ఒకేసారి 100 నగరాల్లో టాటా బోల్ట్ విడుదల; అంచనా ధర..
జెస్ట్ కాంపాక్ట్ సెడాన్ తర్వాత టాటా మోటార్స్ నుంచి రానున్న రెండవ మోడల్ 'టాటా బోల్ట్' (Tata Bolt) హ్యాచ్‌బ్యాక్. తాజా అప్‌డేట్ ప్రకారం, టాటా బోల్ట్ మోడల్‌ను ఒకేసారి 100 నగరాల్లో విడుదల చేయాలని కంపెనీ భావిస్తున్నట్లు సమాచారం. టాటా మోటార్స్ తమ సరికొత్త బోల్ట్ కారును ఈనెల 22వ తేదీన భారత మార్కెట్లో విడుదల చేయనుంది.
ఈ నేపథ్యంలో, కంపెనీ ఇప్పటికే టాటా బోల్ట్ హ్యాచ్‌బ్యాక్ కోసం కంపెనీ ఆన్‌లైన్ బుకింగ్‌లను కూడా ప్రారంభించింది. ఆన్‌లైన్ ద్వారా ఈ కారును బుక్ చేసుకోవాలనుకునే వారు సైట్‌ను సందర్శించి, రూ.11,000 అడ్వాన్స్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

కాగా.. ఈ సెగ్మెంట్లో మారుతి స్విఫ్ట్‌కు గట్టి పోటీనిచ్చేలా టాటా మోటార్స్ తమ టాటా బోల్ట్ కారు ధరను రూ.4.25 లక్షల నుంచి రూ.6.50 లక్షల రేంజ్‌లో నిర్దేశించ వచ్చని అంచనా.
టాటా బోల్ట్ హ్యాచ్‌బ్యాక్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కానుంది. పెట్రోల్ వెర్షన్ కారులో 1.2 లీటర్ రెవోట్రాన్ టర్బోచార్జ్డ్ ఇంజన్‌ను, డీజిల్ వెర్షన్ కారులో 1.3 లీటర్ మల్టీజెట్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 90 పిఎస్‌ల శక్తిని, 140 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ ఇంజన్ గరిష్టంగా 75 పిఎస్‌ల శక్తిని, 190 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








