్‌లో ఉత్పత్తి చేస్తుంది. అయితే, కంపెనీ ప్రస్తుతం ఈ ప్లాంట్‌ను కొద్దిరోజుల పాటు మూసివేసి, ఉత్పత్తి నిలిపివేయాలని నిర్ణయించుకుంది. టాటా నానో మోడల్‌కు డిమాండ్ తక్కువగా ఉండటం, ఇప్పటికే స్టాక్ అధికంగా ఉండటంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.

Tata Motors Shutting Down Nano Plant

అయితే, రానున్న పండుగ సీజన్ నాటికి టాటా నానో డిమాండ్ పెరిగే అవకాశం ఉండటంతో, అప్పటికీ ఉత్పత్తిని తిరిగి ప్రారంభించాలని కంపెనీ నిర్ణయించుకుంది. దాదాపు 30-40 రోజుల పాటు ఈ ప్లాంట్‌లో నానో ఉత్పత్తిని నిలిపివేయనున్నారు. మరోవైపు టాటా మోటార్స్ కైట్ కోడ్‌నేమ్‌తో ఓ కొత్త కాంపాక్ట్ కారును అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసినదే.

టాటా కైట్ హ్యాచ్‌బ్యాక్ కారును కూడా గుజరాత్‌లోని సనంద్ ప్లాంట్‌లోనే ఉత్పత్తి చేయనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, టాటా కైట్ ఉత్పత్తి కోసం గుజరాత్ సనంద్ ప్లాంట్‌లో మార్పులు చేర్పులు చేసేందుకే నానో ఉత్పత్తిని షట్‌డౌన్ చేశారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ, టాటా నానో కొనుగోలుదారులను ఆకట్టుకోవటంలో దాదాపుగా విఫలమైందనే చెప్పాలి.

Article Published On: Saturday, June 14, 2014, 11:07 [IST]
English summary
Tata Motors has recently launched the updated and refreshed Nano Twist in India. They have done an excellent job of repositioning the hatchback as a smart city car. The Indian manufacturer produces its Nano at the Sanand facility in Gujarat. They have now decided to shut its manufacturing facility down for a matter of 30 to 40 days.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+