టాటా మోటార్స్ అల్టిమేట్ డిసెంబర్ ఆఫర్ 2013
కార్ల కొనుగోలుదారులకు డిసెంబర్ నెలంటేనే డిస్కౌంట్స్ నెల. అనేక కార్ కంపెనీ పాత సంవత్సరపు స్టాక్‌ను క్లియర్ చేసుకునేందుకు, తమ అమ్మకాల లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రతి ఏటా డిసెంబర్ నెలలో, తమ ఉత్పత్తులపై భారీ తగ్గింపులను, వివిధ ప్రోత్సాహకాలను ఆఫర్ చేస్తూ, కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు.
ఇదే కోవలో, తాజాగా టాటా మోటార్స్ తమ కార్లపై భారీ తగ్గింపులను అందిస్తోంది. 'అల్టిమేట్ డిసెంబర్' ఆఫర్ పేరిట టాటా మోటార్స్ దాదాపు తమ అన్ని మోడళ్లపై డిస్కౌంట్లను, బెనిఫిట్లను అందిస్తోంది. ఈ ఆఫర్లలో భాగంగా, రూ.20,000ల నుంచి డౌన్‌పేమెంట్, రూ.1,00,000ల వరకు విలువైన ఆకర్షనీయమైన నగదు ప్రయోజనాలు, రూ.40,000 వరకు విలువైన ఎక్సేంజ్ బోనస్‌లను కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది.
టాటా మోటార్స్ విక్రయిస్తున్న వివిధ మోడళ్లపై కంపెనీ అందిస్తున్న డిస్కౌంట్ల వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

టాటా ఆఫర్స్
టాటా మోటార్స్ అందిస్తున్న ఎంట్రీ లెవల్ కారు నానో మొదలుకొని, కంపెనీ విక్రయిస్తున్న ప్రీమియం ఎస్‌యూవీ సఫారీ వరకు అన్ని మోడళ్లపై కంపెనీ తగ్గింపులను అందిస్తోంది. ఆ వివరాలను తర్వాతి స్లైడ్‌లో పరిశీలించండి.

టాటా ఇండికా
టాటా మోటార్స్ అందిస్తున్న ఇండికా సిరీస్ హ్యాచ్‌బ్యాక్ కార్లపై కంపెనీ రూ.30,000 వరకు బెనిఫిట్లను ఆఫర్ చేస్తోంది.

టాటా ఇండిగో
టాటా మోటార్స్ అందిస్తున్న ఇండిగో సెడాన్‌పై కంపెనీ రూ.35,000 వరకు బెనిఫిట్లను ఆఫర్ చేస్తోంది.

టాటా నానో
కంపెనీ విక్రయిస్తున్న చిన్న కారు టాటా నానో కొనుగోలుదారులు రూ.40,000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు.

టాటా సుమో గోల్డ్
ఈ డిసెంబర్ నెలలో టాటా సుమో గోల్డ్ ఎస్‌యూవీ కొనుగోలు చేసే కస్టమర్లు రూ.40,000 వరకు విలువైన ప్రయోజనాలను పొందవచ్చు.

టాటా సఫారీ
టాటా ప్రీమియం ఎస్‌యూవీపై సఫారీ స్టోర్మ్‌పై రూ.50,000 వరకు విలువైన ప్రయోజనాలను కస్టమర్లు సొంతం చేసుకోవచ్చు.

టాటా విస్టా
టాటా అందిస్తున్న పవర్‌ఫుల్ విస్టా కారుపై కంపెనీ రూ.60,000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు.

ఇకపోతే చివరిగా, టాటా మోటార్స్ ఆఫర్ చేస్తున్న ప్రీమియం సెడాన్ మాంజాపై గరిష్టంగా రూ.1,15,000 వరకు విలువైన బెనిఫిట్లను కంపెనీ అందిస్తోంది.


Click it and Unblock the Notifications








