టాటా నానో డీజిల్ లాంచ్ ఖరారు; మార్చ్‌లో విడుదల!
టాటా మోటార్స్ నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న డీజిల్ వెర్షన్ టాటా నానో త్వరలోనే మార్కెట్లోకి రానుంది. టాటా నానో డీజిల్ కంపెనీ ఉన్నతాధికారి ఒకరు అధికారిక ప్రకటన జారీ చేశారు. ఈ నానో డీజిల్ వేరియంట్‌ను వచ్చే ఏడాది మార్చి నాటికి మార్కెట్లో అందుబాటులోకి తీసుకువస్తామని టాటా మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ కార్ల్ సిమ్ తెలిపారు.
గడచిన 2009వ సంవత్సరంలో ప్రపంచంలో కెల్లా అత్యంత చవక కారుగా విడుదలైన టాటా నానో, ఇప్పుడు ఆశించిన రీతిలో అమ్ముడుపోవటం లేదు. ఈ నేపథ్యంలో డీజిల్ వెర్షన్ నానో విడుదల ద్వారా అమ్మకాలు జోరందుకోగలవని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. గడచిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం అమ్మకాలు నానో అమ్మకాలు కాలు భాగం మాత్రమే నమోదయ్యాయి. మొత్తమ్మీద చూసుకుంటే గత ఆర్థిక సంవత్సరంలో నానో అమ్మకాలు 27 శాతం క్షీణించాయి.
ఇదిలా ఉండగా, టాటా నానో కారును స్మార్ట్ సిటీ కారుగా మార్చి, ఆ పేరురు తగినట్లుగానే ఇందులో పవర్ స్టీరింగ్‌తో పాటు మరికొన్ని అధనపు ఇంటెలిజెంట్ ఫీచర్లను జోడించి విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నామని, అంతేకాకుండా, ఇంటీరియర్లు, ఎక్స్టీరియర్లు మరియు మైలేజ్ అంశాలను మెరుగుపరచనున్నామని టాటా గ్రూపు చైర్మన్ సైరస్ మిస్త్రీ ఇటీవలే వెల్లడించిన సంగతి తెలిసినదే. ఈ పరిణాలు గమనిస్తుంటే 'టాటా నానో'కు మళ్లీ మంచి రోజులు రానున్నట్లు తెలుస్తోంది. మీరేమంటారు.



Click it and Unblock the Notifications








