నానో స్టాండర్డ్ ఉత్పత్తి బంద్; నానో ట్విస్ట్ ఉత్పత్తి యధాతథం!
టాటా మోటార్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రజల కారు టాటా నానో ఉత్పత్తిని కంపెనీ నిలిపివేసినట్లు మేము ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. ఈ విషయంపై కంపెనీ ఉన్నతాధికారి ఒకరు స్పందిస్తూ.. పవర్ స్టీరింగ్ లేని నానో మోడళ్ల ఉత్పత్తిని మాత్రమే నిలిపివేస్తున్నామని, పవర్ స్టీరింగ్ కలిగిన నానో ట్విస్ట్ ఉత్పత్తి మాత్రం యధావిధిగా కొనసాగుతుందని వివరించారు.
రెగ్యులర్ టాటా నానో మరియు టాటా నానో ట్విస్ట్ రెండు వేరియంట్లను కూడా టాటా మోటార్స్ గుజరాత్‌లోని తమ సనంద్ ప్లాంట్‌లో ఉత్పత్తి చేస్తుంది. అయితే, ఈ ప్లాంట్‌లో పవర్ స్టీరింగ్ లేని అన్ని నానో వేరియంట్ల (స్టాండర్డ్, సిఎక్స్, ఎల్స్) ఉత్పత్తి నిలిపివేయాలని కంపెనీ నిర్ణయించింది. ఇప్పటికే స్టాక్ యార్డులలో మూలుగుతున్న నానో స్టాక్‌ను క్లియర్ చేసుకునేందుకే కంపెనీ ఈ చర్యలు తీసుకుంది.

మరోవైపు టాటా నానో ఎల్ఎక్స్ మరియు టాటా నానో ట్విస్ట్ ఎల్ఎక్స్ వేరియంట్లకు మధ్య ధర వ్యత్యాసం కేవలం రూ.20,000లుగా మాత్రమే ఉండటంతో పవర్ స్టీరింగ్ లేని నానోను కొనడం కన్నా పవర్ స్టీరింగ్ కలిగిన నానోను కొనుగోలు చేసేందుకు కస్టమర్లు మక్కువ చూపుతున్నారు. డీలర్లు కూడా నానో ఎల్ఎక్స్ కొనాలుకునే కస్టమర్లను నానో ట్విస్ట్‌ను కొనుగోలు చేసేలా చేస్తున్నారు.
టాటా మోటార్స్ ఇటీవలే తమ నానోను అప్‌గ్రేడ్ చేసి పవర్ స్టీరింగ్‌తో పాటుగా మరికొన్ని స్మార్ట్ ఫీచర్లను జోడించి ఈ చవక కారును స్మార్ట్ సిటీ కారుగా టాటా నానో ట్విస్ట్ పేరుతో విడుదల చేసిన సంగతి తెలిసినదే. స్టాండర్డ్ నానో కన్నా నానో ట్విస్ట్‌కు కస్టమర్ల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. ఈ నేపథ్యంలో, క్రమంగా నాన్-పవర్ స్టీరింగ్ టాటా నానోను మార్కెట్ నుంచి తొలగించేందుకు కంపెనీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. స్టాక్ క్లియర్ చేసుకునేందుకు రెగ్యులర్ నానోపై కంపెనీ భారీ డిస్కౌంట్‌ను కూడా ఆఫర్ చేస్తోంది.


Click it and Unblock the Notifications








