జనవరి 28న మార్కెట్లోకి రానున్న టాటా విస్టా డి90

By Ravi

టాటా మోటార్స్ అందిస్తున్న 'విస్టా' హ్యాచ్‌బ్యాక్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని కంపెనీ అభివృద్ధి చేసిన పవర్‌ఫుల్ 'టాటా విస్టా డి90' ఈనెల 28న మార్కెట్లోకి రానుంది. టాటా మోటార్స్ తమ విస్టా డి90 కారు కోసం గడచిన నెల రోజులుగా ఓ ఆన్‌లైన్ కాంటెస్ట్‌ను కూడా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో, తమ కొత్త పవర్‌ఫుల్ 'టాటా విస్టా డి90' హ్యాచ్‌బ్యాక్‌ను జనవరి 28, 2013న న్యూఢిల్లీలోని బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యుట్‌లో టాటా మోటార్స్ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

ఈ సరికొత్త విస్టా డి90లో 1.3 లీటర్ క్వాడ్రాజెట్ డీజిల్ ఇంజన్ ఉపయోగించారు. ఇది గరిష్టంగా 88 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుతం లభిస్తున్న టాటా విస్టాలో ఉపయోగించిన ఇంజన్ గరిష్టంగా 75 బిహెచ్‌పిల శక్తిని మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. వేరియబల్ జియోమెట్రీ టర్బోఛార్జర్ (విజిటి)తో కూడిన ఈ ఇంజన్ గరిష్టంగా 200 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుత విస్టాతో పోల్చుకుంటే దీని టార్క్ 10 ఎన్ఎమ్‌లు అధికం. ఇది కేవలం 14 సెకండ్లలోనే 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది.

కొత్త విస్టాలో ఉపయోగించిన 1.3 లీటర్ క్వాడ్రాజెట్ డీజిల్ ఇంజన్‌ను ఇప్పటికే ఫియట్ పుంటో 90హెచ్‌పి స్పోర్ట్, లీనియా, టాటా మాంజా, మారుతి సుజుకి ఎస్ఎక్స్4 వంటి మోడళ్లలో ఉపయోగిస్తున్నారు. టాటా విస్టాలో నాల్గవ వెర్షన్ అయిన విస్టా డి90 విఎక్స్, జెడ్ఎక్స్ అనే రెండు వేరియంట్లలో లభ్యం కావచ్చని సమాచారం. విఎక్స్ వేరియంట్‌లో ఏబిఎస్, ఈబిడి ఫీచర్లను, జెడ్ఎక్స్ వేరియంట్‌లో ఎయిర్‌బ్యాగ్స్, అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లను పొందవచ్చు. దేశీయ విపణిలో వీటి ధరలు రూ.6.03 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి రూ.6.63 లక్షల (ఎక్స్-షోరూమ్) రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.

Tata Vista D90

కొత్త విస్టా డి90లో ఎక్స్టీరియర్ పరంగా ఎలాంటి మేజర్ మార్పులు లేవు. కేవలం ఇంజన్ మరియు కొద్దిపాటి ఇంటీరియర్ మార్పులు మాత్రమే ఈ మోడల్‌లో గమనించవచ్చు. దీని ఇంటీరియర్స్ మాంజా సెడాన్ ఇంటీరియర్స్‌ను పోలి ఉండనున్నాయి. ఇందులోని ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఇదివరకటి వెర్షన్లలో మాదిరిగా డ్యాష్‌బోర్డుకు మధ్యభాగంలో కాకుండా, స్టీరింగ్ వీల్ వెనుక భాగంలో ఉంటుంది. డ్యాష్‌బోర్డుకు కొద్దిపాటి లెథర్ వర్క్‌ను జోడించటం వలన ఈ వెర్షన్ మరింత ప్రీమియం ఫీల్‌ను అందిస్తుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, January 23, 2013, 15:09 [IST]
English summary
Tata Motors has officially announced the launch date of Vista D90 on January 28, 2013 (Monday) at the Buddh International Circuit, New Delhi. Vista D90 is powered by 88 bhp 1.3 litre Quadrajet diesel engine. It is expected to be priced between Rs. 6.03 lakhs and Rs. 6.63 lakhs (all prices ex-showroom).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+